%1$s

యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో “లోయర్ లింబ్ జాయింట్ ప్రిజర్వేషన్” అనే రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ విజయవంతం

500 మందికి పైగా ఆర్థోపెడిక్ సర్జన్లతో యశోద హాస్పిటల్స్ అంతర్జాతీయ జాయింట్ ప్రిజర్వేషన్ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ విజయవంతం. ముఖ్య అతిధిగా పాల్గొన్న సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ & భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.

యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్ ఆధ్వర్యంలో “లోయర్ లింబ్ జాయింట్ ప్రిజర్వేషన్”‌పై ‘ప్రిజర్వ్’ పేరిట (ఆగస్టు 12 & 13 తేదీల్లో) హోటల్ ఐటీసీ కాకతీయలో 2 రోజుల అంతర్జాతీయ జాయింట్ ప్రిజర్వేషన్ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు భాగంగా రెండవ రోజు ముఖ్య అతిథిగా సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు & ఇండియన్ కోచ్ పుల్లెల గోపీచంద్ & యశోద హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. యస్. రావు‌ తో కలిసి సదస్సును ప్రారంభించరు.

ఈ సందర్బంగా సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు & ఇండియన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మాట్లాడుతూ, “భారతదేశంలో ఆర్థరైటిస్ 180 మిలియన్ల కంటే ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంది – మధుమేహం మరియు క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల కంటే “ఆర్థరైటిస్” బారినపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. భారతీయ జనాభాలో దాదాపు 14% మంది ప్రతి సంవత్సరం “ఆర్థరైటిస్”తో వైద్యుని సహాయం కోరుకుంటున్నారు. సాధారణ గాయాల కారణంగా లేదా వృద్ధాప్యంలో ఆర్థరైటిస్ కారణంగా కీళ్ళు దెబ్బతిన్నప్పుడు, పేషెంట్స్ మొత్తం జాయింట్ రీప్లేస్‌మెంట్‌ల నుండి ఎంతో ప్రయోజనం పొందుతారు. కీళ్ళు దెబ్బతినకుండా నిరోధించడానికి అందుబాటులో ఉన్న అధునాతన పద్ధతులను విశ్లేషించడం ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రారంభ దశలో కీళ్లను సంరక్షించడం వల్ల ఆర్థరైటిస్ అభివృద్ధిని నివారించవచ్చు.” అని తెలిపారు.

“ఈ రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ లో “ఆర్థోపెడిక్” వైద్య రంగంలో జాయింట్ రీప్లేస్మెంట్స్ లో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విధానాలను జాతీయ మరియు అంతర్జాతీయ వైద్య నిపుణులతో ప్రత్యక్ష వర్క్ షాప్ & ఇంటరాక్టివ్ శిక్షణా సెషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో అధునాతన ఆర్థ్రోస్కోపిక్ పద్ధతులు మరియు రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు, ప్రత్యక్ష రోబోటిక్ శస్త్రచికిత్సలను ప్రదర్శించారు. ఈ రెండు రోజుల ప్రత్యక్ష రోబోటిక్ సర్జరీ శిక్షణా కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి 500 మందికి పైగా ఆర్థోపెడిక్ సర్జన్లు పాల్గొన్నారని,” డాక్టర్. నితిన్ కుమార్, సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ తెలిపారు.

యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. సురేందర్ రావు, మాట్లాడుతూ, “ఈ సదస్సులో అత్యాధునిక రోబోటిక్, లాపరోస్కోపిక్ మరియు ఓపెన్ టెక్నిక్ ద్వారా అనేక ఆర్థోపెడిక్ సర్జరీలు విజయవంతంగా ఏలా నిర్వహించాలో ఈ సదస్సుకు హాజరైన 500 మందికి పైగా యువ సర్జన్లకు (ప్రత్యక్ష) లైవ్ సర్జికల్ వర్క్ ‌షాప్ ద్వారా వివరించడం జరిగింది. ఇక్కడ ఆపరేటింగ్ సర్జన్లు ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలలో ఉన్న వివిధ సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంతోపాటు ఆర్థో వైద్య రంగంలో ఉన్న సుమారు 20 మంది ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులతో వారి అనుభవాలను పంచుకునే విధంగా ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు మరియు లైవ్ వర్క్ షాప్ రుపొందిచడం జరిగింది” అని తెలియజేశారు.