%1$s

న్యూరాలజీ సంబంధిత సమస్యలు మరియు చికిత్స వివరాలు

neurology conditions treatments

ట్యూమర్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు ఉంటాయి?

ట్యూమర్ల (కణుతుల)లో చాలా రకాలు ఉన్నాయి. వీటిని ప్రధానంగా రెండు విధాలుగా వర్గీకరిస్తారు. మొదటిది హానికరం కాని ట్యూమర్లు (బినైన్‌), రెండోవది హాని చేసే ట్యూమర్లు (మాలిగ్నెంట్‌). రెండో రకం ట్యూమర్లే సాధారణంగా క్యాన్సర్‌ వ్యాధులకు దారితీస్తాయి. సర్జరీ ద్వారా మెదడులోని కణుతులను తొలగించడం కష్టమే ఎందుకంటే శరీరంలోకెల్లా మెదడు అత్యంత సునిశితమైన, సంక్లిష్టమైన కణజాలంతో నిర్మితమైనది. అందువల్ల అక్కడి కణితిని సర్జరీ ద్వారా తొలగించడం కేవలం నైపుణ్యం కలిగిన న్యూరో సర్జన్స్ కి మాత్రమే సాధ్యం. కణితి చుట్టూ ఉండే అత్యంత సున్నితమైన కణజాలం , నాడులు దెబ్బతినకుండా ఎంతో నేర్పుతో, నైపుణ్యంతో కూడిన న్యూరో నావిగేషన్ పక్రియ అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో సీటీ, ఎమ్మారై సహాయంతో తీసిన మెదడు కణితికి సంబంధించిన 3డీ చిత్రాలను కంప్యూటర్‌ తెరపై చూస్తూ సర్జన్లు ఇప్పుడు అత్యంత సురక్షితంగా కణితిని తొలగించగలుగుతున్నారు.ముందుగా మెదడులో ఏర్పడ్డ ట్యూమర్ ఏ రకానికి చెందిందో పరీక్షల ద్వారా నిర్ధారణ చేయాలి. మెదడులో ఏర్పడ్డ ట్యూమర్ బినైన్‌ రకం అయివుంటే, ఒకసారి సమూలంగా తొలగించిన తర్వాత అది మళ్లీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే మాలిగ్నెంట్‌ ట్యూమర్లను సైతం శస్త్రచికిత్స, రేడియేషన్‌, కీమోథెరపీ వంటి ప్రక్రియల ద్వారా చాలావరకు అదుపు చేయవచ్చు. దీనివల్ల మాలిగ్నెంట్‌ ట్యూమర్‌ కలిగించే దుష్ప్రభావాలు లోనుకాకుండా దీర్హకాలంపాటు జీవితాన్నికొనసాగించవచ్చు.

నడుము నొప్పికి శస్త్ర చికిత్స అవసరమా ?

ఈమధ్య కాలంలో చాలా మందిని నడుము నొప్పి సమస్య పట్టి పీడిస్తోంది. వివిధ రకాల ఒత్తిడి, జీవన విధానంలో మార్పులు, అధిక బరువులెత్తడం చాలా సేపు ఒకే భంగిమలో ఉండటం, ముందుకు ఒంగి పనిచేయడం, రోజూ చాలా దూరం బైక్‌పై ప్రయాణం చేయడం వంటి కారణాలతో వెన్నెముక మీద ఒత్తిడి ఏర్పడి ఈ సమస్య తలెత్తుతోంది. మీరు ఇటు ఇంట్లో పని చేనుకుంటూ ఆపై మీ పనుల మీద ద్విచక్రవాహానం నడుపుతూ అదనంగా శ్రమపడుతున్నారు. అంటే మీరు శారీరక ఒత్తిడికి అధికంగా లోనవుతున్నట్లు అర్ధమవుతోంది. మీరు వెన్నుపూసకు ఎక్స్‌రే తీయించారా? ఆ పరీక్ష ఫలితాలను చూసి డాక్టర్‌ మీకు సర్జరీ చేయించమని సలహా ఇచ్చినట్లతే స్పాండిలోసిస్ అనే సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నట్లు నిర్ధారణ చేయవచ్చు. ఈ సమస్యతో బాధపడుతున్నవారిలో కొంతమందికి మందుల తోనే నయమైతే, మరికొందరికి నడుమ కింది భాగంలో బెల్ట్‌ పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి వైద్యులు వాకింగ్‌, యోగా లాంటి వ్యాయామాలు సూచిస్తారు. అప్పటికీ తగ్గకపోతే శస్త్రచికిత్స నిర్వహించి, వెన్నుపూన లోపల జారిపోయిన ఎముకను సాధారణ స్థితికి తీసుకువచ్చి స్ర్యూస్‌, రాడ్స్‌ బిగించి, నరాలు ఒత్తిడికి గురికాకుండా చేస్తారు. ఈ విషయంలో మీరు ఆందోళనపడాల్సిందేమీ లేదు. వెన్నుకు ఆపరేషన్‌ చేసే విధానాలలో సురక్షితమైన _ శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. వెన్నెముక సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని, మిగతా భాగాలు దెబ్బతినకుండా మినిమల్లీ ఇన్వేసివ్‌ విధానంలో తక్కువ కోతతో ఆపరేషన్‌ నిర్వహించగలుగుతారు. ఈ విధానంలో వెన్నుపాముకి ఒక అంగుళం లేదా అంతకన్నా తక్కువ పరిమాణంలో ఒక చిన్న రంధ్రం పెడతారు.దీన్నే కీ-.హోల్‌ అంటారు. శరీరంపై చిన్న కోత మాత్రమే ఉంటుంది కాబట్టి గాయం త్వరగా మానిపోతుంది. శస్త్రచికిత్స నిర్వహించిన రోజున లేదా రోగిని ఇంటికి పంపించేస్తారు.

ఫిట్స్‌ (మూర్చ) ఎందుకు వస్తాయి, వాటి వల్లనా ప్రమాదం ఏమైనా ఉందా ?

ఫిట్స్‌ (మూర్చ) అనేది మెదడులో సంభవించే ప్రకోపనాలకు సంకేతం మాత్రమే. ఫిట్స్‌ వల్ల నిజానికి ఎలాంటి ప్రాణహానీ ఉండదు.ఫిట్స్‌ను ఏదో తీవ్రమైన, అరుదైన,  ప్రమాదకరమైన సమస్యగా చూస్తుంటారు. కానీ అది నిజం కాదు. ఇది చాలా సాధారణమైన సమస్య. మెదడులోని నాడీ కణాల్లో నిరంతరం విద్యుత్‌ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఉన్నట్లుండి మెదడులోని కొన్ని ప్రాంతాల్లోని నాడీ కణాల్లో విద్యుత్‌ చర్యలు అస్తవ్యస్తమైనప్పుడు ఫిట్స్‌ వస్తాయి. వీటినే సీజర్స్‌ అని కూడా అంటారు. ఇలా తరచూ ఫిట్స్‌ వస్తుంటే దాన్ని తెలుగులో మూర్చ అని లేదా ఇంగ్లిష్‌లో ఎపిలెప్సీ అని అంటారు. ఫిట్స్‌ అన్నీ ఒకే రకానికి చెందినవి కావు. ఈ ఎక్కడ మొదలవుతుందో దాన్ని బట్టీ, ఆ సమయంలో కనిపించే లక్షణాలను బట్టీ ఇది ఏరకమైన ఫిట్స్‌ అన్నది నిర్ధారణ చేస్తారు.

కొందరిలో మెదడులో గడ్డలు ఉన్నప్పుడు కూడా ఫిట్స్‌ వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మాత్రం శస్త్రచికిత్సతో గడ్డలను తొలగించాల్సి ఉంటుంది.

సాధారణంగా ఫిట్స్‌ వచ్చిన సందర్భాలలో కొద్దిసేపట్లోనే ఎలాంటి వైద్యసహాయం లేకుండానే పేషెంట్లు తమంతట తామే కోలుకుంటారు.అయితే ఫిట్స్‌ వచ్చిన సమయంలో రోగిని ఒకవైవునకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టడం చాలా ముఖ్యం. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా చేయవచ్చు. ఫిట్స్‌ వచ్చినప్పుడు రోగి తనకు తెలియకుండానే నిద్రీలోకి జారుకుంటాడు. మళ్లీ కొద్దినిమిషాల్లోనే స్పృహలోకి వస్తాడు. అలా కొద్దినిమిషాల్లోనే స్పృహలోకి రాకపోతే మాత్రం వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించాలి. అంతేగానీ ఫిట్స్‌ వచ్చిన సమయంలో పేషెంట్‌ నోట్లో ఏదైనా పెట్టడం, చేతిలో తాళాల వంటి ఇనుప వస్తువులు ఉంచడం, ముక్కు దగ్గర ఏదైనా తోలు వస్తువు వాసన చూపడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇలాంటి చర్యల వల్ల పేషెంట్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా కొన్నిసందర్భాలలో అవి హాని చేసే ప్రమాదం కూడా ఉంది. ఇక అమ్మాయిల విషయానికి వస్తే స్త్రీ జీవితంలోని ప్రతి దశలోనూ అంటే… రజస్వల కావడం, నెలసరి రావడం, గర్భధారణ, బిడ్డకు పాలివ్వడం, నెలసరి నిలిచిపోవడం… ఇలా ప్రతి దశలోనూ హార్మోన్ల ప్రభావం బలంగా ఉంటుంది. దీంతో ఫిట్స్‌ సమస్యకూడా ప్రభావితమయే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి వారిలో 90 శాతం కేసుల్లో సుదీర్ఘ చికిత్స మందుల ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయి.

About Author –

Dr. Anandh Balasubramaniam, Senior consultant and HOD, Neurosurgery, Yashoda Hospital, is a renowned neurosurgeon in Hyderabad. His expertise include neuro-oncology, intraoperative MRI and image guided neurosurgeries, endoscopic surgeries, endoscopic minimally invasive surgeries, deep brain stimulation and functional neurosurgeries.

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567