కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? అది బర్సైటిస్ కావచ్చు! కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ తెలుసుకోండి

u003cpu003eమన రక్తంలో ప్రధానంగా నాలుగు ముఖ్య భాగాలు ఉంటాయి. ఇవి ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్. రక్తంలో ఎర్ర రక్తకణాలు 44 శాతం ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను (హేమోగ్లోబిన్ ద్వారా) సరఫరా చేస్తాయి. ఎర్ర రక్త కణాల ఆకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, వీటిని శాస్త్రీయంగా ద్విపుటాకారము (Biconcave Disk) అని అంటారు.దీనిని సరళంగా చెప్పాలంటే, ఇది గుండ్రంగా, డోనట్ ఆకారంలో ఉంటుంది, కానీ మధ్యలో రంధ్రం ఉండదు.పక్క నుండి చూసినప్పుడు, కణం యొక్క అంచులు మందంగా ఉండి, మధ్య భాగం లోపలికి నొక్కినట్లుగా ఉంటుంది.u003c/pu003enu003cpu003eస్పిరోసైటోసిస్ (Spherocytosis) అనేది ఒక రకమైన u003ca href=u0022https://www.yashodahospitals.com/te/blog/the-hemoglobin-levels-are-very-low-in-iron-deficiency-anemia/u0022u003eరక్తహీనతu003c/au003e . ఈ స్థితిలో, సాధారణంగా ద్విపుటాకారంలో ఉండాల్సిన ఎర్ర రక్త కణాలు వాటి ఆకారాన్ని కోల్పోయి, గుండ్రటి బంతిలాంటి ఆకారంలోకి మారిపోతాయి. అందుకే దీనికి స్పిరోసైటోసిస్ (స్పియర్ అంటే గోళం/బంతి) అనే పేరు వచ్చింది.u003c/pu003e
1. బర్సైటిస్ అంటే ఏమిటి?
మన శరీరంలో ఎముకలు, కండరాలు, మరియు చర్మం ఒకదానికొకటి రాపిడికి గురికాకుండా ఉండటానికి ఫ్ల్యూయిడ్ అవసరం అవుతుంది. మన శరీరంలో ఎముకల మధ్యలో సైనోవియల్ ద్రవం (Synovial Fluid) అనే జిగట పదార్థం ఉంటుంది, ఈ ఫ్ల్యూయిడ్ ఒక సంచి లాంటి దానిలో ఉంటుంది. దీనిని బర్సా అని అంటారు. మన శరీరంలో సుమారు 150 కంటే ఎక్కువ బర్సాలు ఉంటాయి. ప్రధానంగా ఇవి కదలికలు ఎక్కువగా ఉండే కీళ్ల వద్ద ( ఉదాహరణకు భుజాలు, మోచేతులు, మోకాళ్ళు, మడమలు) ఉంటాయి. మన శరీరంలోని కీళ్ల వద్ద ఉండే ‘బర్సా’ (Bursa) అనే ఈ చిన్న ద్రవ సంచులు వాపుకు గురవ్వడాన్ని బర్సైటిస్ అని అంటారు.
2. బర్సైటిస్ కారణాలు
బర్సైటిస్ (Bursitis) రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మన శరీరంలో కీళ్ల దగ్గర ఉండే ‘బర్సా’ (ద్రవంతో నిండిన సంచి) పై అధిక ఒత్తిడి పడటం లేదా ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఈ సమస్య వస్తుంది.
దీని ప్రధాన కారణాలను వివరంగా ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు:
1. పునరావృత కదలికలు (Repetitive Strain) : బర్సైటిస్ సమస్యకు ఇది అత్యంత సాధారణ కారణం. ఒకే కండరాన్ని లేదా కీలును పదే పదే ఒకే రకంగా వాడటం వల్ల బర్సా రాపిడికి మరియు వాపుకు గురవుతుంది.
- ఉదాహరణలు:
- రోజూ గంటల తరబడి టైపింగ్ చేయడం (మోచేయి నొప్పి).
- టెన్నిస్, గోల్ఫ్ లేదా బేస్ బాల్ వంటి క్రీడలు ఆడటం.
- తోటపని (Gardening), పెయింటింగ్ వేయడం లేదా వడ్రంగి పని చేయడం.
- ఎక్కువ దూరం నడవడం లేదా పరుగెత్తడం (మడమ లేదా హిప్ నొప్పి).
2. సుదీర్ఘకాలం ఒత్తిడి (Prolonged Pressure) : కీళ్లపై ఎక్కువ సేపు భారం వేయడం వల్ల ఆ భాగంలోని బర్సా వాపుకు గురవుతుంది.
- మోకాళ్లపై కూర్చోవడం: చాలా సేపు నేలపై మోకాళ్ల మీద కూర్చుని పని చేసేవారిలో (ఫ్లోర్ క్లీనింగ్, కార్పెట్ వేయడం) బర్సైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోకాళ్ళ భాగంలో కలిగే దానిని ‘ప్రీ-పటేల్లార్ బర్సైటిస్’ అంటారు.
- మోచేతులపై ఆనడం: టేబుల్ మీద మోచేతులు పెట్టి ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల బర్సైటిస్ సమస్య కలగవచ్చు.
- బిగుతైన బూట్లు: సరిపోని బూట్లు వేసుకోవడం వల్ల మడమ వెనుక భాగంలో ఒత్తిడి కలిగి బర్సైటిస్ రావచ్చు.
3. గాయాలు (Accidental Injury) : హఠాత్తుగా కీళ్లపై ఏదైనా బలంగా తగిలినప్పుడు బర్సా దెబ్బతింటుంది.
- కింద పడటం వల్ల మోకాలు లేదా హిప్ ఎముక నేలకు బలంగా తగలడం.
- ఏదైనా వస్తువుతో కీలుపై బలంగా కొట్టడం.
- కీళ్లపై పడే హఠాత్తు జెర్క్ (Jerk).
4. ఇతర అనారోగ్య సమస్యలు (Medical Conditions) : కొన్ని రోగాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను పెంచి బర్సైటిస్ రావడానికి కారణమవుతాయి:
- గౌట్ (Gout): రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు, అది మన శరీరంలోని కీళ్ల వద్ద ఉన్న ఖాళీ ప్రదేశాలలో మరియు బర్సా (Bursa) లోపల సూది లాంటి సూక్ష్మమైన స్పటికాలుగా (Crystals) పేరుకుపోతుంది. ఇలా జరగడాన్ని గౌట్ అని అంటారు.
- రుమటాయిడ్ ఆర్థరైటిస్: కీళ్లలో ఉండే విధంగానే, బర్సా లోపలి భాగంలో కూడా ‘సైనోవియం’ (Synovium) అనే పలుచని పొర ఉంటుంది. ఇది బర్సా సజావుగా కదలడానికి అవసరమైన ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు, రోగనిరోధక వ్యవస్థ ఈ సైనోవియం పొరపై దాడి చేస్తుంది. దీనివల్ల బర్సా వాపుకు గురై బర్సైటిస్ వస్తుంది.
- డయాబెటిస్ మరియు థైరాయిడ్: రక్తంలో చక్కెర పెరిగినప్పుడు, అది శరీరంలోని స్నాయువులు (Tendons) మరియు బర్సాలపై పేరుకుపోయి వాటిని గట్టిగా, పెళుసుగా మారుస్తుంది. దీనివల్ల కీళ్లలో సరైన సాగే గుణం తగ్గి, బర్సాపై రాపిడి పెరుగుతుంది. థైరాయిడ్ హార్మోన్ లోపం వల్ల శరీరంలోని కణజాలాలలో ద్రవాలు పేరుకుపోతాయి. బర్సా సంచులలో కూడా అదనపు ద్రవం చేరడం వల్ల అవి ఉబ్బిపోయి వాపు వస్తుంది.
5. ఇన్ఫెక్షన్లు (Septic Bursitis) : ఒకవేళ చర్మంపై ఉన్న గాయం ద్వారా లేదా రక్తం ద్వారా బ్యాక్టీరియా బర్సా లోపలికి ప్రవేశిస్తే, అది ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది. దీనివల్ల నొప్పి, వాపుతో పాటు జ్వరం కూడా రావచ్చు. ఇది మోచేయి మరియు మోకాలు దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది.
కీళ్ల భాగంలో వాపు, నొప్పి తీవ్రంగా ఉంటుందా?
3. బర్సైటిస్ రకాలు
శరీరంలోని వివిధ కీళ్ల వద్ద ఉండే బర్సా (ద్రవ సంచులు) వాపుకు గురైనప్పుడు, ఆ భాగాన్ని బట్టి బర్సైటిస్‌ను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. శరీర భాగాలను బట్టి ప్రధానమైన బర్సైటిస్ రకాలు ఇక్కడ వివరంగా ఉన్నాయి:
1. సబ్‌క్రామియల్ బర్సిటిస్ (భుజం)
ఇది అత్యంత సాధారణమైన రకం. భుజం ఎముక (Acromion) మరియు భుజం కండరాల (Rotator Cuff) మధ్య ఉండే బర్సా వాపుకు గురైతే భుజం బర్సైటిస్ సమస్య కలుగుతుంది.
- కారణం: చేతులు తల పైకి ఎత్తి పదే పదే పనులు చేయడం (ఉదాహరణకు: పెయింటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్).
- లక్షణాలు: చేతిని పైకి ఎత్తినప్పుడు లేదా వెనుకకు తిప్పినప్పుడు పదునైన నొప్పి కలగవచ్చు. రాత్రిపూట ఆ భుజం వైపు పడుకోవడం కష్టమవుతుంది.
2. ఒలెక్రానాన్ బర్సిటిస్ (మోచేయి)
దీనిని ‘స్టూడెంట్స్ ఎల్బో’ లేదా ‘పోప్-ఐ ఎల్బో’ అని కూడా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో మోచేయి వెనుక ఉన్న మొనదేలిన ఎముకపై ఉండే బర్సా వాపుకు గురవుతుంది.
- కారణం: టేబుల్‌పై మోచేతులు ఆనించి ఎక్కువ సేపు కూర్చోవడం, లేదా మోచేతిపై బలంగా దెబ్బ తగలడం.
- లక్షణాలు: మోచేయి వెనుక భాగంలో ఒక మెత్తని ‘బంతి’ లాంటి వాపు కనిపిస్తుంది. ఇది ఒక్కోసారి ఇన్ఫెక్షన్‌కు (Septic) గురయ్యే అవకాశం ఎక్కువ.
3. ప్రీపటెల్లార్ బర్సిటిస్ (మోకాలు)
దీనిని ‘హౌస్ మేడ్స్ నీ’ (Housemaid’s Knee) అని పిలుస్తారు. మోకాలు చిప్ప (Patella) ముందు ఉండే బర్సా వాపుకు గురవుతుంది.
- కారణం: నేలపై మోకాళ్లూని ఎక్కువ సేపు పని చేయడం (ఉదాహరణకు: గదులు తుడవడం, ప్లంబింగ్, తోటపని).
- లక్షణాలు: మోకాలు ముందు భాగం ఉబ్బి ఎర్రగా మారడం, మోకాలు వంచినప్పుడు నొప్పి రావడం.
4. ట్రోచాంటెరిక్ బర్సిటిస్ (నడుము)
తొడ ఎముక పైభాగంలో, నడుము పక్కన ఉండే బర్సా వాపుకు గురవుతుంది.
- కారణం: ఒకే వైపు పడుకోవడం, మెట్లు ఎక్కువగా ఎక్కడం, లేదా అధిక బరువు ఉండటం.
- లక్షణాలు: నడుము పక్క భాగంలో నొప్పి రావడం. ఇది క్రమంగా తొడ వెలుపల భాగానికి పాకవచ్చు. నడిచేటప్పుడు లేదా పక్కకు పడుకున్నప్పుడు నొప్పి పెరుగుతుంది.
5. రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ (మడమ)
మడమ ఎముక మరియు అకిలెస్ టెండన్ (Achilles Tendon) కలిసే చోట ఉండే బర్సా వాపుకు గురవుతుంది.
- కారణం: పరుగు పందాలు, క్రీడలు లేదా సరిగ్గా సరిపోని (చాలా బిగుతైన) బూట్లు వేసుకోవడం.
- లక్షణాలు: మడమ వెనుక భాగంలో నొప్పి మరియు వాపు. బూట్లు వేసుకున్నప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది.
6. ఇషియల్ బర్సైటిస్ (Ischial Bursitis)
దీనిని ‘వీవర్స్ బాటమ్’ (Weaver’s Bottom) అని పిలుస్తారు. మనం కూర్చున్నప్పుడు నేలకు లేదా కుర్చీకి తగిలే ఎముక (Ischium) వద్ద ఉండే బర్సా ఇది.
- కారణం: గట్టి ఉపరితలంపై (కుర్చీ లేదా బెంచ్ మీద) చాలా సేపు కూర్చోవడం.
- లక్షణాలు: కూర్చున్నప్పుడు పిరుదుల భాగంలో నొప్పి రావడం, నిలబడినప్పుడు లేదా నడిచినప్పుడు కొంచెం ఉపశమనం కలగడం.
4. బర్సైటిస్ లక్షణాలు
బర్సైటిస్ లక్షణాలు సాధారణంగా వాపుకు గురైన శరీర భాగం (కీలు) మరియు సమస్య తీవ్రతపై ఆధారపడి ఉంటాయి. అయితే, ఏ భాగంలో వచ్చినా కనిపించే లక్షణాలు ఇక్కడ తెలుసుకుందాం. బర్సైటిస్ నొప్పి అందరికీ ఒకేలా ఉండదు. ఇది సమయాన్ని బట్టి మారుతుంటుంది.
- కదలికలతో నొప్పి: విశ్రాంతిగా ఉన్నప్పుడు నొప్పి తక్కువగా ఉన్నా, కీలును కదిలించినప్పుడు (ఉదాహరణకు చేయి ఎత్తడం లేదా నడవడం) నొప్పి ఒక్కసారిగా ‘పదునైన షాక్’ లాగా వస్తుంది.
- రాత్రిపూట నొప్పి: నిద్రలో కీళ్లపై ఒత్తిడి పడటం వల్ల రాత్రిపూట నొప్పి తీవ్రమవుతుంది. ముఖ్యంగా భుజం మరియు హిప్ బర్సైటిస్ ఉన్నవారు ఆ వైపు తిరిగి పడుకోలేరు.
- మొద్దుబారిన నొప్పి: కదలకుండా ఉన్నప్పుడు ఆ భాగం భారంగా, మొద్దుబారిన నొప్పి (Dull ache) తో ఉన్నట్లు అనిపిస్తుంది.
- వాపు (Fluctuant Swelling): బర్సాలో ద్రవం పేరుకుపోవడం వల్ల వచ్చే వాపు తాకితే మెత్తగా, లోపల నీరు ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ఎముక పైన ఒక అదనపు కుషన్ లాగా కనిపిస్తుంది.
- చర్మం రంగు మారడం: ఇన్ఫ్లమేషన్ తీవ్రంగా ఉంటే ఆ ప్రాంతంలో చర్మం ఎర్రగా లేదా గులాబీ రంగులోకి మారుతుంది.
- శరీరం వేడిగా మారడం: వాపు ఉన్న చోట రక్త ప్రసరణ పెరగడం వల్ల ఆ ప్రాంతాన్ని తాకితే మిగిలిన శరీరం కంటే వేడిగా (Warm) అనిపిస్తుంది.
- కదలిక పూర్తిగా లేకపోవడం : ఉదాహరణకు భుజం బర్సైటిస్ ఉంటే, మీరు చేతిని వెనక్కి తిప్పి వీపును గోకలేరు లేదా జుట్టు దువ్వుకోలేరు. ఇలా మనం సాధారణంగా చేసే పనులు కూడా బర్సైటిస్ ఉన్నప్పుడు చేయలేము లేదా కష్టంగా ఉండవచ్చు.
- కండరాల బలహీనత: నొప్పి కారణంగా మీరు ఆ కీలును వాడటం తగ్గిస్తారు. దీనివల్ల కాలక్రమేణా ఆ చుట్టుపక్కల ఉన్న కండరాలు బలహీనపడతాయి (Muscle atrophy).
- జ్వరం మరియు వణుకు: శరీరంలోకి ఇన్ఫెక్షన్ ప్రవేశించిందని చెప్పడానికి ఇది సంకేతం. సెప్టిక్ బర్సైటిస్ ఉన్నప్పుడు జ్వరం మరియు వణుకు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
- చీము పట్టడం: వాపు ఉన్న చోట చర్మం పలచబడి లోపల చీము ఉన్నట్లు కనిపిస్తుంది.
లింఫ్ నోడ్స్ వాపు: ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న గ్రంధులు (Nodes) వాపుకు గురవుతాయి.
దీర్ఘకాలిక లక్షణాలు (Chronic Symptoms)
ఒకవేళ బర్సైటిస్ కొన్ని నెలల పాటు తగ్గకపోతే:
- బర్సా లోపల ఉన్న ద్రవం చిక్కబడి, బర్సా గోడలు మందంగా (Thickening) మారుతాయి.
- దీనివల్ల కీలులో ఎప్పుడూ ఏదో అడ్డంకి ఉన్నట్లు, బిగుతుగా అనిపిస్తుంది.
- కీలు కదిలించినప్పుడు లోపల ఏదో రాసుకుంటున్నట్లు లేదా శబ్దం వస్తున్నట్లు (Crepitus) అనిపించవచ్చు.
5. బర్సైటిస్ నిర్ధారణ
బర్సైటిస్‌ను గుర్తించడానికి డాక్టర్లకు సాధారణంగా శారీరక పరీక్షనుండి, అత్యాధునిక ఇమేజింగ్ పరీక్షల వరకు అవసరం కావచ్చు. బర్సైటిస్‌న నిర్ధారణ ప్రక్రియ (Diagnosis) ఎలా ఉంటుందో ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
1. శారీరక పరీక్ష (Physical Examination)
వైద్యులు మొదట ప్రభావితమైన కీలును క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
- స్పర్శ ద్వారా (Palpation): వాపు ఉన్న చోట నొక్కి చూడటం ద్వారా అది మెత్తగా ఉందా లేదా గట్టిగా ఉందా అని గమనిస్తారు.
- కదలికల పరీక్ష (Range of Motion): మీ కీలును వివిధ దిశల్లో కదిలించమని అడుగుతారు. ఏ కోణంలో నొప్పి వస్తుందో దీని ద్వారా తెలుస్తుంది.
- పోలిక: ఒకే శరీర భాగం (ఉదాహరణకు రెండు మోకాళ్లు) ఇరువైపులా ఎలా ఉన్నాయో పోల్చి చూస్తారు
2. ఇమేజింగ్ పరీక్షలు (Imaging Tests)
కీలు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇవి అవసరం:
- ఎక్స్-రే (X-ray): ఎక్స్-రే ద్వారా బర్సైటిస్‌ను నేరుగా చూడలేం (ఎందుకంటే బర్సా మెత్తని కణజాలం). కానీ, నొప్పికి కారణం బర్సైటిస్ కాదా, లేక ఎముక విరగడం లేదా ఆర్థరైటిస్ వంటి ఇతర సమస్యలా అనేది నిర్ధారించుకోవడానికి ఇది చేస్తారు.
- అల్ట్రాసౌండ్ (Ultrasound): బర్సాలో ద్రవం పేరుకుపోయిందా లేదా అనేది చూడటానికి ఇది చాలా ఉపయోగకరం. ఇది వేగవంతమైనది.
- MRI స్కాన్: బర్సా వాపుతో పాటు చుట్టుపక్కల ఉన్న స్నాయువులు (Tendons) లేదా కండరాలు ఏమైనా దెబ్బతిన్నాయా అని వివరంగా తెలుసుకోవడానికి MRI పరీక్ష చేస్తారు.
3. ల్యాబ్ పరీక్షలు (Laboratory Tests)
ఒకవేళ డాక్టరుకు ఇన్‌ఫెక్షన్ (Septic Bursitis) లేదా గౌట్ (Gout) పై అనుమానం ఉంటే ఈ పరీక్షలు చేస్తారు:
- బ్లడ్ టెస్ట్: రక్తంలో ఇన్ఫ్లమేషన్ స్థాయిలను (CRP, ESR) మరియు వైట్ బ్లడ్ సెల్స్ సంఖ్యను చూస్తారు.
- ద్రవ విశ్లేషణ (Fluid Analysis/Aspiration): ఇది అత్యంత ఖచ్చితమైన పరీక్ష. వాపు ఉన్న బర్సా నుండి ఒక సన్నని సూది ద్వారా కొద్దిగా ద్రవాన్ని తీసి ల్యాబ్‌కు పంపిస్తారు.
- అక్కడ బ్యాక్టీరియా ఉంటే అది ఇన్‌ఫెక్షన్ అని,
- యూరిక్ యాసిడ్ స్పటికాలు ఉంటే అది గౌట్ అని నిర్ధారిస్తారు.
-
6. బర్సైటిస్ చికిత్స
బర్సైటిస్ చికిత్స అనేది ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉంది మరియు అది ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చిందా లేదా అధిక ఒత్తిడి వల్ల వచ్చిందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీనిని ప్రధానంగా నాలుగు విభాగాలుగా విభజించవచ్చు:
1. ప్రాథమిక చికిత్స (R.I.C.E పద్ధతి)
చాలా వరకు బర్సైటిస్ కేసులు ఈ పద్ధతి ద్వారా ఇంట్లోనే నయమవుతాయి:
- Rest (విశ్రాంతి): నొప్పి ఉన్న కీలుకు పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. వాపు తగ్గే వరకు ఆ కీలుతో బరువైన పనులు చేయకూడదు.
- Ice (ఐస్ ప్యాక్): రోజుకు 3-4 సార్లు, 15-20 నిమిషాల పాటు ఐస్ ప్యాక్ పెట్టాలి. ఇది వాపును మరియు నొప్పిని తగ్గిస్తుంది.
- Compression (ఒత్తిడి): వాపు ఎక్కువగా ఉంటే, ఎలాస్టిక్ బ్యాండేజ్ (Elastic bandage) కట్టడం ద్వారా ద్రవం పేరుకుపోకుండా చూడవచ్చు.
- Elevation (ఎత్తులో ఉంచడం): వీలైతే వాపు ఉన్న భాగాన్ని (కాళ్లు లేదా చేతులు) గుండె కంటే కొంచెం ఎత్తులో ఉంచాలి.
2. మందులు
- నొప్పి నివారణ మందులు : నొప్పి మరియు ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి ఇబూప్రోఫెన్ (Ibuprofen) లేదా నాప్రోక్సెన్ (Naproxen) వంటి మందులను డాక్టర్లు సూచిస్తారు.
- యాంటీబయాటిక్స్: ఒకవేళ అది ‘సెప్టిక్ బర్సైటిస్’ (ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చింది) అయితే, డాక్టర్లు యాంటీబయాటిక్ కోర్సు ఇస్తారు.
కార్టికోస్టెరాయిడ్స్: నొప్పి తీవ్రంగా ఉండి, మందులకు తగ్గకపోతే, డాక్టర్లు నేరుగా బర్సా సంచిలోకి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇది వాపును తక్షణమే తగ్గిస్తుంది.
3. థెరపీ మరియు సహాయక చర్యలు
- ఫిజియోథెరపీ (Physical Therapy): కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి మరియు కీళ్ల కదలికలను పెంచడానికి ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తారు.
- సహాయక పరికరాలు: నడిచేటప్పుడు నొప్పి ఉంటే కర్ర (Cane), లేదా మోకాళ్లపై ఒత్తిడి పడకుండా నీ-ప్యాడ్స్ (Knee pads), లేదా స్ప్లింట్స్ (Splints) వాడమని సూచిస్తారు.
- ఆస్పిరేషన్ (Aspiration): బర్సాలో ద్రవం ఎక్కువగా చేరి వాపు విపరీతంగా ఉంటే, డాక్టర్ ఒక సన్నని సూది ద్వారా ఆ అదనపు ద్రవాన్ని బయటకు తీస్తారు.
4. శస్త్రచికిత్స (Surgery)
ఇది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే చేస్తారు:
- బర్సెక్టమీ (Bursectomy): చికిత్సకు ఏమాత్రం తగ్గని దీర్ఘకాలిక బర్సైటిస్ ఉన్నప్పుడు లేదా పదే పదే ఇన్‌ఫెక్షన్ సోకుతున్నప్పుడు, వాపుకు గురైన ఆ బర్సా సంచిని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు.
ముఖ్యమైన సూచన:
మీరు చికిత్స ప్రారంభించిన 2-3 వారాల్లో నొప్పి తగ్గకపోతే లేదా ఆ ప్రాంతంలో చర్మం ఎరుపుగా కనిపిస్తే మరియు దీనితో పాటుగా జ్వరం వస్తుంటే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
7. బర్సైటిస్ నివారణ
బర్సైటిస్ రాకుండా జాగ్రత్తపడటం లేదా ఒకసారి వచ్చిన తర్వాత అది మళ్లీ తిరగబెట్టకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ వివరించిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బర్సైటిస్ రాకుండా నివారించే అవకాశం ఉంది.
- కుషన్లు లేదా ప్యాడ్ల వాడకం: మీరు ఎక్కువ సేపు నేలపై మోకాళ్లూని పని చేసేవారైతే (ఉదా: తోటపని, ఫ్లోర్ క్లీనింగ్), తప్పనిసరిగా నీ-ప్యాడ్స్ (Knee pads) వాడాలి. అలాగే మోచేతులు ఆనించి కూర్చునేవారు మెత్తని ప్యాడ్లు వాడాలి.
- సరైన భంగిమ (Posture): కూర్చున్నప్పుడు లేదా నిలబడినప్పుడు వెన్నెముక మరియు కీళ్లు సరైన స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ఇది కీళ్లపై అదనపు భారం పడకుండా చూస్తుంది.
- బరువు మోయడం: బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచి ఎత్తాలి కానీ, నడుముపై భారం వేయకూడదు. వీలైతే వస్తువులను ఎత్తడానికి బదులు చక్రాలు ఉన్న ట్రాలీలను వాడాలి.
- పని మధ్యలో విరామాలు: ప్రతి 30 నుండి 40 నిమిషాలకు ఒకసారి పని ఆపి, కీళ్లకు విశ్రాంతి ఇవ్వాలి లేదా వేరే రకమైన కదలికలు చేయాలి.
- పనులను మార్చడం: రోజంతా ఒకే పని చేయకుండా, పనులను మారుస్తూ ఉండటం వల్ల ఏ ఒక్క కీలుపై కూడా నిరంతర ఒత్తిడి పడదు. ఉదాహరణకు రోజంతా నిలబడి పనిచేసేవారు ఐతే మధ్య మధ్యలో కూర్చుంటూ ఉండాలి. అదే ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు ఐతే మధ్యలో నడుస్తూ ఉండాలి.
- వార్మ్-అప్: ఏదైనా వ్యాయామం లేదా కష్టమైన పని మొదలుపెట్టే ముందు కనీసం 5-10 నిమిషాల పాటు వార్మ్-అప్ చేయడం వల్ల కీళ్లలోని ద్రవం (Synovial fluid) చురుగ్గా మారి బర్సాకు రక్షణ కల్పిస్తుంది.
- కండరాల బలోపేతం: కీళ్ల చుట్టూ ఉండే కండరాలు బలంగా ఉంటే, అవి ఎముకలపై పడే ఒత్తిడిని గ్రహిస్తాయి. దీనివల్ల బర్సాపై భారం తగ్గుతుంది.
- స్ట్రెచింగ్: కీళ్లు బిగుసుకుపోకుండా ప్రతిరోజూ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.
- బరువు నియంత్రణ : అధిక బరువు ఉండటం వల్ల ముఖ్యంగా హిప్ (నడుము), మోకాలు మరియు మడమ కీళ్లలోని బర్సాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ద్వారా ఈ కీళ్ల బర్సైటిస్‌ను సమర్థవంతంగా నివారించవచ్చు.
- పాదరక్షల ఎంపిక : మడమ బర్సైటిస్ రాకుండా ఉండాలంటే,మీ పాదాలకు సరిగ్గా సరిపోయే, మెత్తని సోల్ (Sole) ఉన్న బూట్లను ఎంచుకోవాలి. అరిగిపోయిన లేదా చాలా బిగుతైన బూట్లను వాడటం మానేయాలి.
- ఇతర అనారోగ్యాల నియంత్రణ : మీకు డయాబెటిస్, థైరాయిడ్, గౌట్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉంటే, వాటిని మందుల ద్వారా నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ వ్యాధులు కంట్రోల్‌లో లేకపోతే బర్సైటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
బర్సైటిస్ అనేది మన రోజువారీ పనులకు ఆటంకం కలిగించే బాధాకరమైన సమస్య. ఇది మన శరీరానికి ఇచ్చే ఒక ‘హెచ్చరిక’ లాంటిది. అంటే మన కీళ్లపై అతిగా ఒత్తిడి పడుతోందని అర్థం. సరైన సమయంలో విశ్రాంతి తీసుకోవడం, అవసరమైన వ్యాయామాలు చేయడం మరియు పని చేసే పద్ధతుల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని సులభంగా నివారించవచ్చు. అయితే, వాపుతో పాటు జ్వరం ఉన్నా లేదా నొప్పి మరీ తీవ్రంగా ఉన్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆర్థోపెడిక్ డాక్టర్ ను సంప్రదించడం అవసరం. యశోద హాస్పిటల్స్ లో అత్యంత అనుభవం కలిగిన ఆర్ధోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్లు బర్సైటిస్ సమస్యకు అత్యుత్తమ చికిత్స అందిస్తారు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.




















Appointment
Call
More