%1$s

పిల్లల ఆరోగ్యకరమైన భవితకు ఆరోగ్యకరమైన ఆహారం-ఆవశ్యకత

Healthy Diet for Children

బాల్యం నుండే పిల్లలకు సమతుల ఆహారాన్ని ఇవ్వడం వారి మానసిక మరియు శారీరక ఎదుగుదలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రారంభ దశలోనే పిల్లలకు ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన   ఆహారాన్ని పరిచయం చేయడం చాలా అవసరం, తద్వారా ఈ అలవాటు  వారు పెద్దవారు అయిన వారితో ఉంటుంది. పిల్లలకు విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లు వంటి నిర్దిష్ట పోషకాలు వివిధ ఆహార పదార్ధాలు , పిల్లల  వయస్సు, బరువు మరియు ఎత్తును బట్టి వారి జీవితంలోని వివిధ దశల్లో అవసరం అవుతాయి. 

పిల్లలకు పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన ఆహారం అందించాల్సిన అవసరాన్ని గురించి మరింత తెలుసుకోండి.

పిల్లలకు ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం ఎందుకు ముఖ్యమైనది?

మొదటి కొన్ని సంవత్సరాల్లో, పోషణ వారి ఎదుగుదలకు మరియు శారీరిక అభివృద్ధికి మాత్రమే కాకుండా వారి మెదడు ఆరోగ్యానికి  కూడా ప్రాథమిక పాత్ర పోషిస్తుంది. మంచి ఆహారపు అలవాట్లు మరియు చురుకైన ఆటలు  మరియు వ్యాయామం చేర్చడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండటానికి వీలు కలుగుతుంది. ఆరోగ్యకరమైన మరియు సమతుల ఆహారం అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

 • శక్తిని నియంత్రిస్తుంది
 • శ్రద్ధ మరియు ఏకాగ్రతను పెంచుతుంది
 • ఇది వారి ఆలోచనా విధానం మరియు ప్రవర్తనను మెరుగుపరుస్తుంది
 • ఆహ్లాదకరమయిన మానసిక స్థితిని తెస్తుంది
 • ఆరోగ్యకరమైన శరీర బరువుకి సహాయపడుతుంది
 • ఇది మానసిక ఆరోగ్య పరిస్థితులు మరియు భవిష్యత్తులో వ్యాధులు రాకుండా నివారించడంలో సహాయపడుతుంది.

పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారంలో ఏమి ఉండాలి?

ఆరోగ్యకరమైన ఆహారంలో పోషకాలు నిండిన ఆహారాలు ఉండాలి. ఆకుకూరలు, ఎరుపు మరియు నారింజ, బీన్స్ మరియు బఠానీలతో సహా వివిధ రకాల కూరగాయలను అందించాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.  తృణధాన్యాలు, పండ్లు మరియు కూరగాయలు, ప్రోటీన్లు, పాల ఉత్పత్తులు మరియు చిన్న మొత్తంలో healthy fats తో కూడిన సమతుల్య ఆహారాన్ని పిల్లలు పొందడం చాలా ముఖ్యం. పిల్లలకు వారి ఎదుగుదలకి పోషకాలను అందించే ఆహారం అవసరం అవుతుంది.

 • ఎముకల ఎదుగుదల మరియు అభివృద్ధి కొరకు కాల్షియం, విటమిన్ D ని మంచి పరిమాణంలో అందించాలి.
 • ఐరన్ అధికంగా ఉండే ఆహారం పిల్లల్లో సాధారణ తెలివితేటల అభివృద్ధికి సహాయపడుతుంది.
 • వారి రోగనిరోధక వ్యవస్థకు, విటమిన్ D, విటమిన్ C మరియు జింక్ అధికంగా ఉండే ఆహారాలు అవసరమైన వనరులు.
 • Omega-3 DHA సాధారణ మెదడు పనితీరుకు మద్దతు ఇస్తుంది.
 • పెరుగు, పండ్లు మరియు ఆకుపచ్చ కూరగాయలు వంటి నీటి శాతం అధికంగా ఉండే ఆహారాలను జోడించాలి. పిల్లలు రోజంతా తగినంత మొత్తంలో నీటిని తీసుకోవాలి.

అన్నింటికీ మించి, తగిన పరిమాణంలో వయసును బట్టి ఆహారాన్ని ఇవ్వాలి. వారు శిశువులుగా ఉన్నప్పటి నుండి పసిబిడ్డల వరకు మరియు వారి యుక్తవయస్సులో కూడా పిల్లల పోషకాహార అవసరాలను తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం మరియు తదనుగుణంగా తగిన పరిమాణంలో భోజనాన్ని అందించడం చాలా ముఖ్యం. ఊబకాయం ఉన్న పిల్లలకు మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమా మరియు స్లీప్ అప్నియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తగిన పరిమాణంలో ఇవ్వాలి.

ఏ ఆహార పదార్ధాలు మెదడు అభివృద్ధికి సహాయపడతాయి?

సరైన ఆహార సమూహాలను చేర్చడం పిల్లల మెదడు అభివృద్ధికి దోహదం చేస్తుంది మరియు పిల్లలు అప్రమత్తంగా మరియు దృష్టి సారించడానికి సహాయపడుతుంది. మెదడు ఆహారాలకు కొన్ని ఉదాహరణలు:

 • ప్రోటీన్: మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్, బీన్స్ మరియు బఠానీలు, గుడ్లు, గింజలు మరియు విత్తనాలు, సోయా ఉత్పత్తులు, మరియు పాల పదార్ధాలు
 • ఇనుము: మాంసము, బీన్స్, పప్పు ధాన్యాలు, బలవర్థకమైన తృణధాన్యాలు, ఆకుకూరలు మరియు బంగాళాదుంపలు ఇనుము యొక్క ఉత్తమ వనరులు
 • కోలిన్: మాంసం, పాల పదార్ధాలు మరియు గుడ్లు చాలా కోలిన్ కలిగి ఉంటాయి మరియు చాలా కూరగాయలలో కూడా లభిస్తాయి
 • అయోడిన్: అయోడైజ్డ్ ఉప్పు, సీఫుడ్, పాల ఉత్పత్తులు మరియు సుసంపన్నమైన ధాన్యాలు
 • విటమిన్ A: క్యారెట్లు, చిలగడదుంప మరియు పాలకూర విటమిన్ A యొక్క మంచి వనరులు 
 • విటమిన్ D: తాజా చేపలు (సాల్మన్, హెర్రింగ్, మాకేరెల్ మరియు సార్డినెస్), కాలేయం, కొన్ని పుట్టగొడుగులు మరియు గుడ్డు పచ్చసొనలలో కలిగి ఉంటుంది
 • విటమిన్ B6: స్టార్చ్ ఎక్కువ మోతాదులో ఉన్న కూరగాయలు, పండ్లు (సిట్రస్ కాదు), మాంసాలు, చేపలు మరియు బంగాళాదుంపలు విటమిన్ B6 ను అందిస్తాయి
 • విటమిన్ B12: మాంసం, చేపలు, గుడ్లు మరియు పాల ఉత్పత్తులు
 • పండ్లు మరియు కూరగాయలు: పండ్లు మరియు కూరగాయలు ప్రతి రోజు తీసుకోవాలి
 • ఫైబర్: తృణధాన్యాలను ఎంచుకోవడం వల్ల పిల్లలు ఎక్కువ మోతాదులో ఫైబర్ ను పొందుతారు. హోల్-వీట్ బ్రెడ్, ధాన్యాలు, వోట్ మీల్ మరియు బ్రౌన్ లేదా వైల్డ్ రైస్ వంటి నుంచి ఎక్కువ ఫైబర్ ని పొందవచ్చు.

పిల్లలు ఏ ఆహార పదార్థాలను అధికంగా తీసుకోకూడదు?

ముఖ్యంగా అన్ని ఆహారాలు మితంగా తీసుకోవడం కీలకం. పరిమితంగా తీసుకోవలసిన ఆహార పదార్థాలు:

 • Saturated Fats: అధికంగా వేయించిన ఆహారాన్ని నివారించండి. బదులుగా గ్రిల్లింగ్, రోస్టింగ్, స్టీమింగ్ మరియు ఉడకబెట్టిన   ఆరోగ్యకరమైన వంట పద్ధతులకు మారండి
 • Snacks: అధిక సోడియం, అధిక ఉప్పు, ట్రాన్స్ ఫ్యాట్ మరియు కృత్రిమ రుచులతో నిండిన చిప్స్, మిఠాయిలు మరియు ఇతర ఫాస్ట్ ఫుడ్ వంటి తక్కువ పోషకాల స్నాక్స్ ను తినకూడదు
 • Aerated drinks: శీతలపానీయాలు, ఎక్కువ చక్కర ఉన్న పానీయాలు వదిలివేయాలి. పాలు, కొబ్బరి నీళ్ళు వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవాలి

కొంతమంది పిల్లలు వారు తినే ఆహారం లో మారాం చేయవచ్చు. వారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి సరైన విధంగా ప్రోత్సహించాలి. అది వారిని భవిష్యత్తులో ఆరోగ్యకరమయిన పౌరులుగా ఉండేలా సహకరిస్తుంది. వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆహార సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుడిని సందర్శించడం ఎల్లప్పుడూ మంచిది. అనుభవజ్ఞులైన శిశువైద్యులు మరియు డైట్ కన్సల్టెంట్ లను సంప్రదించండి.

Reference: 
 • “Children’s Health”, Mayo Clinic,  https://www.mayoclinic.org/healthy-lifestyle/childrens-health/basics/childrens-health/hlv-20049425. Accessed on 9th June 2020. 
 • “Healthy Eating”,Kids Health, https://kidshealth.org/en/parents/habits.html. Accessed on 9th June 2020. 
 • “The 11 Most Nutrient-Dense Foods on the Planet”, https://www.healthline.com/nutrition/11-most-nutrient-dense-foods-on-the-planet#TOC_TITLE_HDR_1. Accessed on 9th June 2020. 
 • Nutrition and Healthy eating, Mayo Clinic,  https://www.mayoclinic.org/healthy-lifestyle/nutrition-and-healthy-eating/basics/healthy-diets/hlv-20049477. Accessed on 9th June 2020. 
 • “Top 10 brain foods for children”, WebMd, https://www.webmd.com/parenting/features/brain-foods-for-children#4. Accessed on 9th June 2020. 
X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567