%1$s

వెర్టిగో: రకాలు, కారణాలు, లక్షణాలు & నివారణ చర్యలు

Vertigo Types, Causes, Symptoms, Diagnosis & Remedial Measures blog banner

ప్రస్తుత జీవనశైలిలో మార్పులు కారణంగా చాలా మంది సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో కడుపు నొప్పి ప్రధానమైంది. సాధారణంగా ఛాతీకి, తొడ, గజ్జకు మధ్యలో భాగం లో వచ్చే నొప్పిని కడుపునొప్పి అంటారు. ముఖ్యంగా కడుపునొప్పి అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వయస్సు, లింగం తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధపెడుతుంటుంది. కడుపు నొప్పి సమస్యతో బాధపడే వారు ఏ పనుల మీద దృష్టి సారించలేక ఇబ్బంది పడుతుంటారు. నోటి నుంచి మొదలుకుని జీర్ణాశయం, కాలేయం, క్లోమం, చిన్నప్రేగులు, పెద్దప్రేగుల వరకూ విస్తరించిన జీర్ణకోశ వ్యవస్థ అన్నీ కడుపులోని భాగాలే. వీటిలో ఎక్కడ ఇబ్బంది తలెత్తిన కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

వెర్టిగో యొక్క లక్షణాలు

వెర్టిగో సమస్య ఉన్న వారిలో మొదటగా కనిపించే లక్షణం తల తిరగడం మరియు పరిసరాలు గిర్రున తిరిగినట్టు అనిపించడంతో పాటు: 

  • వణుకు
  • వినికిడి శక్తి  తగ్గడం
  • రోజు వారి పనుల్లో అంతరాయం
  • విపరీతమైన తలనొప్పి
  • నడుస్తున్నప్పుడు తూలి పడడం
  • సరిగా నిలబడలేకపోవడం
  • మైకం కమ్మడం
  • కళ్లు తిరగడం
  • కంటి చూపు మసకబారడం
  • జ్ఞాపకశక్తి లోపించడం
  • స్పష్టంగా ఆలోచించడం, ఏకాగ్రత లేదా సమాచారాన్ని గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

వెర్టిగో సమస్యకు గల కారణాలు

Vertigo Causes telugu

వెర్టిగో సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి:

  • తరచుగా మానసిక ఒత్తిడికి గురికావడం
  • పార్శ్వపు నొప్పి 
  • బ్రెయిన్‌ స్ట్రోక్ మరియు తలకు ఏదైనా గాయం అవ్వడం 
  • ఎక్కువసేపు ఎండలో లేదా పొల్యూషన్ కలిగిన వాతావరణంలో తిరగడం
  • పోషకాహార లోపం కారణంగా కూడా చాలా మందిలో వెర్టిగో భావన కలుగుతుంది.
  • సరైన సమాయానికి ఆహారం తీసుకోకపోయిన రక్తంలో చెక్కర స్థాయిలు తగ్గి తల తిరిగినట్టు అనిపిస్తుంది.
  • రక్త ప్రవాహంలో మార్పులు అనేవి కూడా వెర్టిగోకు కారణాలుగా చెప్పవచ్చు. కొన్ని సార్లు నరాలు నెమ్మదిగా స్పందిస్తాయి, ఈ సమయంలో రక్తప్రసరణలో మార్పులు రావడం వల్ల వెర్టిగో వస్తుంది. 
  • చెవి లోపల ఇన్ఫెక్షన్లు లేదా మైగ్రేన్ ఉన్నవాళ్లకి వెర్టిగో వచ్చే ఛాన్స్​ ఉంది. కొన్ని సార్లు మైగ్రేన్​ లేనివాళ్లకి కూడా వెర్టిగో రావొచ్చు.
  • తక్కువ నీటిని తాగడం వల్ల శరీరంలో అవయవాలు పనిచేయకపోవడం వలన కూడా వెర్టిగో వస్తుంది. 

విటమిన్​ బి–12 లోపం ఉన్నా, ఎనీమియా సమస్యతో బాధపడే వారిలోనూ తల తిరుగుతుంది. కొన్నిరకాల న్యూరలాజికల్ డిజార్డర్స్​,  సర్వైకల్​ స్పాండిలైటిస్​, గుండె సమస్యలు కూడా వెర్టిగోకి కారణమవుతాయి.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

వెర్టిగో రకాలు

వర్టిగో ప్రధానంగా పెరిఫెరల్‌ వర్టిగో, సెంట్రల్‌ వర్టిగో అని రెండు రకాలు.

1. పెరిఫెరల్‌ వర్టిగో:

ఈ సమస్య చాలామందిలో సర్వసాధారణం. చెవిలో ఉండే లోపలి చెవి గాని లేదా వినికిడికి సంబంధించిన నరం ప్రభావితమైతే దానిని పెరిఫెరల్‌ వర్టిగో అంటారు.

పెరిఫెరల్‌ వెర్టిగో ప్రధానంగా 4 కారణాల వల్ల రావొచ్చు. 

బినైన్‌ పెరాగ్జిస్మల్‌ పొజిషనల్‌ వర్టిగో (BPPV): బినైన్‌ పెరాగ్జిస్మల్‌ పొజిషనల్‌ వర్టిగో అనేది పెద్ద ప్రమాదకార సమస్య ఏమి కాదు. దీనివల్ల పక్కకు తిరిగి పడుకున్నప్పుడు కళ్లు తిరిగినట్లుగా ఉంటుంది. అంటే పడుకునే పొజిషన్‌ మారినప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

లాబ్రింథైటిస్‌: చెవి లోపల ఉండే ల్యాబ్రింథ్స్‌ దెబ్బతినడం వల్ల వెర్టిగోతో పాటు వినికిడి సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు.

వెస్టిబ్యులర్‌ న్యూరైటిస్‌: చెవికి సంబంధించిన నరం దెబ్బతినడం వల్ల వెస్టిబ్యులర్‌ న్యూరైటిస్‌ వెర్టిగో సమస్య వస్తుంది.

మీనియర్స్‌ డిసీజ్‌:  మన లోపలి చెవి (ఇన్నర్‌ ఇయర్‌) వినికిడి సామర్థ్యానికీ, నిటారుగా ఉండేందుకు దోహదం చేస్తుంది. ఇక్కడ సమస్య వస్తే వినికిడి శక్తి తగ్గడంతో పాటు, నిటారుగా నిలబడి ఉండే సామర్థ్యం కూడా తగ్గిపోయి ఒళ్లంతా గిర్రున తిరుగుతూ, తూలి కిందికి పడిపోతామేమోనన్న ఫీలింగ్‌ కలుగుతుంది.

2. సెంట్రల్‌ వెర్టిగో:  

మెదడులొని ముఖ్య బాగమైన సెరిబెల్లం దెబ్బతినడం వల్ల సెంట్రల్‌ వెర్టిగో సమస్య తలెత్తుతుంది. మెదడుకు ఏదైనా ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు గానీ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినడం వల్ల, లేదంటే తలకు ఏదైనా గాయాల వల్ల కూడా సెంట్రల్‌ వెర్టిగో రావచ్చు. సాధారణంగా సెంట్రల్‌ వెర్టిగో ఉన్నవారు నడవడానికి ఇబ్బంది పడుతుంటారు.

వెర్టిగో యొక్క నివారణ చర్యలు

  • వెర్టిగో సమస్యతో బాధపడుతున్న వారు ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి
  • యోగా, నడకా వంటి సున్నితమైన వ్యాయామాలు చేస్తూ ఉండడం
  • శ‌రీరం డీ హైడ్రేష‌న్​కు గురికాకుండా అవ‌స‌ర‌మైన స్థాయిలో ద్ర‌వాలు తీసుకోవడం
  • ఒత్తిడిని, మానసిక ఆందోళనలను దూరంగా ఉండడం
  • ప్రశాంతంగా జీవించేందుకు మరియు కుటుంబంతో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించడం
  • మెడ మరియు శరీరానికి సంబంధించిన కొన్ని ఆకస్మిక కదలికలను నివారించుకోవడం
  • ధూమపానం & మద్యపానం మానేయడం యరియు కెఫిన్​ ఉన్న డ్రింక్స్ ను​ ఎక్కువ తీసుకోకపోవడం
  • తల యొక్క ఆకస్మిక, వేగవంతమైన కదలికలను నివారించడం
  • వెర్టిగో సమస్యతో తీవ్రమైన ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే ఒక గదిలోకి వెళ్లిపోయి సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవడం మంచిది
  • వెర్టిగో ఉన్నవారు తలను కాస్త ఎత్తుగా పెట్టి నిద్రించడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • అధిక శబ్దాలతో మరియు తీవ్రభయాందోళనలకు, మానసిక కల్లోలాలకు కారణమయ్యే సినిమాలు  చూడడం నియత్రించుకోవాలి

వెర్టిగో సమస్యకు సరైన సమయంలో చికిత్స చేయకపోతే, తీవ్రమైన పరిణామాలను దారితీస్తుంది. ఎక్కువ సేపు వెర్టిగో లక్షణాలు ఉన్న,వెర్టిగోతో పాటు ఛాతీలో నొప్పి గాని, గుండెలో దడ గాని, లేదా తలనొప్పి గాని, నడుస్తుంటే తూలడం, చూపులో తేడా వచ్చినా, ఒక చెయ్యి, కాలు బలహీనమైనా లక్షణాలను గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262676 మాకు కాల్ చేయగలరు.

About Author –

Dr. Kandraju Sai Satish,Consultant Neurologist & Epileptologist, Yashoda Hospital, Hyderabad

Dr. Kandraju Sai Satish the Best Epilepsy Specialist in Hyderabad

Dr. Kandraju Sai Satish

MD, DM (Neurology), PDF in Epilepsy
Consultant Neurologist & Epileptologist

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567