%1$s

“ECMO” పై హైటెక్-సిటీ యశోద హాస్పిటల్స్ లో భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ నిర్వహణ

1000 మందికి పైగా క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు, ఎక్మో వైద్యులు, & ప్రసిద్ధ అంతర్జాతీయ వైద్య అధ్యాపకులతో ఇంటర్నేషనల్ “ఎక్మో”  కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ విజయవంతం 

హైదరాబాద్, జనవరి 20, 2024: యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ, ఎక్మో సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా “ECMO” పై 13వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ నిర్వహించింది. ECMO – ఎక్స్ ‌ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అనేది తీవ్రంగా దెబ్బతిన్న ఊపిరితిత్తులకు మరియు గుండెకు అత్యంత అధునాతనమైన లైఫ్ సేవింగ్ సపోర్ట్ ఇచ్చే సిస్టమ్‌లలో ఇది ఒకటి. ఈ 13వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ లో 20 మందికి పైగా ప్రపంచంలోని అత్యుత్తమ అంతర్జాతీయ అధ్యాపకులు మరియు 100 మందికి పైగా ప్రసిద్ది గాంచిన జాతీయ అధ్యాపకులు భారతదేశం నలుమూలల నుంచి1000 మందికి పైగా ECMO వైద్యులు పాల్గొనడం జరిగింది. క్రిటికల్ కేర్ వైద్య నిపుణులకు ఈ 3 రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ లో ఆచరణాత్మక అనుకరణ ఆధారిత శిక్షణ గురించి క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో జరిగిన అతిపెద్ద ECMO సమావేశాలలో ఇది ఒకటి. అడల్ట్ & పీడియాట్రిక్ వైద్యులు, పారామెడికల్  స్టాఫ్, పెర్ఫ్యూనిస్ట్ నర్సింగ్, మరియు రెస్పిరేటరీ థెరపిస్ట్‌లు ఈ జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్, డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. దాదాపు నలభై సంవత్సరాల క్రితమే ఎక్మోకు రూపకల్పన జరిగినా పరిశోదనలు, వాడకంలో అనుభవాల కారణంగా అప్పట్లో ఎక్మో ఉపయోగించడం చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ ECMO పరికరం అత్యంత  ఆధునికంగానూ, అదే విధంగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండి గుండె, ఊపిరితిత్తులు పనిచేయని సమయంలో మరింతగా ఆధారపడ దగ్గదిగా ఆవిష్క్రతమైంది. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి తర్వాత ECMO అవసరం ఎక్కువగా పెరిగిపాయింది. కోవిడ్ మహమ్మారి సమయంలో చాలా ఎక్కువ మంది పేషెంట్లను ‘ఎక్మో’ సహాయంతో కాపాడిన ఆసుపత్రుల్లో యశోద హాస్పిటల్స్ ఒకటి. ECMO మద్దతు మరియు ఊపిరితిత్తుల మార్పిడితో ప్రాణాలను కాపాడేందుకు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి అత్యధిక సంఖ్యలో 100 కంటే ఎక్కువ ఎయిర్ అంబులెన్స్ బదిలీలు యశోద హాస్పిటల్స్‌కు జరిగాయని అన్నారు.  ఈ ముడు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ అనేది నైపుణ్యాన్ని పంచుకోవడంపై దృష్టి సారించి, రోగుల సంరక్షణలో ఆవిష్కరణ, సహకారం మరియు శ్రేష్ఠతను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ క్రిటికల్ కేర్ మెడిసిన్ స్పెషలిస్ట్, డాక్టర్. వెంకట్ రామన్ కోలా, మాట్లాడుతూ.. మరణం అంచు నుంచి మళ్లీ నిండు జీవితం వైపు మళ్ళించే పరికరమే ఎక్మో. ఒక వ్యక్తి యొక్క గుండె, ఊపిరితిత్తులు పనిచేయని సమయంలో ఎక్మో పరికరాన్ని ఉపయోగించి ఆ వ్యక్తి యొక్క శ్వాసకోశాలు, మరియు సహజంగా గుండె చేసే పనులను శరీరం వెలుపట చేయడం జరుగుతుంది. మొదట రోగి శరీరంలోని ప్రధాన సిర (చెడురక్తాన్ని గుండెకు చేరవేసే నాళం) నుంచి ఓ క్యాథటర్ ద్వారా చేడు రక్తాన్ని బయటకు తీసుకువస్తారు. దానిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను తొలగించి ఎక్మో లోని ఆక్సిజనేటరుకు పంపి ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ను అందించిన తరువాత మరో క్యాథటర్ ద్వారా తిరిగి శరీరంలోకి పంపిస్తారు. ఈ సదస్సుకు హాజరైన 1000 మందికి పైగా యువ డాక్టర్లకు (ప్రత్యక్ష) అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ ద్వారా దీని గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. ఎక్మో ఆపరేటింగ్ లో ఉన్న వివిధ సంక్లిష్టతలను అర్థం చేసుకోవడంతో పాటు ఎక్మో వైద్య రంగంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ వైద్య నిపుణులతో వారి అనుభవాలను పంచుకునే విధంగా ఈ ముడు రోజుల అంతర్జాతీయ సదస్సు మరియు లైవ్ వర్క్ షాప్ రూపొందించడం జరిగిందని డాక్టర్. వెంకట్ రామన్ కోలా, తెలియజేసారు.