%1$s

సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ లో ‘ఐయామ్ అన్ స్టాపబుల్’ బుక్ ఆవిష్కరణ

సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ లో ‘ఐయామ్ అన్ స్టాపబుల్’ బుక్ ఆవిష్కరణ

“క్యాన్సర్ అంటే ఇక డెత్ సెంటెన్స్ కాదు”

క్యాన్సర్ వచ్చిందంటే మరణం సంభవిస్తుందన్న అపొహ వీడాలని, ఆ వ్యాధిని ఎన్నడూ డెత్ సెంటెన్స్ గా భావించకూడదని యశోద హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా శనివారం సాయంత్రం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్ లో ‘వీ ఇన్స్పైర్’ పేరుతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ సర్వైవర్స్ సపోర్ట్ గ్రూప్, ‘ఐ యామ్ అన్ స్టాపబుల్’ అనే పుస్తకాన్ని ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్. పవన్(కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్) డాక్టర్. సచిన్ మర్దా, యశోద హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విభాగం జనరల్ మేనేజర్ విమలా ప్రసాద్, డాక్టర్ లింగయ్య, డాక్టర్ సోములు, రచనా ముడుంబైతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్. పవన్ మాట్లాడుతూ.. 20 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వ్యాధి అంటే మరణానికి దగ్గర కావడమేనని భావించే వారని, నాటి చికిత్స విధానంలో సర్వైవల్ రేట్ కూడా తక్కువేనన్నారు. కానీ, నేడు వైద్య శాస్త్రంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు, చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మరెన్నో పరిశోధనలు జరుగుతున్నాయని, ఫలితంగా సర్వైవల్ రేట్ పెరిగిందన్నారు. కీమో, రేడియో థెరపీలతో పాటు అధునాతన పద్ధతులు ఉన్నాయని, రోబోటిక్ సర్జరీ, ఇమ్యూనోథెరపి లాంటి చికిత్స విధానాలతో క్యాన్సర్ కణాలను పూర్తిగా నశింపచేయవచ్చన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ యశోదలో చికిత్స పొంది వ్యాధిని జయించిన వరంగల్ వాసి శ్రీకాంత్, కెన్యా దేశానికి చెందిన 78 ఏండ్ల జోసెఫ్ తమ అనుభవాలను పంచుకున్నారు.