లైపోసక్షన్ : ఈ సర్జరీతో శరీరంలోని అదనపు కొవ్వు మాయం చేసేద్దాం

లైపోసక్షన్ అంటే ఏమిటి?
లైపోసక్షన్ అంటే మన శరీరంలో ఉన్న అదనపు కొవ్వును బయటకు తీసే ఒక పద్ధతి. సాధారణంగా వ్యాయామం ద్వారా మన శరీరంలోని కొవ్వును కరిగించవచ్చు. అయితే ఎటువంటి వ్యాయామానికి అయినా కొన్నిరకాల కొవ్వు కరగదు, దీని వలన శరీరం మంచి ఆకృతిని కోల్పోయి వికారంగా కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో లైపోసక్షన్ ద్వారా ఈ అదనపు కొవ్వును శరీరం నుండి తొలగిస్తే అందమైన ఆకృతిలోకి వస్తుంది. లైపోసక్షన్ ను లిపోప్లాస్టీ, లైపో, బాడీ కాంటౌరింగ్ అని కూడా అంటారు. ఈ మధ్య కాలంలో మనం తీసుకునే ఆహారం మరియు జీవనశైలి కారణంగా ఊబకాయం మరియు అధిక బరువుతో బాధ పడేవారు ఎక్కువగా ఉన్నారు, ఇలాంటి వారు తమ శరీర ఆకృతిని అందంగా మార్చుకోవడానికి లైపోసక్షన్ సర్జరీ అనేది సరైన ఎంపికగా చెప్పవచ్చు. లైపోసక్షన్ సర్జరీ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
లైపోసక్షన్ రకాలు
లైపోసక్షన్ సర్జరీ ద్వారా మన శరీరంలో కొవ్వును తొలగించే విధానాన్ని బట్టి ఈ సర్జరీ వివిధ రకాలుగా విభజించబడింది. లైపోసక్షన్ రకాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
- ట్యూమెసెంట్ లైపోసక్షన్ : మన శరీరంలో ఏ భాగంలో అయితే కొవ్వును తొలగించాలి అనుకుంటున్నారో, ఈ విధానంలో ఒక ప్రత్యేకమైన ద్రవాన్ని ఆ భాగంలోకి పంపిస్తారు. ఈ ద్రావణం శరీరంలో ఉన్న కొవ్వు సులభంగా బయటకు తీయడానికి సహాయం చేస్తుంది. తర్వాత ఒక సన్నని సూది(canula) ద్వారా ఆ భాగంలో ఉన్న కొవ్వు బయటకు సక్షన్ చేయడం జరుగుతుంది. పేషేంట్ కు నొప్పి లేకుండా ఉండడానికి ముందుగానే ఆ భాగానికి అనస్థీషియా ఇవ్వబడుతుంది.
- లేజర్ అసిస్టెడ్ లైపోసక్షన్ (LAL) : ఈ విధానంలో అధిక శక్తి కలిగిన లేజర్ కిరణాల ద్వారా శరీరంలోని కొవ్వును విచ్చిన్నం చేయడం జరుగుతుంది. ఇలా విచ్చిన్నం చేయబడిన కొవ్వు, సూది(canula) ద్వారా సక్షన్ చేయబడుతుంది. లేజర్ అసిస్టెడ్ లైపోసక్షన్ , మినీమల్లి ఇన్వాసివ్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి శరీరంపై సర్జరీకి సంబంధించిన కుట్లు లేదా మచ్చలు చాలా తక్కువగా ఉంటాయి.
- పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ (PAL) : ఈ విధానంలో ఒక యంత్రం ద్వారా మన శరీరంలో ఎంపిక చేసుకున్న భాగంలో కొవ్వును తొలగిస్తారు. ఇందులో ఒక పొడుగాటి స్టెయిన్ లెస్ స్టీల్ సూది (కాన్యులా)ను ప్రతేక్యమైన యంత్రానికి అనుసంధానం చేస్తారు. ఈ సూది వేగంగా ముందుకు వెనకకు కదులుతూ ఆ భాగంలో ఉన్న కొవ్వును విచ్చిన్నం చేస్తుంది. ఇలా విచ్చిన్నం చేయబడిన కొవ్వు సూది ద్వారా బయటకు సక్షన్ చేయబడుతుంది.
- అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్ :ఈ పరీక్ష ద్వారా శరీరంలో ఉన్న కొవ్వును అల్ట్రాసౌండ్ కిరణాల శక్తి ద్వారానే విచ్చిన్నం చేస్తారు. ఇలా విచ్చిన్నం చేసిన కొవ్వు సూది(canula) ద్వారా సక్షన్ చేయబడుతుంది. ఈ విధానంలో కూడా మినిమల్లీ ఇన్వాసివ్ పద్దతిలోనే చేయడం వలన శరీరంపై కుట్లు అతి తక్కువగా ఉంటాయి.
లైపోసక్షన్ సర్జరీ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరు లైపోసక్షన్ సర్జరీ ద్వారా మీ శరీరంలోని కొవ్వును తొలగించాలి అనుకుంటే ఈ సర్జరీకి ముందు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. లైపోసక్షన్ సర్జరీ ముందుగా పాటించవలసిన జాగ్రత్తలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
- ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ కు తెలియజేయడం : లైపోసక్షన్ సర్జరీ చేపించుకోవాలి అనుకుంటే ముందుగా మీ ఆరోగ్య పరిస్థితి గురించి క్షుణ్ణంగా డాక్టర్ కు తెలియజేయాలి. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే లైపోసక్షన్ సర్జరీ చేయవచ్చా, లేదా అనే విషయాన్ని డాక్టర్ నిర్ధారిస్తారు. లైపోసక్షన్ సర్జరీ గురించి ఏదైనా అనుమానాలు ఉంటే ముందుగానే డాక్టర్ తో చర్చించి వాటిని నివృత్తి చేసుకోవాలి.
- రక్త పరీక్షలు : లైపోసక్షన్ సర్జరీ చేపించుకునే ముందు కొన్ని రక్తపరీక్షలు అవసరం అవుతాయి. వీటి ద్వారా పేషేంట్ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి కచ్చితంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా అనీమియా (రక్తహీనత) మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఏవీ లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే లైపోసక్షన్ సర్జరీ సాధ్యమవుతుందా లేదా అని నిర్దారిస్తారు.
- మందుల వాడకం : ఒకవేళ లైపోసక్షన్ చేపించుకోవాలి అనుకునే వ్యక్తి ఏదైనా మందులు వాడుతున్నట్లు అయితే వాటి గురించి తప్పకుండా డాక్టర్ కు తెలియజేయాలి. లైపోసక్షన్ సర్జరీ ముందు మరియు సర్జరీ తర్వాత కొంత కాలం పాటు కొన్ని రకాలైన మందుల వాడకం గుండె జబ్బులను కలగజేయవచ్చు. కాబట్టి ప్రస్తుతం వాడుతున్న మందుల గురించి డాక్టర్ కు తెలియజేయడం ద్వారా ఆ మందుల వాడకం కొనసాగింపు గురించి నిర్ధారించుకోవాలి.
- ధూమపానం మరియు మద్యపానం మానడం : లైపోసక్షన్ సర్జరీ చేపించుకోవాలి అనుకునే వారు సర్జరీకి కనీసం మూడు నెలల ముందు నుండే ధూమపానం మరియు మద్యపానం అలవాట్లను మానుకోవాలి. ఈ అలవాట్ల కారణంగా లైపోసక్షన్ సర్జరీ తర్వాత కొన్ని దుష్పరిణామాలు కలిగే ప్రమాదం ఉంది.
లైపోసక్షన్ సర్జరీ ఎవరికి మరియు ఎప్పుడు అవసరం?
చాలామంది అసంకల్పితంగా ఊబకాయం , అధిక కొవ్వు మొదలైన సమస్యల వలన బాధ పడుతూ ఉంటారు. మరికొంత మందిలో వివిధ భాగాల్లో కొవ్వు పేరుకునిపోయి శరీర ఆకృతి కొంత వికారంగా మారవచ్చు. అయితే శరీరంలో ఏర్పడిన కొవ్వు తగ్గించడానికి అనేక రకాలైన వ్యాయామాలు, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసినా కూడా ఆ కొవ్వు తగ్గక నిరాశ చెందవచ్చు. ఇలాంటి సందర్భాలలో లైపోసక్షన్ సర్జరీ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లైపోసక్షన్ కేవలం శరీరంలో ఏర్పడిన కొవ్వును తొలగించడమే కాకుండా ఆత్మనూన్యతను కూడా తగ్గించి మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఈ సర్జరీ మన శరీరంలోని అదనపు కొవ్వును తొలగించి అందంగా కనిపించేలాగా చేస్తుంది. అంతే కాకుండా లిపోమా గడ్డలను తొలగించడానికి మరియు పురుషులలో రొమ్ము పెరుగుదల ఉన్నప్పుడు మచ్చలు లేకుండా రొమ్ము పరిమాణం తగ్గించడానికి కూడా లైపోసక్షన్ సర్జరీ ఉపయోగపడుతుంది.
లైపోసక్షన్ సర్జరీ శరీరంలో ఏ భాగాలకు చేయవచ్చు?
మన శరీరంలోని ఈ క్రింద వివరించిన భాగాలకు లైపోసక్షన్ సర్జరీ ద్వారా అదనపు కొవ్వును తొలగించవచ్చు.
- ఉదరం
- నడుము
- ఛాతీ
- ముఖం
- మెడ
- తొడ భాగం
- పిరుదులు
- భుజాలు
లైపోసక్షన్ సర్జరీ వలన కలిగే ప్రయోజనాలు
లైపోసక్షన్ సర్జరీ మన శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడమే కాకుండా శరీరం మంచి ఆకృతిలో ఉండేలా చేస్తుంది. లైపోసక్షన్ సర్జరీ వలన కలిగే ఉపయోగాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
- ఆకర్షణీయమైన శరీర ఆకృతి : లైపోసక్షన్ సర్జరీ ద్వారా శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడం వలన శరీర ఆకృతి ఆకర్షణీయంగా మారుతుంది. ఊబకాయంతో బాధ పడుతున్నవారు లైపోసక్షన్ సర్జరీ చేపించుకోవడం వలన ఉదరం భాగంలో కొవ్వు తొలగించడం వలన నాజూగ్గా కనిపిస్తారు.
- అదనపు కొవ్వు తొలగించవచ్చు : మన శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం వలన శరీర ఆకృతి దెబ్బ తినడమే కాకుండా ఇతర అనారోగ్యాలకు కారణం అవుతుంది. లైపోసక్షన్ సర్జరీ ద్వారా ఈ అదనపు కొవ్వును కూడా తొలగించవచ్చు.
- శరీరంలోని కొవ్వు శాశ్వత తొలగింపు : లైపోసక్షన్ ద్వారా తొలగించిన అదనపు కొవ్వు మళ్ళీ తిరిగి ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. లైపోసక్షన్ సర్జరీ తర్వాత సరైన వ్యాయామం చేయడం డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు పాటించడం వలన మన శరీరంలో తిరిగి కొవ్వు ఏర్పడడాన్ని నివారించవచ్చు.
- మనో స్థైర్యం : చాలామంది వ్యక్తులు వారి శరీర ఆకృతి సరిగా లేకపోవడం వలన మానసిక వేదనకు గురవుతున్నారు. కొంతమంది వారి బాధను ఎవరికీ చెప్పకుండా వారిలో వారే కుమిలిపోతూ ఉంటారు. లైపోసక్షన్ సర్జరీ ద్వారా మంచి శరీర ఆకృతిని పొందడంతో పాటుగా మానసిక స్థైర్యాన్ని కూడా పొందుతారు.
లైపోసక్షన్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లైపోసక్షన్ తర్వాత పేషేంట్ తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి, లేని సందర్భాల్లో లైపోసక్షన్ సర్జరీ వలన సైడ్ ఎఫెక్ట్స్ కలిగే ప్రమాదం ఉంది. లైపోసక్షన్ సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకుందాం.
- ఆహారం : లైపోసక్షన్ సర్జరీ తర్వాత కనీసం మూడు నెలలపాటు డాక్టర్ సూచించిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సర్జరీ తర్వాత వీలైనంత వరకూ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారం మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
- దుస్తులు : లైపోసక్షన్ సర్జరీ తర్వాత మన శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. ఒక్కసారిగా కొవ్వు తొలగించడం కారణంగా పైచర్మం కొంత వదులుగా ఉండవచ్చు. ఇందుకోసం కొంచెం బిగుతుగా ఉండే దుస్తుల (pressure garments)వాడకాన్ని డాక్టర్ సూచిస్తారు.
- తేలికపాటి వ్యాయామం : శరీరంలో అదనపు కొవ్వు తొలగించిన తర్వాత రక్త ప్రసరణ సరిగా జరగడానికి తేలికపాటి వ్యాయామాలు చేయడం అవసరం. ప్రతీరోజూ కాసేపు నడవడం అలవాటు చేసుకోవాలి. సర్జరీ తర్వాత కొంత నొప్పి మరియు వాపు ఉండవచ్చు, వ్యాయామం వలన ఈ వాపు కొంతవరకూ తగ్గే అవకాశం ఉంది.
- మందుల వాడకం : లైపోసక్షన్ సర్జరీ తర్వాత నొప్పి లేదా వాపును తగ్గించడానికి మరియు సర్జరీ కారణంగా ఇతర దుష్పరిణామాలు కలగకుండా ఉండడానికి కొన్ని మందులను సూచించడం జరుగుతుంది. ఈ మందులను డాక్టర్ సూచించిన మేరకు క్రమం తప్పకుండా వాడాలి.
లైపోసక్షన్ సర్జరీ గురించి అపోహలు మరియు వాస్తవాలు
లైపోసక్షన్ సర్జరీ గురించి సాధారణంగా చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి, లైపోసక్షన్ సర్జరీ అంటే భయం కలగడానికి ఈ అపోహలు కారణం అవుతున్నాయి. లైపోసక్షన్ సర్జరీ గురించి ఉన్న అపోహలు మరియు వాస్తవాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
- అపోహ
లైపోసక్షన్ సర్జరీ ద్వారా అధిక బరువు తగ్గవచ్చు.
- వాస్తవం
లైపోసక్షన్ కేవలం కొవ్వు తొలగించే సర్జరీ మాత్రమే, ఈ సర్జరీ వలన బరువు తగ్గడం అనేది కేవలం అపోహ మాత్రమే.
- అపోహ
లైపోసక్షన్ సర్జరీ వలన హార్ట్ ఎటాక్ వస్తుంది.
- వాస్తవం
లైపోసక్షన్ సర్జరీ తర్వాత రక్తప్రసరణలో కొన్ని మార్పులు కలగవచ్చు, వీటిని కూడా సరైన మందులు మరియు డాక్టర్ సూచించిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. లైపోసక్షన్ కారణంగా హార్ట్ ఎటాక్ వస్తుంది అనేది కేవలం అపోహ మాత్రమే.
- అపోహ
లైపోసక్షన్ తర్వాత ఎలాంటి ఆహారాన్ని తీసుకున్నా బరువు పెరగరు.
- వాస్తవం
లైపోసక్షన్ సర్జరీ తర్వాత బరువు పెరగడం అనేది పేషేంట్ యొక్క జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఈ సర్జరీ తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ శరీర బరువును నిర్వహిస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు ఏమీ పాటించకుండా ఉంటే బరువు పెరగడాన్ని ఆపలేం.
- అపోహ
లైపోసక్షన్ కేవలం 40 సంవత్సరాల లోపు వారు మాత్రమే చేపించుకోవాలి
- వాస్తవం
లైపోసక్షన్ సర్జరీ అనేది 18 సంవత్సరాలు నిండిన వారు చేపించుకోవచ్చు, అయితే 40 సంవత్సరాల లోపు వారు మాత్రమే అనే ప్రమాణం ఏమీ లేదు. లైపోసక్షన్ చేపించుకోవాలి అనుకునే వ్యక్తి వయసును బట్టి డాక్టర్లు కొన్ని పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ సర్జరీ సాధ్యమా లేదా అనేది నిర్ధారిస్తారు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు.
About Author –