%1$s

మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్

Multisystem inflammatory syndrome-MIS C

కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రత పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లలలో చాలా తక్కువ. చాలా మంది పిల్లలలో  కరోనా లక్షణాలు కూడా కనిపించవు, అతి తక్కువ మందికి హాస్పిటల్ సహాయం ఆవసరం అవుతుంది. కరోనా సోకిన కొన్ని  వారాల తరువాత కొంత మంది పిల్లలు మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్/యమ్ఐఎస్ -సి (MIS C) అనే ఒక అరుదైన జబ్బు తో బాధపడుతున్నారు. 

సాధారణంగా ఈ సిండ్రోమ్ కరోనా  గరిష్ట స్థాయికి చేరిన 2  నుండి 6  వారాల తర్వాత సంభవిస్తుంది. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కన్నా ఈ మూడవ వేవ్ లో  పిల్లలలో ఎక్కువగా కరోనా కేసులు చూస్తున్నాము.అందువల్ల ఈ MISC కేసులు కూడా ఈ వేవ్ లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టీ ఈ వ్యాధి గురించి అవగాహన అవసరం.

ఈ సిండ్రోమ్ రావడానికి కారణాలు ఏమిటి ?

కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు, మనలోని  రోగ నిరోధక  వ్యవస్థ వైరస్ కి  వ్యతిరేకంగా యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేస్తాయి. కొంత మంది లో ఈ యాంటీబాడీస్ వైరస్ ని నిరోధించే  ఈ ప్రక్రియ లో భాగంగా సైటోకైన్స్ అనే హార్మోన్స్  ఎక్కువ మోతాదు లో విడుదల  అవ్వడం వల్ల ముఖ్యమైన అవయవాలలో వాపు (INFLAMMATION) కలుగుతుంది. దీని ప్రభావం వల్ల పిల్లలు జ్వరంతో బాధపడతారు. ఇవే కాకుండా గుండె, కిడ్నీలు, ప్రేగులు, మెదడు మరియు ఇతర అవయవాలు కూడా ప్రభావితం అవొచ్చు. జ్వరం తో పాటు రెండు లేదా అంతకన్నా ఎక్కువ అవయవాలు కనుక ప్రభావితం అయితే దాన్ని *మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్* అంటారు( MISC).

MISC ఎవరిలో వస్తుంది?

అపుడే పుట్టిన పిల్లల నుండి 21 సంవత్సరాల లోపు ఎవరికీ  అయినా ఈ వ్యాధి రావచ్చు. కాకపోతే  6  నుండి 12  సంవత్సరాల  వయస్సు గల పిల్లలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకుముందు  కోవిడ్ వచ్చిన పిల్లలు లేదా కోవిడ్ లక్షణాలు లేకపోయినా, వచ్చిన తల్లితండ్రులు లేదా బంధువులతో సన్నిహితంగా మెలిగిన పిల్లలలో 2 నుండి 6 వారాలలో ఎపుడైనా ఈ వ్యాధి కలుగవచ్చు.

ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ?

పిల్లలు అందరిలో లక్షణాలు ఒకే విధంగా ఉండవు. ఈ సిండ్రోమ్ లక్షణాలను ముఖ్యముగా మూడు రకాలుగా విభజించవచ్చు.

అక్యూట్  ఫిబ్రిల్ ఇల్ల్నెస్(Acute febrile illness) :

మూడు   లేదా అంత కన్నా ఎక్కువ రోజులు తీవ్రమైన జ్వరం(౩8 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 100.4  F లేదా అంత కన్నా ఎక్కువ) ఉంటుంది. కొన్ని సార్లు ఎర్రటి మచ్చలు కనిపించవచ్చు.తీవ్రమైన జ్వరం అనేది అత్యంత సాధారణంగా కనిపించే ముఖ్యమైన లక్షణం.

Acute febrile illness

 కవాసకి వ్యాధి(Kawasaki disease) లాంటి లక్షణాలు:

  • అయిదేళ్ళు లోపు పిల్లలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఒంటి పైన ఎర్రటి  మచ్చలు, కళ్ళు, పెదాలు ఎర్రబడటం, నాలుక ఎర్రగా కందినట్టు అవడం, మెడపైన లింఫ్ గ్రంథుల్లో వాపు మరియు నొప్పి, జ్వరం తగ్గాక వేళ్ళు పాదాలు, అరచేతుల చివర్లో  చర్మం ఊడడం లాంటివి ఈ రకంలో కనిపిస్తాయి.
    Kawasaki disease
  • ఈ లక్షణాలు ఉన్న పిల్లలను తల్లితండ్రులు వెంటనే పీడియాట్రిషన్ కు  చూపించాలి, ఎందుకంటే ఈ కవాసకి రకంలో కొంతమంది లో గుండె కి సంబందించిన రక్తనాళాల్లో వాపు కలగడం వల్ల, భవిష్యత్తు లో ఈ రక్తనాళాలు మూసుకుపోయి గుండెపోటుకి దారితీయవచ్చు. వ్యాధి యొక్క మొదటి దశలో డాక్టర్ ని కలిసి చికిత్స తీసుకున్నట్లయితే ఈ దుష్ప్రభావాలను చాలావరకు నియంత్రంచవచ్చు.

యమ్ఐఎస్ -సి  (MISC -C):

ఇది అన్నిటికన్నా తీవ్రమైంది. సరయిన సమయంలో చికిత్స తీసుకోనట్లయితే ప్రాణాంతకం కావొచ్చు. ఆరు నుండి పదిహేను ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలలో జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్రమైన నీరసం లేదా అలసట, తలనొప్పి, మూర్ఛ, ఛాతినొప్పి, లక్షణాలు కనిపించవచ్చు. రక్తనాళాల్లో వాపు వల్ల బి.పీ తగ్గడంవల్ల  అయినా లేదా గుండె కొట్టుకోవడం తగ్గడం వల్ల అయినా పిల్లలు షాక్ కి గురి అవ్వొచ్చు. పిల్లల్లో  చేతులు లేదా కాళ్ళు చల్లబడటం, పాలిపోయినట్టుగా అవడం, ఊపిరి తీసుకోవడం లో లాంటి ఇబ్బంది అవ్వడం లాంటివి షాక్ లక్షణాలు. ఇవి  ఉన్నపుడు వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లాలి.

MISC -C

ఈ వ్యాధి ని ఎలా నిర్ధారిస్తారు?

 కవాసకి లాంటి లక్షణాలు ఉంటే,కరోనా యాంటీబాడీస్ లేదా  ఆర్ టి పీసీఆర్ (RT-PCR) పరీక్షలలో పాజిటివ్ ఉంటె MISC ఉన్నట్టుగా చెప్పొచ్చు. కాని జ్వరం తో పాటు కోవిడ్ యాంటీబాడీస్ ఉంటె డెంగీ, మలేరియా, కొన్ని ఇతర బ్యాక్టీరియల్/ వైరల్ జ్వరాలలో కూడా ఉండొచ్చు కాబట్టి వాటికి సంబందించిన పరిక్షలు చేయాల్సి ఉంటుంది.

శరీరంలో ని వాపును తెలుసుకోవడానికి సి ఆర్ పీ /ఈ ఎస్ ఆర్  అనే పరీక్షలు చేస్తారు. ఈ టెస్టులు పాజిటివ్ వస్తే, బి ఎన్ పీ, డి-డీమార్, ఫెర్రీత్తిన్, LDH లాంటి పరీక్షలు, గుండె స్కానింగ్ చేస్తారు. కడుపు నొప్పి ఉన్న పిల్లలకు పొట్ట స్కానింగ్, మూర్ఛ ఉంటె CT, MRI స్కాన్స్ ఆవసరం పడొచ్చు.

చికిత్స  విధానం :

పిల్లలలో ముఖ్యముగా కవాసకి మరియు షాక్ లాంటి లక్షణాలు ఉన్న పిల్లలకు ఐ సి యూ(ICU) చికిత్స అవసరం, కాబట్టి వాళ్ళను అడ్మిట్ చేయాల్సి వస్తుంది.  IV ఇమ్మ్యూనోగ్లోబిలిన్స్(IVIG) అనే ఇంజెక్షన్స్ వ్యాధి తీవ్రతను చాలా వరకు తగ్గిస్తుంది.స్టెరాయిడ్స్ మందులు కూడా కీలకం. వీటితో పాటు రక్తం పలుచగా చేసే ఆస్ప్రియిన్ మందు కవాసకి మరియు MISC రకాలలో ఇస్తారు.

హెపారిన్ అనే మందు గుండె కండరాలు బలహీనం అవ్వడం లేదా రక్తం చిక్కబడిన వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా ముఖ్యంగా షాక్ లో ఉన్న పిల్లలకు ఐ వి ఫ్లూయిడ్స్ ,బి పి పెంచే ఇనోట్రోప్స్ మందులు, ఆంటిబయోటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ లేదా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉన్న పిల్లలకి ఆక్సిజన్ /వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడొచ్చు. ఈ సిండ్రోమ్ ని తొలి దశలో గుర్తించి సరయిన చికిత్స తీసుకున్నట్లయితే జబ్బు నయం అవడమే కాకుండా దీర్ఘకాలిక పరిణామాలను కూడా నివారించవచ్చు.

About Author –

Dr. Sunitha Kayidhi, Consultant Rheumatologist, Yashoda Hospitals - Hyderabad
MD (Internal medicine), DM (Rheumatology)

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567