%1$s
blank
blank
blank

BF.7 సబ్ వేరియంట్ అంటే ఏమిటి? దీని లక్షణాలు & నివారణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు

BF.7 వేరియంట్ అంటే ఏమిటి? దీని నివారణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా రూపం మార్చుకుని (BF.7 Variant) ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. బీఎఫ్-7 అనే ఒమిక్రాన్‌ యొక్క సబ్‌వేరియంట్ మరోసారి యాక్టివ్‌గా మారడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఒమిక్రాన్ స్పాన్ అని కూడా అంటారు. భారత్‌లో జనవరిలో థర్డ్‌ వేవ్‌ వచ్చిన సమయంలో ఒమిక్రాన్‌లోని బీఏ-1, బీఏ-2 సబ్‌ వేరియెంట్‌లు అధికంగా కనిపించాయి. ఆ తర్వాత బీఏ-4, బీఏ-5 లని కూడా చూశాం. అయితే ఇప్పుడు తాజాగా దేశంలోకి బీఎఫ్-7 కూడా వచ్చేసింది. చైనాను హడలెత్తిస్తున్న బీఎఫ్-7 వేరియంట్ కేసులు భారత్‌లోనూ నమోదవ్వడంతో ఈ కరోనా మహమ్మారి ముప్పుపై ఆందోళన మొదలైంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం బీఎఫ్-7 అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఒమిక్రాన్‌‌ బీఏ-5కు చెందిన సబ్-వేరియంటే బీఎఫ్‌-7 అయితే ఈ‌ వైరస్‌కు చాలా విస్తృత వేగంతో వ్యాప్తి చెందే లక్షణాలు ఉంటాయి. ఈ బీఎఫ్‌-7 వేరియంట్‌ బలమైన ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం కలిగి ఉంటుంది మరియు దీని ఇంక్యుబేషన్‌ వ్యవధి కూడా చాలా తక్కువ. గతంలో వైరస్ బారినపడి కోలుకున్నవారికి మరియు వ్యాక్సిన్‌ తీసుకున్న వారికీ ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యం దీనికి ఉంటుంది.

ఈ వేరియంట్‌ R0 (ఆర్‌ నాట్‌) 10 నుంచి 18.6 గా ఉంది. అంటే ఒకరికి ఈ వేరియంట్‌ సోకితే వారి నుంచి కనిష్ఠంగా 10 మరియు గరిష్ఠంగా 18.6 మందికి వ్యాప్తి చెందుతుంది. బీఎఫ్-7 వేరియంట్ ను 2022లో మొదటిసారి గుర్తించారు. ఇప్పటికే 3 డోసుల టీకా తీసుకున్నా వారిలో సరిపడినంత ఇమ్మూనిటీ ఉండటంతో ఈ వైరస్ ప్రభావం పెద్దగా ఉండదు అనుకున్నప్పటికీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని సైతం ఈ బీఎఫ్-7 వేరియంట్‌ త్వరగా అధిగమిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే మన దేశంలో కరోనా వేగం చాలా నెమ్మదిగా ఉన్నా అజాగ్రత వహించరాదు.వైరస్‌ పట్ల అలసత్వం చూపిస్తే రానున్న కాలంలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గమనించాలి.

ఒమిక్రాన్ బీఎఫ్.7 లక్షణాలు:

ఇతర కరోనా వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్‌ పలు లక్షణాలను కలిగి ఉంటుంది.

అవి:

 • ఒళ్ళు నొప్పులు అధికంగా ఉండడం
 • జ్వరం, ముక్కు నుంచి నీరు కారడం
 • ఎక్కువగా దగ్గు, గొంతునొప్పి అనిపించడం
 • వినికిడి సమస్యలు కలగడం
 • ఛాతీలో నొప్పి రావడం
 • వణుకు రావడం
 • వాసన గుర్తించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి

ఇతర కరోనా వేరియంట్ల మాదిరిగానే బీఎఫ్-7 వేరియంట్‌ కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారినే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది మరి ముఖ్యంగా ఈ వైరస్ ఎగువ శ్వాసకోశాన్ని ప్రభావితం చేయడంతో శ్వాసతీసుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇవేకాక కొంత మందిలో వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కూడా కలుగుతాయి.

ఒమిక్రాన్ బీఎఫ్-7 నివారణకు తీసుకోవాల్సిన చర్యలు:

bf7-telugu1

 • మాస్క్‌లు ధరించాలి
 • సరైన పరిశుభ్రతను పాటించాలి
 • చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి
 • అందరూ బూస్టర్ డోస్ లు తీసుకోవాలి
 • ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పక ధరించాలి
 • టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్ అనేది ఒమిక్రాన్‌ బీఎఫ్-7 వేరియంట్ ప్రమాదాన్ని తగ్గించడానికి మరొక మార్గం
 • వీలైనంత త్వరగా ప్రికాషనరీ వ్యాక్సినేషన్ డోస్‌లను ప్రతి ఒక్కరు వేయించుకోవాలి

కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు తిరిగి పాటించడం ద్వారా కొత్త వేరియంట్ ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. వ్యాక్సిన్ తీసుకోని వారు వీలైనంత త్వరగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకోవాలి. దగ్గు, శ్వాస సమస్యలు, రుచి లేకపోవడం వంటి లక్షణాలుంటే కరోనా టెస్టు చేయించుకోవడం మంచిది. ఒకవేళ శరీరం అనార్యోగ బారిన పడినా మానసికంగా ధైర్యంగా ఉండటం ముఖ్యం. ఏది ఏమైనా ముందు జాగ్రత్తలు అనేవి పెను ప్రమాదం నుంచి బయటపడేస్తాయనే విషయం అందరు గుర్తించాలి. వీరే కాక ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు ఈ వ్యాధి పట్ల మరింత జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. ఏది ఏమైనప్పటికీ ఒమిక్రాన్ బీఎఫ్-7ను అడ్డుకోడానికి 3వ డోస్ టీకా కూడా తీసుకోవడం చాలా చాలా అవసరం.

చిన్నారుల్లో ఈ వైరస్‌ ప్రభావం ఏ మేర ఉంటుంది?

blank

90 శాతం మంది చిన్నారుల్లో వైరస్‌ను తట్టుకునే రోగ నిరోధకశక్తి ఉంది. మొదటి మూడు వేవ్స్‌లో డెల్టా, ఒమిక్రాన్‌ వైరస్‌లు చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపించలేదు అయినప్పటికీ పుట్టుకతోనే పలు రకాల రుగ్మతలున్న చిన్నారుల పట్ల వారి వారి తల్లితండ్రులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

మన దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ జరిగినందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తగు జాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా ఉండొచ్చు. అలాగే, ఇంకా వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్న వారు 6 నెలల్లో బూస్టర్‌ టీకాను తీసుకోవచ్చని ఆలస్యమైతే ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశముందని తెలియజేశారు.

ప్రజలందరూ మునుపటిలాగా తగు జాగ్రత్తలు పాటిస్తూ ఎవరికి వారు స్వీయ నియంత్రణను కలిగి ఉండడం వల్ల ఈ వైరస్‌ల వల్ల కలిగే ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే ఏ మాత్రం అలస్యం చేయకుండా డాక్టర్‌ని సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అయితే క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలి.

About Author –

Best Consultant Pulmonologist

Dr. Peddi Srikanth

MBBS, DTCD, DNB
Consultant Pulmonologist

Contact

 • Yes Same as WhatsApp number
 • By clicking on Send, you accept to receive communication from Yashoda Hospitals on email, SMS, call and Whatsapp.
×
X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567