ఊపిరితిత్తుల్లో నీరు చేరడం అంటే ఏమిటి? : కారణాలు, లక్షణాలు, నిర్ధారణ, చికిత్స, నివారణ

u003cpu003eమన రక్తంలో ప్రధానంగా నాలుగు ముఖ్య భాగాలు ఉంటాయి. ఇవి ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్. రక్తంలో ఎర్ర రక్తకణాలు 44 శాతం ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను (హేమోగ్లోబిన్ ద్వారా) సరఫరా చేస్తాయి. ఎర్ర రక్త కణాల ఆకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, వీటిని శాస్త్రీయంగా ద్విపుటాకారము (Biconcave Disk) అని అంటారు.దీనిని సరళంగా చెప్పాలంటే, ఇది గుండ్రంగా, డోనట్ ఆకారంలో ఉంటుంది, కానీ మధ్యలో రంధ్రం ఉండదు.పక్క నుండి చూసినప్పుడు, కణం యొక్క అంచులు మందంగా ఉండి, మధ్య భాగం లోపలికి నొక్కినట్లుగా ఉంటుంది.u003c/pu003enu003cpu003eస్పిరోసైటోసిస్ (Spherocytosis) అనేది ఒక రకమైన u003ca href=u0022https://www.yashodahospitals.com/te/blog/the-hemoglobin-levels-are-very-low-in-iron-deficiency-anemia/u0022u003eరక్తహీనతu003c/au003e . ఈ స్థితిలో, సాధారణంగా ద్విపుటాకారంలో ఉండాల్సిన ఎర్ర రక్త కణాలు వాటి ఆకారాన్ని కోల్పోయి, గుండ్రటి బంతిలాంటి ఆకారంలోకి మారిపోతాయి. అందుకే దీనికి స్పిరోసైటోసిస్ (స్పియర్ అంటే గోళం/బంతి) అనే పేరు వచ్చింది.u003c/pu003e
ఊపిరితిత్తుల్లో నీరు చేరడం అంటే ఏమిటి?
మన శరీరంలోని అన్ని అవయవాలకు నిరంతరం ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఐతే మన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందించడానికి ఊపిరితిత్తులు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. బయటి వాతావరణంలోని గాలినుండి ఆక్సిజన్ ను రక్తంలో కలిపి, అలాగే రక్తంలో ఉన్న కార్బన్ డై ఆక్సయిడ్ ను బయటకు పంపిస్తాయి. మన శరీరంలో గుండె ఎలాగైతే నిరంతరం పనిచేస్తుందో ఊపిరితిత్తులు కూడా అలాగే పనిచేస్తాయి. అయితే మన ఊపిరితిత్తుల చుట్టూ రెండు పలుచని పొరలు ఉంటాయి, వీటిని ప్లూరా (Pleura) అంటారు. ఒక పొర ఊపిరితిత్తులకు అతుక్కుని ఉంటుంది, మరొకటి ఛాతీ గోడకు అతుక్కుని ఉంటుంది.ఈ రెండు పొరల మధ్య ఉండే సన్నని ఖాళీని ప్లూరల్ స్పేస్ అంటారు. ఏదైనా కారణం వలన ఈ రెండు పొరల మధ్యలో నీరు చేరడాన్ని ఫ్లూరల్ ఎఫ్యూషన్ అంటారు. ఈ సమస్య గురించి ఇక్కడ పూర్తి వివరంగా తెలుసుకుందాం.
ఫ్లూరల్ ఎఫ్యూషన్ కారణాలు
ఫ్లూరల్ ఎఫ్యూషన్ అంటే ఊపిరితిత్తుల బయటి పొరల మధ్యలో నీరు చేరడం, ఈ పరిస్థితి ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
- గుండె వైఫల్యం: చాలామంది గుండెవైఫల్యం అంటే గుండె పనిచేయడం ఆగిపోవడం అనుకుంటారు, కానీ గుండె వైఫల్యం అంటే గుండె పనితీరు తగ్గడం. గుండె పనితీరు తగ్గడం వలన రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. దీనివలన ఊపిరితిత్తుల పొరల మధ్యలో ద్రవం పేరుకుపోతుంది.
- లివర్ సమస్యలు: మన శరీరంలో కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. వివిధ కారణాల వలన లివర్ సమస్యలు లేదా లివర్ సిర్రోసిస్ వలన మన శరీరంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ తగ్గిపోతుంది. దీనివలన రక్తనాళాల్లోని ద్రవం కడుపులోకి లేదా ఊపిరితిత్తుల బయటి పొరల మధ్యలోకి చేరుకుంటుంది. లివర్ సిర్రోసిస్ ఉన్న పేషేంట్లలో సాధారణంగా పొత్తికడుపు భాగంలో నుండి ఎసైటిక్ ద్రవం ఛాతీ భాగంలోకి చేరడం వలన ఫ్లూరల్ ఎఫ్యూషన్ సమస్య కలుగుతుంది.
- కిడ్నీ సమస్యలు: మన రక్తాన్ని కిడ్నీలు నిరంతరం శుద్ధి చేసి వ్యర్ధపదార్ధాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అయితే ఏదైనా కిడ్నీ సమస్యలు ఏర్పడినప్పుడు ఈ వ్యర్ధాలు బయటకు వెళ్లకుండా శరీరంలో ఉండిపోతాయి. ఇలా శరీరంలోపల ఉండిపోయిన ద్రవం ఊపిరిరితిత్తుల పొరల మధ్యలోకి చేరినప్పుడు ఫ్లూరల్ ఎఫ్యూషన్ సమస్య కలుగుతుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయక ప్రోటీన్లను మూత్రం ద్వారా బయటకు పంపేసినప్పుడు కూడా శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. ఈ కారణం వలన కూడా ఫ్లూరల్ ఎఫ్యూషన్ సమస్య కలుగుతుంది.
- నిమోనియా: ఊపిరితిత్తులకు బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆ వాపు వల్ల ద్రవం చేరుతుంది. దీనిని ‘పారా-నిమోనిక్ ఎఫ్యూషన్’ అంటారు.
- క్షయ వ్యాధి (Tuberculosis – TB): మన దేశంలో ప్లూరల్ ఎఫ్యూషన్‌కు టీబీ ఒక ప్రధాన కారణం. క్షయ కారక బ్యాక్టీరియా ఊపిరితిత్తుల పొరలను దెబ్బతీస్తుంది. దీనివలన ఫ్లూరల్ ఎఫ్యూషన్ సమస్య కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంది.
- క్యాన్సర్ (Malignancy): ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లేదా లింఫోమా వంటివి ప్లూరల్ పొరలకు వ్యాపించినప్పుడు ద్రవం చేరుతుంది. దీనిని ‘మెలిగ్నెంట్ ప్లూరల్ ఎఫ్యూషన్’ అంటారు.
- పల్మనరీ ఎంబోలిజం (Pulmonary Embolism): ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల కూడా ద్రవం చేరవచ్చు.
- ఆటో ఇమ్యూన్ వ్యాధులు: లూపస్ (SLE) లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధుల వల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలాన్ని దెబ్బతీసి వాపును కలిగిస్తుంది. దీనివలన కూడా ఫ్లూరల్ ఎఫ్యూషన్ సమస్య కలగవచ్చు.
ఫ్లూరల్ ఎఫ్యూషన్ లక్షణాలు
ప్లూరల్ ఎఫ్యూషన్ (Pleural Effusion) అనేది ఊపిరితిత్తుల వెలుపల ఉండే పొరల మధ్య ద్రవం చేరే పరిస్థితి. దీనివల్ల ఊపిరితిత్తులు పూర్తిగా వ్యాకోచించలేవు (Expand అవ్వలేవు), దీనివల్ల రోగికి వివిధ రకాల ఇబ్బందులు కలుగుతాయి.
ద్రవం ఎంత పరిమాణంలో ఉంది మరియు అది ఏ కారణం వల్ల చేరింది అనే దానిపై లక్షణాలు ఆధారపడి ఉంటాయి. ప్లూరల్ ఎఫ్యూషన్ ప్రధాన లక్షణాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది : ఇది ప్లూరల్ ఎఫ్యూషన్ యొక్క అత్యంత సాధారణ లక్షణం. ఊపిరితిత్తుల చుట్టూ ద్రవం చేరడం వల్ల, ఊపిరితిత్తులు గాలి పీల్చుకున్నప్పుడు పూర్తిగా వ్యాకోచించలేవు .ఉదాహరణకు మెట్లు ఎక్కినప్పుడు లేదా కొంచెం వేగంగా నడిచినప్పుడు ఆయాసం రావడం, శ్వాస సరిగ్గా అందడం లేదని అనిపించడం. ద్రవం ఎక్కువగా ఉంటే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఆయాసం రావచ్చు.
- ఛాతీ నొప్పి :దీనిని వైద్య పరిభాషలో ‘ప్లూరిటిక్ పెయిన్’ అంటారు. ఇది సాధారణంగా పదునైన నొప్పిలా గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది. దీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఈ నొప్పి తీవ్రమవుతుంది. ద్రవం పెరిగే కొద్దీ ఈ నొప్పి తగ్గినట్లు అనిపించవచ్చు, కానీ ఆయాసం పెరుగుతుంది.
- పొడి దగ్గు : ప్లూరల్ ఎఫ్యూషన్ ఉన్నవారిలో సాధారణంగా పొడి దగ్గు వస్తుంది. ఊపిరితిత్తుల పొరల్లో ఏర్పడే ఒత్తిడి మరియు వాపు వల్ల ఊపిరితిత్తులు చిరాకుకు గురై దగ్గు వస్తుంది. దీనిలో కళ్లె (కఫము) రాదు.
- వెల్లకిలా పడుకోలేకపోవడం : ద్రవం ఎక్కువగా ఉన్నప్పుడు, వెల్లకిలా పడుకుంటే శ్వాస తీసుకోవడం మరింత కష్టమవుతుంది. కూర్చున్నప్పుడు లేదా కొన్ని దిండ్లు పెట్టుకుని కొంచెం ఎత్తుగా పడుకున్నప్పుడు ఉపశమనం లభిస్తుంది.
- జ్వరం మరియు చలి : ఒకవేళ ప్లూరల్ ఎఫ్యూషన్ అనేది నిమోనియా లేదా క్షయ (TB) వంటి ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చి ఉంటే, రోగికి జ్వరం మరియు వణుకుతో కూడిన చలి రావచ్చు.
- ఎక్కిళ్లు : అరుదుగా, ద్రవం వల్ల ఛాతీ మరియు పొట్టను వేరుచేసే ‘డయాఫ్రామ్’ (Diaphragm) కండరం చిరాకుకు గురైతే, తరచుగా ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
ముఖ్య గమనిక: పైన చెప్పిన లక్షణాలు లేదా సమస్యలు ఉన్నవారు వెంటనే న్యూరాలజిస్ట్ లేదా వాస్కులర్ సర్జన్ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.
పొడిదగ్గు తీవ్రంగా మరియు నిరంతరంగా వస్తుందా?
ఫ్లూరల్ ఎఫ్యూషన్ నిర్ధారణ పరీక్షలు
ప్లూరల్ ఎఫ్యూషన్ నిర్ధారించడానికి డాక్టర్లు కేవలం ద్రవం ఉందో లేదో చూడటమే కాకుండా, ఆ ద్రవం ఎందుకు చేరింది (కారణం) అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. దీని కోసం చేసే ప్రధాన పరీక్షలు ఇక్కడ వివరంగా ఉన్నాయి:
1. శారీరక పరీక్ష (Physical Examination) వైద్యులు మొదట క్లినికల్ పరీక్ష ద్వారా కొన్ని సంకేతాలను గుర్తిస్తారు:
- స్టెతస్కోప్‌తో వినడం : ద్రవం ఉన్న చోట శ్వాస శబ్దాలు (Breath sounds) చాలా తక్కువగా వినిపిస్తాయి.
- తట్టి చూడటం : ఛాతీపై వేళ్లతో తట్టినప్పుడు, గాలితో నిండిన ఊపిరితిత్తుల నుండి వచ్చే శబ్దానికి బదులుగా ‘డల్’ (Dull) శబ్దం వస్తుంది.
2. ఇమేజింగ్ పరీక్షలు (Imaging Tests) ద్రవం ఎంత పరిమాణంలో ఉందో గుర్తించడానికి ఇవి కీలకం.
- ఛాతీ ఎక్స్-రే (Chest X-ray): ఇది మొదటి దశలో చేసే పరీక్ష. ఇందులో ఊపిరితిత్తుల కింద భాగంలో తెలుపు రంగులో ద్రవం పేరుకుపోయినట్లు కనిపిస్తుంది.
- అల్ట్రాసౌండ్ (Chest Ultrasound): తక్కువ మోతాదులో ద్రవం ఉన్నా దీని ద్వారా గుర్తించవచ్చు. ఇది ద్రవం గడ్డకట్టిందా లేదా పలుచగా ఉందా అని తెలుసుకోవడానికి, మరియు సూది ద్వారా ద్రవాన్ని తీసేటప్పుడు మార్గనిర్దేశం చేయడానికి ఉపయోగపడుతుంది.
- సీటీ స్కాన్ (CT Scan): ఇది మరింత స్పష్టమైన చిత్రాలను ఇస్తుంది. ద్రవం చేరడానికి కారణమైన ఇతర సమస్యలను (ఉదాహరణకు: గడ్డలు, ఇన్ఫెక్షన్లు లేదా గుండె సమస్యలు) గుర్తించడానికి ఇది ఉత్తమమైనది.
3. థొరాసెంటెసిస్ (Thoracentesis) ఇది నిర్ధారణలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ.
- విధానం: లోకల్ అనస్థీషియా ఇచ్చి, ఒక సన్నని సూదిని పక్కటెముకల మధ్య గుండా పంపి, ఊపిరితిత్తుల పొరల మధ్య ఉన్న ద్రవాన్ని కొద్దిగా బయటకు తీస్తారు.
- లాబ్ పరీక్షలు (Fluid Analysis): తీసిన ద్రవాన్ని లాబొరేటరీకి పంపి ఈ క్రింది విషయాలను పరిశీలిస్తారు:
- ప్రోటీన్ మరియు LDH: ఇది ద్రవం రకాన్ని (Transudate లేదా Exudate) నిర్ణయిస్తుంది.
- కణాల సంఖ్య (Cell Count): ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ ఉందో లేదో తెలుస్తుంది.
- సైటాలజీ (Cytology): క్యాన్సర్ కణాలు ఉన్నాయా అని తనిఖీ చేస్తారు.
- కల్చర్ మరియు గ్రామ్ స్టెయిన్: బ్యాక్టీరియా లేదా టీబీ (TB) ఇన్ఫెక్షన్ ఉందో లేదో గుర్తిస్తారు.
4. అధునాతన పరీక్షలు (Advanced Tests)
పైన చెప్పిన పరీక్షల్లో కారణం తెలియనప్పుడు ఇవి చేస్తారు:
- ప్లూరల్ బయాప్సీ (Pleural Biopsy): ఒక సూది ద్వారా ఊపిరితిత్తుల పొర (Pleura) యొక్క చిన్న ముక్కను తీసి పరీక్షకు పంపిస్తారు. ఇది టీబీ లేదా క్యాన్సర్‌ను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.
- థొరాకోస్కోపీ (Thoracoscopy): ఒక చిన్న కెమెరాను ఛాతీ లోపలికి పంపి లోపల ఏవైనా గడ్డలు ఉన్నాయా అని నేరుగా చూస్తారు. అవసరమైతే అక్కడికక్కడే బయాప్సీ కూడా తీస్తారు.
చాలా మందిలో X-ray మరియు థొరాసెంటెసిస్ ద్వారానే సమస్య ఏంటో తెలిసిపోతుంది. ఒకసారి కారణం తెలిస్తే, దానికి తగినట్లుగా చికిత్సను ప్రారంభించవచ్చు.
ఫ్లూరల్ ఎఫ్యూషన్ చికిత్స
ప్లూరల్ ఎఫ్యూషన్ సమస్యకు చికిత్స అనేది ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది: ఒకటి, ఊపిరితిత్తుల పొరల మధ్య పేరుకుపోయిన ద్రవాన్ని తొలగించడం, మరియు రెండు, ఆ ద్రవం చేరడానికి గల అసలు కారణాన్ని నయం చేయడం. ప్లూరల్ ఎఫ్యూషన్ చికిత్స పద్ధతులను కింద వివరంగా చూడవచ్చు:
1. అసలు కారణానికి చికిత్స
ద్రవం ఎందుకు చేరిందో తెలుసుకుని దానికి చికిత్స చేస్తే, చాలా సందర్భాల్లో ద్రవం తనంతట తానుగా తగ్గిపోతుంది.
- గుండె వైఫల్యం: ఒకవేళ గుండె సమస్య వల్ల నీరు చేరితే, వైద్యులు ‘డయూరెటిక్స్’ (Diuretics) అనే మందులు ఇస్తారు. ఇవి మూత్రం ద్వారా శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపిస్తాయి.
- ఇన్ఫెక్షన్లు : నిమోనియా వల్ల నీరు చేరితే యాంటీబయాటిక్స్, క్షయ (TB) వల్ల అయితే టీబీ మందులు వాడాల్సి ఉంటుంది.
- లివర్ లేదా కిడ్నీ సమస్యలు: ఆయా అవయవాల పనితీరును మెరుగుపరిచే చికిత్స చేయడం ద్వారా ద్రవం చేరకుండా చూడవచ్చు. ఈ సందర్భాలలో డాక్టర్లు ఈ చికిత్స మీద దృష్టి పెడతారు.
2. ద్రవాన్ని తొలగించే పద్ధతులు
ఆయాసం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ద్రవం ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే ద్రవాన్ని తీసివేయాల్సి ఉంటుంది.
- థొరాసెంటెసిస్ (Thoracentesis): ఒక సన్నని సూదిని పక్కటెముకల మధ్య నుండి పంపి ద్రవాన్ని బయటకు తీస్తారు. ఇది ఆయాసం నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.
- ఛాతీ ట్యూబ్ (Chest Tube / Intercostal Drain): ద్రవం ఎక్కువగా ఉన్నా, లేదా అది చీము (Empyema) లాగా మారినా, ఒక చిన్న గొట్టాన్ని (Tube) ఛాతీలోకి పంపి కొన్ని రోజుల పాటు ఉంచుతారు. ఇది నిరంతరం ద్రవాన్ని బయటకు పంపిస్తుంది.
- ఇన్-డ్వెల్లింగ్ ప్లూరల్ కాథెటర్ (IPC): క్యాన్సర్ వంటి సమస్యల వల్ల నీరు మాటిమాటికీ చేరుతుంటే, ఒక శాశ్వతమైన చిన్న గొట్టాన్ని అమర్చుతారు. దీని ద్వారా పేషేంట్ ఇంట్లోనే ద్రవాన్ని బయటకు పంపించుకోవచ్చు.
3. ద్రవాన్ని మళ్లీ రాకుండా చేసే చికిత్స
కొంతమందిలో ద్రవాన్ని తీసినా మళ్లీ మళ్లీ చేరుతుంది. అప్పుడు ఈ పద్ధతిని వాడతారు:
- ప్లూరోడెసిస్ (Pleurodesis): ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న రెండు పొరల మధ్య ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని (ఉదాహరణకు టాల్కమ్ పౌడర్ లేదా మందులు) పంపిస్తారు. ఇది ఆ రెండు పొరలను ఒకదానికొకటి అతుక్కుపోయేలా చేస్తుంది. దీనివల్ల మధ్యలో ఖాళీ (Space) ఉండదు కాబట్టి ద్రవం చేరడానికి అవకాశం ఉండదు.
4. శస్త్రచికిత్స
మందులు లేదా ట్యూబ్ ద్వారా ద్రవం తగ్గని సందర్భంలో సర్జరీ అవసరం కావచ్చు:
- వ్యాట్స్ (VATS – Video-Assisted Thoracoscopic Surgery): చిన్న రంధ్రాల ద్వారా కెమెరాను పంపి, లోపల పేరుకుపోయిన గడ్డలను లేదా పీచు పదార్థాన్ని తొలగిస్తారు.
- డికార్టికేషన్ (Decortication): ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల చుట్టూ ఒక గట్టి పొరలాగా ఏర్పడితే, సర్జరీ ద్వారా ఆ పొరను తొలగిస్తారు. తద్వారా ఊపిరితిత్తులు మళ్లీ బాగా వ్యాకోచిస్తాయి.
ప్లూరల్ ఎఫ్యూషన్ నివారణ
ప్లూరల్ ఎఫ్యూషన్ అనేది స్వయంగా ఒక వ్యాధి కాదు, ఇది శరీరంలోని ఇతర అనారోగ్య సమస్యల వల్ల కలిగే ఒక లక్షణం. కాబట్టి, దీనిని నివారించాలంటే దీనికి కారణమయ్యే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్లూరల్ ఎఫ్యూషన్ నివారణకు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి:
1. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల నివారణ
నిమోనియా మరియు క్షయ (TB) వంటి వ్యాధులు ప్లూరల్ ఎఫ్యూషన్‌కు ప్రధాన కారణాలు.
- టీకాలు తీసుకోవడం : ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు నిమోకోకల్ (Pneumococcal) మరియు ఇన్ఫ్లుఎంజా (Flu) టీకాలు తీసుకోవాలి. ఇవి నిమోనియా ముప్పును తగ్గిస్తాయి.
- క్షయ (TB) నుండి రక్షణ: టీబీ ఉన్న రోగులకు దూరంగా ఉండటం మరియు ఒకవేళ టీబీ సోకితే కోర్సు పూర్తయ్యే వరకు మందులు వాడటం చాలా ముఖ్యం. టీబీ సరిగ్గా తగ్గకపోతే అది నీరు చేరడానికి దారితీస్తుంది.
2. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం
కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్’ అనేది ఊపిరితిత్తుల్లో నీరు చేరడానికి అత్యంత సాధారణ కారణం.
- రక్తపోటు నియంత్రణ: అధిక రక్తపోటు గుండెను బలహీనపరుస్తుంది. కాబట్టి బీపీని ఎప్పుడూ సాధారణ స్థితిలో ఉంచుకోవాలి.
- ఉప్పు తగ్గించడం: ఆహారంలో ఉప్పు (Sodium) తగ్గించడం వల్ల శరీరంలో నీరు చేరకుండా ఉంటుంది, ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
3. ధూమపానం పూర్తిగా మానేయాలి
సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతింటుంది. ఇది నిమోనియా, క్రోనిక్ బ్రోన్కైటిస్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఇవన్నీ ప్లూరల్ ఎఫ్యూషన్‌ను కలిగించేవే. ధూమపానం మానేయడం వల్ల ఊపిరితిత్తుల పొరల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
4. కాలేయం మరియు కిడ్నీల సంరక్షణ
లివర్ సిరోసిస్ మరియు కిడ్నీ వైఫల్యం వల్ల రక్తంలో ప్రోటీన్లు తగ్గి, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరుతుంది.
- మద్యపానానికి దూరం: అధికంగా మద్యం సేవించడం వల్ల కాలేయం (Liver) దెబ్బతింటుంది. దీనిని నివారించడం చాలా ముఖ్యం.
- ఆరోగ్యకరమైన ఆహారం: కిడ్నీలు మరియు కాలేయం సరిగ్గా పనిచేయడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి.
5. వృత్తిపరమైన జాగ్రత్తలు
మైనింగ్, కన్స్ట్రక్షన్ లేదా ఫ్యాక్టరీలలో పని చేసేవారు ఆస్బెస్టాస్ (Asbestos) వంటి రసాయన ధూళికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల పొరలకు సంబంధించిన క్యాన్సర్ (Mesothelioma) మరియు నీరు చేరడానికి కారణమవుతుంది. పని ప్రదేశాల్లో తగిన మాస్కులు మరియు రక్షణ కవచాలు ధరించాలి.
క్రమం తప్పకుండా పరీక్షలు
మీకు ఇప్పటికే గుండె లేదా కిడ్నీ సమస్యలు ఉన్నట్లయితే, క్రమం తప్పకుండా డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
- ప్రారంభ సంకేతాలను గమనించండి: శ్వాస తీసుకోవడంలో కొద్దిపాటి ఇబ్బంది కలిగినా లేదా పొడి దగ్గు వేధిస్తున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఊపిరితిత్తుల్లో నీరు ఎక్కువగా పేరుకుపోకుండా అడ్డుకోవచ్చు.
ఊపిరితిత్తులలో నీరు చేరినప్పుడు వెంటనే చికిత్స అందకపోతే ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అనుభవజ్ఞులైన పల్మొనాలజిస్ట్ ను సంప్రదించాలి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.



















Appointment
WhatsApp
Call
More