%1$s

లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీల్లో యశోద అగ్రగామి

advanced-liver-disease-and-transplant

శరీరంలో కీలక విధులు నిర్వర్తించే అవయవాలలో కాలేయం మొదటి స్థానంలో నిలుస్తుంది. జీర్ణవ్యవస్థకు అనుబంధంగా ఉన్న ఈ గ్రంధి దాదాపు అయిదు వందల విధులను నిర్వర్తిస్తుంటుంది. మరే అవయవం కాలేయానికి  ప్రత్యామ్నాయంకాదు. మన శరీరంలో ఏదైనా ఒక భాగంలో కణాలు దెబ్బదింటే అవి మళ్ళీ అభివృద్ధిచెసుకోగల శక్తి ఆ అవయవాలకు ఉండదు. చర్మం తరువాత ఒక్క కాలేయానికి మాత్రమే ఆ సామర్థ్యం ఉంది. కాలేయంలో దాదాపు డెబ్బయ్ శాతం దెబ్బదిన్నా తక్కిన భాగంతోనే తన విధులన్నింటినీ నిర్వహించగలదు. అంతేకాదు. అలా దెబ్బదినాటికి కారణమైన అలవాట్లు, పరిస్థతులను మార్చుకో గలిగితే  దెబ్బదిన్న భాగాన్ని తిరిగి అభివృద్ధి కూడా చేసుకోగలదు. వ్యక్తి మరణించే వరకూ ఈ విధమైన పునరుత్పాదక శక్తిని నిలబెట్టుకోగల్గటం కాలేయపు ప్రత్యేకత. అయితే కాలేయ కణాలు మొత్తం దెబ్బదిన్నప్పుడు పరిస్థితి పూర్తిగా చేజారిపోతుంది. కాలేయపు ప్రత్యేక శక్తి కూడా పనికి రాకుండా పోతుంది.

కాలేయానికి కష్టం కలిగించేవి ఏమిటి?

మితిమీరిన, దీర్ఘకాల మద్యపానం (నాలుగైదేళ్లకు పై బడి), హెపటైటిస్ బి, సి. వైరస్ ఇన్ ఫెక్షన్, ఊబకాయం వల్ల ఎక్కువ మంది  కాలేయ వ్యాధులకు గురవుతున్నట్లు గుర్తించారు.  ఈ కారణాలతో మొదట కామెర్ల వ్యాధి సోకుతుంది. కామెర్ల  వ్యాధిని గుర్తించి వెంటనే చికిత్స చేయించుకోని పక్షంలో అది  ముదిరి కాలేయం పనితీరు తీవ్రంగా దెబ్బదీస్తుంది. కామెర్ల లో  హెపటైటిస్ ఎ, ఇ. వైరసుల  వల్ల వచ్చేవి చాలా ప్రమాదకరం. కలుషితమైన నీళ్లు, తిండి వల్ల ఈ తీవ్రమైన  వైరసులు శరీరంలోకి చేరుతుంటాయి.  హైపటైటిస్ ఎ., ఇ. వైరసులతో హఠాత్తుగా కామెర్ల వ్యాధి సోకి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. కామెర్ల చికిత్సకు ఇపుడు మంచి ఫలితాలు ఇవ్వగల మందులు అందుబాటులోకి వచ్చాయి.

 చాలా కాలం పాటు మితిమీరి మద్యపానం చేయటం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బదింటుంది. లివర్ స్లిరోసిస్ వ్యాధి వస్తుంది. ఊబకాయం వల్ల ఫాట్ సిరోసిస్  లేదా నాన్ అల్కోహాలిక్ స్టియటోనాష్ ఏర్పడుతుంది. ప్రస్తుతం కాలేయ సమస్యలతో వస్తున్న వారిలో దాదాపు సగం మందిలో ఈ ఫాట్ స్లిరోసిస్ వ్యాధే కనిపిస్తోంది.  ఫాట్ సిరోసిస్ బి(చివరి), సి. ఛైల్డ్ స్టేజ్ లలో కాలేయ కణాలు చాలా వరకు పనిచేయలేని స్థితికి చేరుకుంటాయి. పిల్లలో కనిపిస్తున్న కాలేయ వ్యాధులు మాత్రం చాలా వరకు పుట్టుకతో వస్తున్నవే. శరీరధర్మక్రియలకు సంబంధించినవే. విల్సన్ డిసీజ్,  బైల్ డక్ట్స్ లేకపోవటం, కురుపులు వంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రకమైన సమస్యలు ఉన్న పిల్లలకు భవిష్యత్తులో పూర్తిగా పనిచేయలేని స్థితికి చేరుకుంటుంది.

అనారోగ్యకరమైన అలవాట్లు, కాలేయం వ్యాధులతో దెబ్బదినటం అత్యంత ప్రమాదకరమైన  పరిస్థితిని సృష్టిస్తుంది. అయితే అది  వ్యాధులబారిన పడకుండా జ్రాగత్త పడేందుకు అవకాశమూ ఉంది. వ్యాధులు సోకినపుడు ముందుగానే గుర్తించగలిగితే  కాన్సరుతో సహా కాలేయ వ్యాధులను సర్జరీల అవసరం లేకుండా  కేవలం మందులతో చికిత్సచేసి నయం చేయటానికి వీలవుతుంది. కానీ దీర్ఘకాలం నిర్లక్ష్యం చేసే పక్షంలో మాత్రం పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంటుంది. అయితే కాలేయపు అసాధారణ పని సామర్థ్యం కారణంగా  వ్యాధులు సోకినా లక్షణాలు వెల్లడి కావటానికి పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా సమయం పడుతుంది. సుదీర్ఘమైన ఈ సమయంలో కాలేయ కణాలు క్రమంగా మృతిచెందుతూవస్తాయి. దీంతో లివర్ స్కార్ ఏర్పడుతుంటుంది. వ్యాధి ముదిరిపోతుంది. ఈ పరిస్థతికి చేరేలోగా కాలేయానికి తీవ్రమైన వ్యాధులు సోకాయని సూచించే లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అవి: కళ్లు పచ్చగా మారతాయి. విడువని దురదలు బాధపెడుతుంటాయి. ఆకలి మందగిస్తుంది. నీరసంగా ఉండి ఎప్పుడూ నిద్రపోతుంటారు. కడుపులో వికారంగా అనిపిస్తుంటుంది. ఏకాగ్రత కుదరదు. జ్జపకశక్తి మందస్తుంది. చివరకు కోమాలోకి జారిపోతారు.

కాలేయవ్యాధులకు అత్యాధునిక చికిత్సలు

కాలేయ కాన్సరుకు దారితీయగల ప్రమాదం ఉన్న (దీర్ఘకాల మధ్యపానం, వైరస్ వ్యాధులు సోకినవారు, ఫాటీలివర్ వ్యాధి ఉన్న వారు)ఈ లక్షణాలు పూర్తిగా బయటపడే దాకా వేచి ఉండకుండా ముందస్తుగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని కాలేయ వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రక్తపరీక్ష, ఫైబ్రోస్కాన్ (ట్రాన్సియంట్ ఎలాస్టోగ్రఫీ) చేయించుకోవటం ద్వారా కాలేయ కాన్సరును తొలిదశలలోనే గుర్తించవచ్చునని యశోద హాస్పిటల్స్ లోని  ‘కాలేయ వ్యాధులు & లివర్ ట్రాన్స్ ప్లాంట్’ విభాగానికి చెందిన వైద్యనిపుణులు తెలిపారు.  ఈ వైద్యనిపుణులు చెప్పిన దాని ప్రకారం  వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని తీవ్రవతను మూడు స్థాయిలుగా గుర్తిస్తారు. వీటిని ఎ, బి, సి. ‘ఛైల్డ్ పగ్ స్టేజెస్’ అంటున్నారు. ‘ఎ’ ఛైల్డ్ స్థాయిలోనే డాక్టర్ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్సచేసి పూర్తి సాధారణ పరిస్థితిని పునరుద్దరించటానికి వీలుంటుంది. ‘బి’ స్థాయి ప్రారంభంలో కూడా చాలా వరకు తిరిగి కోలుకోవటానికి కాలేయం  అవకాశం ఇస్తుంది. ‘బి’ స్థిరపడ్డ తరువాత లేదా ‘సి’ స్థాయిలలో వస్తే వ్యాధి తీవ్రత, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనావేసి కాలేయ మార్పిడిని సిఫార్సుచేస్తారు. దురదృష్టవశాత్తు మనదేశంలో కాలేయ వ్యాధిగ్రస్తులలో అత్యధికులు ‘బి’ నుంచి ‘సి‘ ఛైల్డ్ స్టేజికి మారేదశలో, ‘సి‘ చివరి దశలో ఆస్పత్రులకు వస్తున్నారు.  ‘బి’ నుంచి తరువాతి స్థాయికి మారుతున్న స్థితిలో వచ్చిన వారికి, ‘సి‘ ఛైల్డ్ స్థాయి పూర్తిగా ముదరని దశలో వచ్చిన వారికి కాలేయ మార్పిడి చేసి రక్షించవచ్చు. ఇటువంటి కేసులలో తొంబై అయిదు శాతం వరకు కూడా కాలేయమార్పిడి సర్జరీలు విజయవంతం అవుతున్నాయి.

కాలేయమార్పిడితో కొత్తజీవితం

వ్యాధిగ్రస్థమై పనిచేయలేని స్థితిలో ఉన్న కాలేయాన్ని తొలగించి దాని స్థానంలో ఆరోగ్యకరమైన మరో కాలేయాన్ని అమర్చటానికి చేసే సర్జరీనే కాలేయ మార్పిడి మార్పిడి (లివర్ ట్లాన్స్ ప్లాంటేషన్) శస్త్రచికిత్స. కాలేయ మార్పిడిలో  రెండు పద్దతులు ఉన్నాయి. మొదటిది, మరణించిన దాత(కెడావరిక్ డోనార్) దేహం నుంచి సేకరించిన దానిని అవసరమైన వారికి అమర్చటం. ఇక రెండో పద్దతి ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి ఎవరైనా తన కాలేయంలోని కొంత (దాదాపు 25 శాతం) దానం చేయటం. అవయవదానానికి అంగీకరించిన వ్యక్తి మృతిచెందిన వెంటనే సేకరించిన కాలేయంతోనే కాలేయ మార్పిడి సర్జరీలు చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో  కుటుంబ సభ్యులు,సమీప బంధువులు తమ ఆప్తులను రక్షించుకునేందుకు తమ కాలేయంలో నాలుగో వంతు భాగాన్ని దానం చేస్తున్నారు. ఈ విధంగా కాలేయంలో కొంత భాగాన్ని పంచుకున్నప్పటికీ దాతలు తక్కిన కాలేయ భాగంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. కోల్పోయిన భాగాన్ని పునర్నిర్మించుకోగల శక్తి ఉన్నందున కొద్ది వారాలలోనే దాత కాలేయం పూర్వపు పరిమాణానికి పెరుగుతుంది. అంటే దాత తాను పంచుకున్న కాలేయ భాగాన్ని తిరిగి అభివృద్ధి చేసుకోగలుగుతారు. అదే సమయంలో స్వీకర్తలో కూడా కాలేయం పూర్తిస్థాయికి ఎదుగుతుంది.

మరణించిన దాత(కెడావరిక్ డోనార్) దేహం నుంచి సేకరించిన కాలేయంతో  మార్పిడి సర్జరీ చేయించుకోదలచిన వారు జీవన్ దాన్ పథకం కింద పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.    బ్రెయిన్ డెడ్(మెదడు మాత్రం మరణించి) వెంటిలేటర్ పైన ఆధారపడిన వ్యక్తిలో శరీరంలోని ఇతర అవయవాలన్నీ జీవించే ఉంటాయి. వెంటిలేటర్ తొలగిస్తే ప్రాణం పోతుంది. అటువంటి వ్యక్తి నుంచి కాలేయాన్ని తొలగించి కాలేయ మార్పిడి అవసరమై ఎదురుచూస్తన్న వ్యక్తికి అమరుస్తారు. ఈ రకమైన అవయవదానాలను రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న జీవన్ దాన్ సంస్థ సమన్వయపరుస్తుంటుంది. కెడావరిక్ కాలేయం కోసం ఈ సంస్థలో పేరునమోదుచేసుకున్న వారు నిబంధనల ప్రకారం తమ వంతు వచ్చేంత వరకూ వేచి చూడాల్సి ఉంటుంది.  ఇక రెండో పద్దతి ఆరోగ్యకరమైన కాలేయం ఉన్న వ్యక్తి ఎవరైనా తన కాలేయంలోని కొంత (దాదాపు 25 శాతం) దానం చేయటం.  కాలేయానికి ఉన్న ఈ అద్భుతమైన సామర్థ్యం వల్ల ఈ ఏ వ్యక్తి  అయినా కాలేయాన్ని దానం చేయటానికి వీలుకలుగుతున్నది. అయితే ఆ వ్యక్తి రక్తపు గ్రూపు, ఆరోగ్య పరిస్థతిని పరిశీలించిన తరువాత అది  స్వీకర్తకు సరిపడుతుందన్నఅంశాన్ని వైద్యనిపుణులు నిర్ధారించగలుగుతారు. మద్యపానానికి, మత్తుమందుల(డ్రగ్స్)కు అలవాటు పడిన, సంక్రమణవ్యాధుల(ఇన్ ఫెక్షన్స్) సోకిన, గుండె – ఊపిరితిత్తులు- నాడీ సంబంధిత వ్యాధులు ఉన్న వారిని కాలేయం దానం చేయటానికి అనర్హులుగా పరిగణిస్తారు.  ఈ రకమైన ఆరోగ్య సమస్యలు లేని, ఏభై సంవత్సరాలకు లోపు వయస్సు ఉన్న  రక్త సంబంధీకులు ఎవరైనా కాలేయ దానం చేయవచ్చు.  ఈ కారణంగా వారు దీర్ఘకాలంలో ఎటువంటి మందులు వాడాల్సిన అవసరమూ రాదు. కాలేయ మార్పిడి చేయించుకున్న వారు పూర్తిగా కొలుకున్న తరువాత కొద్ది వారాలు విశ్రాంతి తీసుకుని తమ వృత్తి జీవితాలను తిరిగి ప్రారంభించగలుగుతారు. మార్పిడి శస్త్ర చికిత్స తరువాత కాలేయాన్ని సంరక్షించుకుని పూర్తిగా కోలువటానికి, సాధారణజీవితం గడపటానికి డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

యశోద హాస్పిటల్స్:

కాలేయ వ్యాధుల చికిత్సలో అగ్రగామి

ప్రపంచవ్యాప్తంగా  వైద్యనిపుణులు, ఆస్పత్రుల నిర్వాహకులు తమ నైపుణ్యాన్ని, నిర్వహణ సామర్థ్యాన్ని సమీకృతం చేయటం ద్వారా తమవద్దకు వచ్చిన పేషంట్లకు విశ్వసనీయమైన చికిత్సతో కూడిన అత్యున్నత వైద్యసేవలను అందించగలుగుతున్నాయి. యశోద హాస్పిటల్స్ ఈ ప్రాధమిక సూత్రాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నది. అంతేకాకుండా వివిధ వైద్య విభాగాలలో ఆవిష్కారమయ్యే మెరుగైన నూతన చికిత్సా విధానాలను, అందుకు అనుగుణంగా అత్యాధునిక వైద్యపరికరాలను సమకూర్చుకుంటూ అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తూ చికిత్సా సేవల నాణ్యతను నిరంతరం మెరుగు పరుస్తూన్నది.

యశోద హాస్పిటల్స్ లో కాలేయవ్యాధులు- ట్రాన్స్ ప్లాంటేషన్,  గుండె, కార్డియో థొరాసిక్ సర్జరీ, మెదడు – నాడీ మండలం, కాన్సర్,  ఎముకలు – కీళ్లు,  గాస్ట్రో,  రీనల్, స్పైన్, ఫెర్టిలిటీ, మదర్ & చైల్డ్  రోబోటిక్ సైన్స్ కు సంబంధించి పన్నెండు సెంటర్స్ ఆప్ ఎక్సలేన్స్ ను ఏర్పాటుచేసి నిర్వహిస్తోంది. అత్యున్నత స్థాయి చికిత్సా సేవలను, పేషంట్ అవసరాలకు వేగంగా – సమీకృత ప్రయత్నంతో ప్రతిస్పందించాలన్న లక్ష్యంతో ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పనిచేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా వీటిలో ఉన్నత స్థాయిలో శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన వైద్యనిపుణులు- సహాయసిబ్బంది వీటిలో అందుబాటులో ఉంటున్నారు. యశోద గ్రూప్ లోని మూడు ఆస్పత్రులలో ఇరవై రెండు వైద్య విభాగలలో వైద్యసేవలు అందిస్తున్నాయి.

కాలేయవ్యాధుల చికిత్స, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలకు యశోద హాస్పిటల్స్ దేశంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.  ఇందుకోసం ప్రత్యేకంగా యశోద ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ & హెపటోబైలరీ డిసీజెస్ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేశారు. దీనిలో హెపటో బైలరీ వ్యాధులకు సమగ్ర చికిత్సచేస్తున్నారు. కాలేయ కాన్సర్లు, కాలేయం పూర్తిగా విఫలమయిన కేసులకు సమర్థమై చికిత్స అందిస్తున్నారు. వయోజనులు, పిల్లలకు కాలేయ మార్పిడి  చేస్తూన్నారు. చనిపోయిన దాతల (కెడావరిక్), సజీవదాతల(లైవ్ డోనార్) నుంచి సేకరించిన

కాలేయాలతో ఇప్పటి వరకూ 2700కు పైగా కాలేయ మార్పిడి సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు. ఇందుకోసం దేశవిదేశాలలోని ప్రతిష్టాత్మక వైద్యకేంద్రాలలో శిక్షణపొందిన- పనిచేసిన   నిష్ణాతులై(మల్టీ డిసిప్లేనరీ)న వివిధ వైద్య విభాగాల ట్రాన్స్ ప్లాంట్ నిపుణులు ఈ ఇనిస్టిట్యూట్ లో నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. అత్యంత అధునాతనమైన హెపా-ఫిల్టర్డ్  ఆపరేషన్ థియేటర్లలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నారు.

అధునాత వైద్యపరికరాలతో కాలేయ మార్పిడి సర్జరీల కోసం పూర్తికాలం పాటు ప్రత్యేకించిన ఈ  ఆపరేషన్ థియేటరకు తోడు ప్రత్యేకమైన లివర్ ఇంటెన్సివ్ కేర్(ఐ.సి.యు) & పో స్ట్ ఆపరేటివ్ కేర్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తివంతమైన మందులు, ఖచ్చితమైన శస్త్రచికిత్సలు,  కాలేయ మార్పిడి సర్జరీలు అత్యధిక శాతం విజయవంతం అవుతుండటం కాలేయ వ్యాధుల నుంచి నమ్మకమైన ఉపశమనం కలిగిస్తూ దక్షిణాధిన కాలేయ మార్పిడి ఆపరేషన్ల నిర్వహణకు సంబంధించి యశోద ఆస్పత్రులు కొత్త ఒరవడిని ప్రవేశపెట్టగలిగాయి.

యశోద కాలేయ వ్యాధులు &
లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విభాగం
యశోద హాస్పిటల్స్.
సికిందరాబాద్.

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567