బెల్స్ పాల్సీ అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, చికిత్స

u003cpu003eమన రక్తంలో ప్రధానంగా నాలుగు ముఖ్య భాగాలు ఉంటాయి. ఇవి ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్. రక్తంలో ఎర్ర రక్తకణాలు 44 శాతం ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను (హేమోగ్లోబిన్ ద్వారా) సరఫరా చేస్తాయి. ఎర్ర రక్త కణాల ఆకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, వీటిని శాస్త్రీయంగా ద్విపుటాకారము (Biconcave Disk) అని అంటారు.దీనిని సరళంగా చెప్పాలంటే, ఇది గుండ్రంగా, డోనట్ ఆకారంలో ఉంటుంది, కానీ మధ్యలో రంధ్రం ఉండదు.పక్క నుండి చూసినప్పుడు, కణం యొక్క అంచులు మందంగా ఉండి, మధ్య భాగం లోపలికి నొక్కినట్లుగా ఉంటుంది.u003c/pu003enu003cpu003eస్పిరోసైటోసిస్ (Spherocytosis) అనేది ఒక రకమైన u003ca href=u0022https://www.yashodahospitals.com/te/blog/the-hemoglobin-levels-are-very-low-in-iron-deficiency-anemia/u0022u003eరక్తహీనతu003c/au003e . ఈ స్థితిలో, సాధారణంగా ద్విపుటాకారంలో ఉండాల్సిన ఎర్ర రక్త కణాలు వాటి ఆకారాన్ని కోల్పోయి, గుండ్రటి బంతిలాంటి ఆకారంలోకి మారిపోతాయి. అందుకే దీనికి స్పిరోసైటోసిస్ (స్పియర్ అంటే గోళం/బంతి) అనే పేరు వచ్చింది.u003c/pu003e
బెల్స్ పాల్సీ అంటే?
మన ముఖ కదలికలను (నవ్వడం, కళ్లు మూయడం, ఆహారం నమలడం) నియంత్రించడానికి మెదడు నుండి 7వ క్రేనియల్ నరం (Facial Nerve) వస్తుంది. ఏదైనా కారణం చేత ఈ నరం ఒత్తిడికి లోనైనా లేదా వాపు వచ్చినా, ఆ నరం పంపే సంకేతాలు ముఖ కండరాలకు అందవు. ఫలితంగా ముఖం ఒకవైపుకు వాలిపోవచ్చు, ఈ పరిస్థితిని బెల్స్ పాల్సీ అంటారు. సులభంగా చెప్పాలంటే ముఖంలోని కండరాలను నియంత్రించే నరం వాపుకు గురవ్వడం వల్ల కలిగే తాత్కాలిక పక్షవాత స్థితిని బెల్స్ పాల్సీ లేదా బెల్స్ పక్షవాతం అంటారు. ఇది అకస్మాత్తుగా సంభవిస్తుంది మరియు సాధారణంగా ముఖం యొక్క ఒక వైపును మాత్రమే ప్రభావితం చేస్తుంది.
బెల్స్ పాల్సీ సమస్యకు కారణాలు ఏంటి?
బెల్స్ పక్షవాతం సమస్యకు ప్రధాన కారణం మన శరీరంలో ఉండే ఫెషియల్ నెర్వ్ వాపుకు గురవ్వడం. అయితే ఈ పరిస్థితి రావడానికి గల కారణాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1. వైరల్ ఇన్ఫెక్షన్లు : మన ఆహార పరిస్థితులు, జీవనశైలి కారణంగా నిరంతరం కొన్ని రకాలైన వైరస్లు మనపై దాడి చేయవచ్చు. అయితే మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) వీటిని అడ్డుకుని నాశనం చేస్తుంది. అయినా కూడా కొన్ని రకాలైన వైరస్ ల వలన మనకు వివిధ రకాలైన వ్యాధులు వస్తాయి. అయితే ఈ వ్యాధులకు చికిత్స తీసుకున్న తర్వాత వైరస్ శరీరంలో ఉండదు. కానీ కొన్నిసార్లు వ్యాధి తగ్గినా కూడా ఈ వైరస్ మన శరీరంలోనే ఉండవచ్చు. ఈ సమయంలో వైరస్ వలన ఎలాంటి వ్యాధి కలగదు. కానీ మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు శరీరంలో ఉన్న వైరస్లు తిరిగి వ్యాధులను కలుగజేస్తాయి. ఇలాంటి వైరస్లను లేటెంట్ వైరస్ అంటారు. బెల్స్ పాల్సీ సమస్యకు క్రింద వివరించిన లేటెంట్ వైరస్లు కారణం అవుతున్నాయి.
- హెర్పెస్ సింప్లెక్స్ (Herpes Simplex): జలుబు, పుండ్లు మరియు జననేంద్రియ ఇన్ఫెక్షన్లను కలిగించే ఈ వైరస్ బెల్స్ పాల్సీకి కారణం అవుతుంది.
- వారిసెల్లా-జోస్టర్ (Varicella-zoster): చికెన్ పాక్స్ మరియు షింగిల్స్ కలిగించే వైరస్ కూడా ఫెషియల్ నెర్వ్ వాపుకు కారణం అవుతుంది.
- ఎప్స్టీన్-బార్ (Epstein-Barr): మోనోన్యూక్లియోసిస్ కలిగించే వైరస్.
- ఇతర వైరస్‌లు: సైటోమెగాలోవైరస్, అడెనోవైరస్ (శ్వాసకోస సమస్యలు), మంప్స్ (గవదబిళ్ళలు), ఇన్‌ఫ్లుఎంజా B (ఫ్లూ), మరియు కాక్సాకీ వైరస్ (చేతి, కాలి మరియు నోటి వ్యాధి).
2. నరాల మీద ఒత్తిడి :
ముఖ కండరాలను నియంత్రించే 7వ క్రేనియల్ నరం (ఫేషియల్ నెర్వ్), మెదడు నుండి ముఖానికి వచ్చే క్రమంలో తలలోని ఒక ఇరుకైన ఎముక కాలువ (Fallopian Canal) ద్వారా ప్రయాణిస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఈ నరం వాచినప్పుడు, ఆ ఇరుకైన ఎముక కాలువలో నరం గట్టిగా నొక్కుకుంటుంది. ఈ ఒత్తిడి వల్ల నరానికి అందాల్సిన రక్త ప్రసరణ మరియు ఆక్సిజన్ తగ్గిపోయి, కండరాలకు సంకేతాలను పంపే సామర్థ్యాన్ని అది కోల్పోతుంది. ఇలా జరగడం వలన బెల్స్ పాల్సీ వచ్చే ప్రమాదం ఉంది.
3. రోగనిరోధక శక్తి ప్రతిస్పందన (Autoimmune Response)
కొన్నిసార్లు మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున దాడి చేయడం వల్ల కూడా ఈ వాపు రావచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్, ముఖ్యంగా హెర్పెస్ వైరస్‌లు (HSV, VZV), ఒక ఆటో ఇమ్యూన్ ప్రతిచర్యను ప్రేరేపించి, ముఖ నరానికి వాపు మరియు నష్టం (డీమైలినేషన్) కలిగించి, ఆకస్మిక పక్షవాతానికి దారితీయవచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి లేదా శారీరక అలసట ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి తగ్గి, వైరస్‌లు విజృంభించే అవకాశం ఉంటుంది.
4. పర్యావరణ మార్పులు (అపోహలు vs వాస్తవాలు)
చాలా మంది చల్లగాలికి ఎక్స్ పోజ్ అవ్వడం వల్ల బెల్స్ పక్షవాతం వస్తుందని అనుకుంటారు. అయితే, కేవలం చల్లగాలి వల్ల ఇది రాదు. కానీ, చల్లని వాతావరణం వల్ల శరీరంలో ఉన్న వైరస్ యాక్టివేట్ అవ్వడానికి లేదా నరాల వాపు పెరగడానికి అది ఒక ఉత్ప్రేరకం (Trigger) గా పనిచేయవచ్చు.
బెల్స్ పాల్సీ లక్షణాలు ఎలా ఉంటాయి?
బెల్స్ పాల్సీ సమస్య ఉన్నవారిలో ఫెషియల్ నెర్వ్ వాపుకు గురవ్వడం వలన వారి ముఖం ఒకవైపుకి వాలిపోవడం, కంటి రెప్ప వేయలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. బెల్స్ పాల్సీ సమస్య ఉన్నవారిలో కనిపించే లక్షణాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1. ముఖం ఒకవైపుకు తిరగడం
ఇది బెల్స్ పాల్సీ యొక్క ప్రాథమిక మరియు అత్యంత స్పష్టమైన లక్షణం.
- ముఖం యొక్క ఒక వైపు కండరాలు పూర్తిగా బలహీనపడతాయి లేదా పక్షవాతానికి గురవుతాయి.
- నవ్వినప్పుడు ముఖం ఒకవైపుకే వెళ్తుంది, ప్రభావితమైన వైపు కండరాలు కదలవు.
- ముఖం ఒకవైపు కిందికి జారినట్లు కనిపిస్తుంది.
2. కంటిని మూయలేకపోవడం
బెల్స్ పాల్సీ ప్రభావితమైన వైపు ఉన్న కనురెప్పలు సరిగ్గా పనిచేయవు.
- కంటిని పూర్తిగా మూయడం లేదా రెప్పవేయడం సాధ్యం కాదు.
- కన్ను ఎప్పుడూ తెరిచే ఉండటం వల్ల కంటిలోని తేమ ఆవిరైపోయి కళ్ళు ఎర్రబడటం లేదా మంట కలగవచ్చు.
- కంటి నుండి విపరీతంగా నీరు కారవచ్చు.
3. ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది
నోటి కండరాలు బలహీనపడటం వల్ల నిత్యకృత్యాలు కష్టమవుతాయి:
- ఉమ్మి/నీరు కారడం : నోటి కండరాలపై నియంత్రణ లేకపోవడం వల్ల లాలాజలం లేదా తాగే నీరు నోటి నుండి కారిపోతుంది.
- ఆహారం ఇరుక్కుపోవడం: బుగ్గ కండరాలు పనిచేయకపోవడం వల్ల తిన్న ఆహారం పళ్లు మరియు బుగ్గ మధ్య ఇరుక్కుపోతుంది. నమలడం కష్టమవుతుంది.
4. నొప్పి మరియు అసౌకర్యం
పక్షవాతం రాకముందే లేదా వచ్చిన సమయంలో ఈ క్రింది నొప్పులు ఉండవచ్చు:
- చెవి వెనుక నొప్పి: ప్రభావితమైన వైపు చెవి వెనుక లేదా దవడ భాగంలో నొప్పి రావడం.
- తలనొప్పి: ముఖ నరంపై ఒత్తిడి వల్ల తలనొప్పి రావచ్చు.
5. ఇంద్రియ మార్పులు
- రుచి తెలియకపోవడం: నాలుక ముందు భాగంలో (సుమారు మూడింట రెండు వంతుల భాగం) రుచి సామర్థ్యం తగ్గిపోతుంది.
- శబ్దాలకు సున్నితత్వం : ప్రభావితమైన వైపు చెవికి శబ్దాలు చాలా గట్టిగా, చికాకుగా వినిపిస్తాయి. ఎందుకంటే చెవిలోని చిన్న కండరాన్ని నియంత్రించే శక్తిని నరం కోల్పోతుంది.
ముఖ్యమైన తేడా: బెల్స్ పాల్సీ vs బ్రెయిన్ స్ట్రోక్
ముఖం ఒకవైపుకు తిరిగినప్పుడు అది సాధారణ నరాల వాపా లేక ప్రాణాపాయకరమైన స్ట్రోకా అనేది గుర్తించడం చాలా అవసరం.
బెల్స్ పాల్సీ లక్షణాలు కనిపించిన మొదటి 72 గంటల్లోనే చికిత్స ప్రారంభిస్తే కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.
బెల్స్ పాల్సీ చికిత్స ఎలా చేస్తారు?
బెల్స్ పాల్సీ (Bell’s Palsy) చికిత్స ప్రధాన ఉద్దేశ్యం ముఖ నరం (Facial Nerve) యొక్క వాపును తగ్గించడం, కంటిని దెబ్బతినకుండా కాపాడటం మరియు ముఖ కండరాల పనితీరును తిరిగి పునరుద్ధరించడం.
బెల్స్ పాల్సీ చికిత్స ప్రక్రియను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం:
1. మందుల ద్వారా చికిత్స (Medications)
లక్షణాలు మొదలైన మొదటి 72 గంటలలోపు చికిత్స ప్రారంభిస్తే ఫలితం చాలా వేగంగా ఉంటుంది.
- కార్టికోస్టెరాయిడ్స్ (Corticosteroids): ప్రెడ్నిసోన్ వంటి స్టిరాయిడ్స్ వాపును తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మందులు. ఇవి ముఖ నరంపై ఉన్న ఒత్తిడిని తగ్గించి, నరం త్వరగా కోలుకునేలా చేస్తాయి.
- యాంటీ వైరల్ మందులు (Antivirals): ఒకవేళ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నా లేదా వైరస్ వల్ల వచ్చిందని అనుమానం ఉన్నా (ఉదాహరణకు వలైసైక్లోవిర్), స్టిరాయిడ్స్‌తో పాటు వీటిని కూడా ఇస్తారు.
2. కంటి సంరక్షణ (Eye Care – అత్యంత ముఖ్యం)
బెల్స్ పాల్సీ వచ్చినప్పుడు కంటిని పూర్తిగా మూయలేరు. దీనివల్ల కన్ను పొడిబారి, శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే కింది జాగ్రత్తలు తీసుకోవాలి:
- లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ (Artificial Tears): పగటిపూట కంటిలో తేమను ఉంచడానికి తరచుగా వాడాలి.
- ఐ ఆయింట్‌మెంట్స్: రాత్రి పడుకునే ముందు కంటి లోపల ఆయింట్‌మెంట్ వేయడం వల్ల కన్ను పొడిబారకుండా ఉంటుంది.
- ఐ ప్యాచ్ (Eye Patch) లేదా టేపింగ్: నిద్రపోతున్నప్పుడు కన్ను తెరిచి ఉండకుండా వైద్యుని సలహాతో కంటిని టేపింగ్ చేయడం లేదా ప్యాచ్ వాడటం అవసరం.
- రక్షణ కళ్లద్దాలు: బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము, గాలి తగలకుండా కళ్లద్దాలు ధరించాలి.
3. ఫిజియోథెరపీ మరియు వ్యాయామాలు
ముఖ కండరాలు బిగుసుకుపోకుండా (Atrophy) ఉండటానికి ఇవి చాలా అవసరం:
- ఫేషియల్ మసాజ్: ముఖ కండరాలను మృదువుగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
- వ్యాయామాలు: అద్దం ముందు కూర్చుని ఈ క్రింది పనులు చేయడానికి ప్రయత్నించాలి:
కనుబొమ్మలను ఎత్తడం.
కళ్లను గట్టిగా మూయడం.
నవ్వడం మరియు ముఖాన్ని చిట్లించడం.
గాలిని బుగ్గల్లో నింపి ఊదడం.
4. నొప్పి నివారణ (Pain Management)
చెవి వెనుక లేదా దవడ భాగంలో నొప్పి ఉంటే ఈ క్రింది చికిత్సలు సూచించవచ్చు:
- వార్మ్ కంప్రెస్: ఒక క్లాత్ వేడి నీటిలో ముంచి నొప్పి ఉన్న చోట రోజుకు రెండు, మూడు సార్లు అద్దడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
- నొప్పి నివారణ మాత్రలు: అవసరాన్ని బట్టి పారాసెటమాల్ లేదా ఐబూప్రోఫెన్ వంటివి వాడవచ్చు.
బెల్స్ పాల్సీ చికిత్సలో న్యూరాలజిస్ట్ సలహా తప్పనిసరి. కొన్నిసార్లు ఈ లక్షణాలు ‘బ్రెయిన్ స్ట్రోక్’ వల్ల కూడా రావచ్చు. అందుకే ముఖం వంగిపోవడంతో పాటు చెయ్యి, కాలు బలహీనపడటం లేదా మాట తడబడటం వంటివి ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీకి వెళ్లాలి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.



















Appointment
WhatsApp
Call
More