%1$s
blank
blank
blank

GERD కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం మంచిదా?

GERD కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం మంచిదా?

బరువు తగ్గడం మరియు జీర్ణ సమస్యలు , రక్తంలో చక్కెర నియంత్రణ మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచటం   వంటి ఇతర సాధారణ సమస్యల కోసం ప్రజలు తరచుగా ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. వీటి ఉపయోగం వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాల తార్కిక చర్చ ఇక్కడ ఉంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ జీర్ణ సమస్యలు మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుందా?

ఆపిల్ సైడర్ వెనిగర్ అంటే ఏమిటి?

బీర్, వైన్ మరియు సైడర్ వంటి సజల ఆల్కహాల్స్ కిణ్వ ప్రక్రియ ద్వారా వెనిగర్ లభిస్తుంది. ఇది ఎసిటిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది మరియు పుల్లని రుచిని కలిగి ఉంటుంది. పురాతన కాలం నుండి అనేక నాగరికతలలో సాధారణంగా ఉపయోగించే ఆమ్ల మసాలా దినుసులలో ఇది ఒకటి. ఆపిల్ సైడర్ వెనిగర్ చూర్ణం చేసిన ఆపిల్ జ్యూస్ కు బ్యాక్టీరియా మరియు ఈస్ట్ ను జోడించడం ద్వారా లభిస్తుంది. మొదటి దశలో, ఈస్ట్ చక్కెరలను ఆల్కహాల్ గా మారుస్తుంది. రెండవ దశలో, బాక్టీరియా ఆల్కహాల్ ను ఎసిటిక్ ఆమ్లంగా మారుస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ జీర్ణ సమస్యలు మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుందా?

చాలా మంది తమ రిఫ్లక్స్ లక్షణాల (హార్ట్ బర్న్) కోసం కొద్ది మొత్తంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుంటారు, ఇది ఉదరంలో  యాసిడ్ ఉత్పత్తి మొత్తాన్ని తగ్గిస్తుందనే ఊహతో తీసుకుంటారు . గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ (GERD) కోసం ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకానికి సహాయపడుతుందని  తెలిపే  బలమైన క్లినికల్ పరిశోధన ఏదీ లేదు. ఏదేమైనా, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని మరియు మంచి చక్కెర నియంత్రణకు, కొవ్వులను తగ్గించడానికి, రక్తపోటును మెరుగుపరచడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందని చెప్పడానికి కొన్ని ప్రచురణలు ఉన్నాయి . కానీ ఒక ఆమ్లం కావడం వల్ల, ఇది ఆమ్ల సంబంధిత రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని భావించడం తార్కికం కాదు. డయాబెటిక్ రోగులపై చేసిన చిన్న క్లినికల్ ట్రయల్స్ ద్వారా తెలిసిన అంశం  రక్తంలో గ్లూకోజ్ స్థాయిల అసమతుల్యతకు దారితీస్తుంది. గ్యాస్ట్రిక్ ఖాళీ చేయడం ఆలస్యం కావడం అంటే కడుపులో యాసిడ్ ఎక్కువ సమయం ఉంటుంది , మరియు తద్వారా అన్నవాహికలోకి మరింత రిఫ్లక్స్ కు దారితీస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ జీర్ణ సమస్యలు మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుందా?

బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకునే ముందు ఏమి తెలుసుకోవాలి?

ఎసిటిక్ ఆమ్లం కావడం వల్ల, ఆపిల్ సైడర్ వెనిగర్ గాఢత 20% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, అన్నవాహిక శ్లేష్మ పొరకు కాస్టిక్ గాయానికి దారితీస్తుంది. ఈ విభాగంలో వినియోగదారుల మార్కెట్ పేలవంగా నియంత్రించబడినందున, రిఫ్లక్స్ లక్షణాల నియంత్రణ కోసం వెనిగర్ తీసుకోవడం ప్రతికూలంగా ఉంటుంది మరియు ప్రమాదకరమని రుజువు చేస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ రిఫ్లక్స్ లక్షణాలకు సహాయపడటానికి శాస్త్రీయ ఆధారం లేదు మరియు ఏ క్లినికల్ పరిశోధనలో కూడా లేదు. మరోవైపు, దీనిని అధికంగా తీసుకుంటే హానికరం. యాసిడ్ సంబంధిత రిఫ్లక్స్ లక్షణాలు లేదా గుండెల్లో మంటను సరి చేయడానికి జీవనశైలి మార్పులు మరియు యాంటాసిడ్లు లేదా పిపిఐల యొక్క కనీస మోతాదులు (వైద్యుడి ప్రిస్క్రిప్షన్ తో)  వాడటం  ఒక మంచి మార్గం.

References:

  1. Drinking apple cider vinegar for weight loss seems far-fetched. Does it work? Mayo Clinic: https://www.mayoclinic.org/healthy-lifestyle/weight-loss/expert-answers/apple-cider-vinegar-for-weight-loss/faq-20058394
  2. Can Apple Cider Vinegar Help You Lose Weight? Healthline: https://www.healthline.com/nutrition/apple-cider-vinegar-weight-loss
  3. Apple Cider Vinegar, WebMD: https://www.webmd.com/diet/apple-cider-vinegar-and-your-health#1

About Author –

Dr. D. Srikanth ,

Sr. Consultant Pediatrician & Neonatologist

Sr. Consultant Pediatrics & Neonatology

Dr. D. Srikanth

MD (Pediatrics), PGPN (Boston, USA)
Sr. Consultant Pediatrician & Neonatologist

CONTACT

blank

Enter your mobile number

  • ✓ Valid

Contact

  • Yes Same as WhatsApp number
  • By clicking on Send, you accept to receive communication from Yashoda Hospitals on email, SMS, call and Whatsapp.
×
X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567