Call
 1. 24/7 Appointment Helpline

  +91 40 4567 4567

 2. International

  +91 40 6600 0066

%1$s

పైల్స్ ని ఆధునిక లేజర్ చికిత్స తో పూర్తిగా నయం చేయవచ్చు

Piles Symptoms and causes

పైల్స్ అంటే ఏమిటి:

మలాశయ వ్యాధులలో ముఖ్యమైనది పైల్స్. ఈ వ్యాధిని మొలలు/ వ్యాధి అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పైల్స్ వ్యాధితో బాధపడుతున్నారు. మల విసర్జన సమయంలో నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలు బయటికి రావడం వంటివి పైల్స్ ఉనికిని తెల్పుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటివల్ల ఉపశమనం కలుగుతుంది. పైల్స్ బాధ భరించడం కష్టమే అయినప్పటికీ, ఇది మరీ తీవ్రమైన ఆరోగ్య సమస్య కాదని వైద్యులు తెలుపుతున్నారు. ఇక పైల్స్ ఎలా వస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలుసుకుందాం.

పైల్స్ రకాలు:

పైల్స్ అనేవి నాలుగు గ్రేడ్స్ గా పరిగణిస్తారు. మొదటి రెండు రకాలు ఆపరేషన్ లేకుండానే తగ్గుతాయి. మూడు మరియు నాలుగవ గ్రేడెలలో కచ్చితంగా ఆపరేషన్ చెయ్యాలి. మొదటి రెండు రకాలను ఆహార నియమాలు , వ్యాయామం మరియు జీవన శైలిలో మార్పులతో తగ్గించవచ్చు. 3  మరియు 4 రకాల పైల్స్ అంటే మొలలు బయటకి వచ్చి రక్తం కారి , మల విసర్జన సమయంలో ఇబ్బంది పెట్టి తగ్గడం. ఇంకా 4 రకంలో మొలలు బయటకు వచ్చి మరల లోపలకి వెళ్లకుండా ఉండటం, వాపు రావడం మరియు రక్తం కారడం చాలా నొప్పితో బాధించటం జరుగుతుంది.

పైల్స్ లక్షణాలు:

 • మలవిసర్జన సమయంలో మొలలు చేతికి తగలడం
 • మలంలో రక్తం కారడం, మంట మరియు నొప్పిగా ఉండటం
 • మొలలు బయటనే ఉండటం
 • మలవిసర్జనకు ఎక్కువ సమయం తీసుకోవడం

పైల్స్ ఉంటె ఏమిచేయాలి:

ఆర్ష మొలలు లేక పైల్స్ అనేవి చాలా మందిలో సంవత్సరాల తరబడి బాధ పెట్టె విషయం కానీ ఎక్కువమంది ఆహారంలో జాగరతలు తీసుకుంటూ తగ్గించుకుంటూ సరిపెట్టుకుంటారు

ఆహార మార్పులతో చాలా వరకు పైల్స్ ని  తగ్గించవచ్చు. కుదరకపోతే వైద్యుడుని సంప్రదించి సలహా మేరకు చికిత్స చేయించుకోవాలి. అందరకి శస్త్ర చికిత్స అవసరం ఉండదు. భయపడకుండా నిపుణులైన వైద్యుడు సంప్రదించి సరైన చికిత్స పొందాలి. అంతేకాని అనవసరమైన భయము మరియు అపోహలతో నాటు వైద్యాన్ని చేయించుకోవద్దు.

పైల్స్ రావటానికి కారణాలు:

మొలలు ఏర్పడటానికి ప్రధాన కారణాలు 

 1. మలబద్ధకం
 2. నీరు తగినంతగా తీసుకోకపోవటం మరియు
 3. మద్యపానం అధికంగా తీసుకోవటం వల్ల రావొచ్చు.

మల విసర్జన సాఫీగా లేకపోవడం వల్ల ఈ సమస్యకు దారితీస్తుంది. కొందరిలో మలద్వారం దగ్గర ఉండే సిరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా మొలలు సమస్య ఉత్పన్నమవుతుంది. అధికబరువు  కూడా కారణమవుతుంది. ఇవే కాకుండా ఆహారపు అలవాట్లు, పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారంను తీసుకోవడం వల్ల పైల్స్ వచ్చే అవకాశాలుంటాయి. పైల్స్ ఉన్నప్పుడు మల విసర్జన ఇబ్బందిగా మారుతుంది. రక్తం పడుతూ ఉంటుంది. దురద ఉంటుంది. ఆడవారిలో గర్భిణీ సమయంలో పైల్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి

 • హార్మోన్ల ప్రభావం వల్ల పురీషనాళంలోని రక్తనాళాలు మెత్తబడటం వల్ల.
 • ఎక్కువకాలం మలబద్దకం ఉండటం వల్ల కూడా మొలలు పెరిగే అవకాశం ఉంది.

Piles Symptoms and causes

నివారణ చర్యలు:

ద్రవపదార్థాలు, ప్రత్యేకించి నీళ్ళను ఎక్కువగా తాగాలి.పండ్లు, ఆకుకూరలు ముతక ధాన్యాలతో కూడిన ఆహారపదార్థలతో పాటు. పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. (ఉదాహరణ: ఆకుకూరలు, కాయగూరలు, పప్పుధాన్యాలు). ఎక్కువగా శ్రమపడి ఒత్తిడి కలిగేలా మలవిసర్జన చేయకూడదు.

పరిష్కారం:

ఇప్పుడు ఆధునిక పద్దతులు మరియు లేజర్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి.

 • కోయడం, కుట్లు వేయడం ఉండదు.
 • రక్తస్రావం ఉండదు
 • త్వరగా తిరిగి రోజువారీ పనులు చేసుకోవచ్చు
 • ఆపరేషన్‌తో పోలిస్తే అతి తక్కువ నొప్పితో 24 గంటలలో ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు.
 • ఖర్చు కూడా ఎక్కువగా ఉండదు.

యశోద హాస్పిటల్లో మొలలు చికిత్సలో అనుభవంగలిగిన లేడీ డాక్టర్ శాంతి వర్ధిని మరియు ఆధునిక లేజర్ చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇటువంటి సందేహలు మరియు అపోహలు లేకుండా సంప్రదించి సరైన చికిత్స పొందటం ద్వారా మొలలు నుండి ఉపశమనం పొందవచ్చు

About Author –

Dr. Santhi Vardhani, Consultant General & Laparoscopy Surgeon, Yashoda Hospitals – Hyderabad
MBBS, MS (General Surgery), FMAS, FIAGES

best General Surgeon in hyderabad

Dr. Santhi Vardhani

MBBS, MS (General Surgery), FMAS, FIAGES
Consultant General & Laparoscopy Surgeon
View ProfileBook An Appointment

Contact


 • By clicking on send, you accept to receive communication from Yashoda Hospitals on email, sms and Whatsapp.
×
X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567

Book Doctor Appointment

Choose the mode of consultation