%1$s

దోమలతో సోకే వ్యాధుల గురించి అవగాహన మరియు నివారణ చర్యలు

how prevent diseases from mosquitoes

ఈ మధ్యకాలంలో వస్తున్న వ్యాధుల్లో చాలామటుకు దోమకాటుకు సంబంధించినవే. దోమ అంత ప్రమాదకరమైంది.  దోమలతో సోకే వ్యాధుల గురించి తెలుసుకోండి. దోమకాటు చాలా ప్రమాదం. లేనిపోని రోగాలన్నీ దోమల ద్వారానే వస్తున్నాయని అనేక అధ్యయనాలు తెలిపాయి. 

పరిశుభ్రత లోపం వల్లే దోమలు రోజురోజుకూ వృద్ధి చెందుతూ తమ ఉనికిని చాటుతున్నాయి. హత్యలు, దాడుల వల్ల మరణిస్తున్నవారి కంటే దోమల వల్ల వచ్చే వ్యాధులతో మరణిస్తున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటున్నది. అంటే దోమల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మలేరియా 

ఆడ అనాఫిలీస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. మలేరియాతో బాధపడుతున్న రోగిని దోమ కుట్టడం వల్ల దాని కడుపులోకి వ్యాధికారక పరాన్నజీవి ప్రవేశించి అక్కడ పెరుగుతుంది. ఇదే దోమ మరో వ్యక్తిని కుట్టినప్పుడు ఆ వ్యక్తి రక్తంలోకి చేరి మలేరియాకు కారణమవుతుంది.

లక్షణాలు: చలి, వణుకుతో జ్వరం రావడం.. శరీర ఉష్ణోగ్రత పెరగడం.. జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. 

డెంగ్యూ

పగటి సమయంలో కుట్టే యెడీస్ ఆడ దోమల ద్వారా డెంగ్యూ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది సాధారణ వైర స్ జ్వరం. ఎముకలు, కండరాలు, కీళ్లనొప్పులతో జ్వరం మొదలవుతుంది. ప్లేట్లెట్స్ అమాంతం తగ్గిపోతాయి. 

లక్షణాలు: హఠాత్తుగా తీవ్ర జ్వరం రావడం, కదలలేని స్థితి, ఎముకలు, కండరాలలో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రని దద్దుర్లు, వాంతులు, వికారం, నోరు ఎండిపోవడంతో పాటు చిగుళ్లు, ముక్కు ద్వారా రక్తం వస్తుంది. 

మెదడువాపు

క్యూలెక్స్ ఆడదోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. జపనీస్ ఎన్సెఫలైటీస్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. ఎక్కువగా 2 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ వ్యాధి వస్తుంది.

 లక్షణాలు: ఆకస్మిక జ్వరం వచ్చి తీవ్రత ఎక్కువ కావడం, విపరీతమైన తలనొప్పి, వాంతులు రావడం, అపస్మారక స్థితికి లోనుకావడం, శరీరంలో ఏదో ఒకపక్క పక్షవాతానికి గురికావడం, ఫిట్స్ రావడం. ఈ వ్యాధి ఎక్కువగా 2 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల్లో వస్తుంది. 

చికున్ గున్యా

ఏడిస్ దోమల వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చేతులు.. కాళ్లలో.. కీళ్లలో వాపు వచ్చి కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. జ్వరంతో మనిషి బలహీనంగా తయారవుతాడు. 

లక్షణాలు: తలనొప్పి, వాంతులు, వికారంతో పాటు హఠాత్తుగా జ్వరం, కీళ్ల నొప్పులు, సరిగా నిలబడలేకపోవడం.

 పైలేరియా 

దీనిని బోదకాలు అని కూడా అంటారు. క్యూలెక్స్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శరీరంలోని ఏ భాగానికైనా బోదకాలు సోకుతుంది. 

లక్షణాలు: తరచూ జ్వరం, చంకల్లో, గజ్జల్లో బిల్లలు కట్టడం, వెన్నుపాము దగ్గరి నుంచి అన్ని అవయవాలకు వాపు, కాళ్లు, చేతులు, స్థనాలు, వరిబీజం, బుడ్డ, జ్ఞానేంద్రియాలు పాడవుతాయి.

దోమల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డెంగీ, చికున్ గున్యా, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధులను నివారించాలంటే వైద్యం ఇంటి నుంచే ప్రారంభం కావాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే తప్ప దోమల నియంత్రణ పూర్తిగా సాధ్యంకాదు. కాబట్టి ఎవరికి వారు ఇంటి లోపల దోమలు లేకుండా చూసుకోవడమే వీలైన మార్గం. వాటి కోసం ఇలా చేద్దాం. ఐస్ ముక్కలు: దోమలు కార్బన్ డై ఆక్సైడ్‌కు ఆకర్షితమవుతాయి. ఐస్ గడ్డలు కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి. కాబట్టి ఐస్ గడ్డలను ఓ కంటెయినర్‌లో పెట్టి ఇంట్లో అక్కడక్కడ ఉంచాలి. దోమలు వీటి దగ్గరకు చేరతాయి. అప్పుడు దోమల ఎలక్ట్రిక్ బ్యాట్ తీసుకొని వాటి పని పట్టవచ్చు.

 వేపనూనె: వేపనూనె, కొబ్బరినూనెను 1:1 నిష్పత్తిలో తీసుకొని చర్మంపై రాసుకోవాలి. వేప వాసన చూసి దోమలు పారిపోతాయి. వేపలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ప్రోటోజోల్ గుణాలు ఉన్నాయి.

 కాఫీ గ్రౌండ్స్: ఇంటి సమీపంలో నీరు నిలిచిన చోట దోమలు గుడ్లు పెట్టి ఉంటాయి. కాఫీ డికాషన్ చల్లడం ద్వారా అందులోని దోమల గుడ్లు నీటిపైకి చేరతాయి. అవి ఆక్సీజన్‌కు లోనయి దోమలుగా మారకుండానే నిర్వీర్యమవుతాయి. నీటిలో దోమలు గుడ్లు కూడా పెట్టవు.

 నిమ్మనూనె: దోమల నివారణకు యూకలిప్టస్, లెమన్ ఆయిల్‌ను చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల మన చర్మానికి ఎలాంటి హానీ ఉండదు. వీటిలో ఉండే సినోల్ రసాయనం యాంటీసెప్టిక్ కీటక నివారిణిగా పనిచేస్తుంది. 

కర్పూరం: చీకటి పడుతున్న వేళలో ఇంటి తలుపులు మూసేసి కర్పూరం వెలిగించండి. 20 నిమిషాల తర్వాత తలుపు తెరిస్తే దోమలు కనిపించవు. కర్పూరం మంచి కీటక నివారిణిగా పనిచేస్తుంది.

 తులసి: పారాసైటాలజీ అనే పత్రిక దోమల నివారణలో తులసి ప్రాధాన్యం గురించి రాసింది. దోమల లార్వాను చంపేందుకు తులసి చక్కగా పనిచేస్తుందట. మన ఆయుర్వేదం కూడా ఇదే చెప్పింది. ప్రతీ ఇంట్లోనూ తులసి మొక్కలను ఉంచుకోవడం వల్ల చాలావరకు దోమల సమస్య ఉండదట.

దోమల వల్ల వచ్చే వ్యాధుల్లో ప్రతీ సంవత్సరం 7.25 లక్షల మందికి పైగా చనిపోతున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. హత్యలు, దాడుల వల్ల 4.75 లక్షల మంది, పాము కాటు వల్ల 50 వేల మంది చనిపోతున్నారు. అంటే వీటన్నింటి కంటే దోమద్వారా పోతున్న ప్రాణాలే ఎక్కువ.దోమకాటు వల్ల ప్రతీ సంవత్సరం 20 లక్షల మంది అనారోగ్యానికి గురవుతున్నారు. నీరు నిల్వ ఉండే చోట.. అపరిశుభ్ర వాతావరణంలో దోమలు నివాసాలను ఏర్పరచుకొని సంతతిని వృద్ధి చేసుకుంటాయి. దోమల్లో వేలాది రకాలున్నప్పటికీ ఐదారు రకాల దోమలే మనిషి పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా, మెదడువాపు, పైలేరియా వంటి వ్యాధులు సోకి మనిషి ప్రాణాలు పోతున్నాయి.

దోమలను నివారించటం ఎలా
  • ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి.
  • నీరు నిల్వ ఉన్న గుంతలలో క్రిమిసంహారక మందులు, కిరోసిన్ లేదా వాడిన ఇంజనాయిల్లో ముంచిన గుడ్డ ఉండలలో వేయాలి. దీంతో దోమల లార్వాలు చనిపోతాయి.
  • నీటి గుంతలను గుర్తించి మట్టితో ఎప్పటికప్పుడు పూడ్చివేయాలి.
  • మురికినీరు ఎప్పకటికప్పుడు వెళ్లిపోయే విధంగా చర్యలు తీసుకోవాలి
  • నీటి ట్యాంకులు, డ్రమ్ములపై మూతలు సరిగా ఉంచాలి.
  • ఇంట్లో, ఇంటిచుట్టూ పనికిరాని కూలర్లు, పాత టైర్లు, డ్రమ్ములు, వాడని రోళ్లు, కొబ్బరి చిప్పలు, పగిలిన కుండలు, సీసాలు లేకుండా చూసుకోవాలి.
  • కిటికీలకు, డోర్లకు జాలీలు బిగించాలి. వ్యక్తిగత రక్షణకు దోమతెరలు, కాయిల్స్ వాడాలి.
  • శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి

About Author –

Dr. Arshad Punjani, Consultant Physician & Diabetologist, Yashoda Hospital, Hyderabad
MD, DNB, DM (Gastroenterology)

Dr. Arshad Punjani General Medicine

Dr. Arshad Punjani

MBBS, Post Graduation (Internal Medicine)
Consultant Physician & Diabetologist

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567