పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలేంటి? చికిత్స మరియు నివారణ పద్ధతులు

u003cpu003eమన రక్తంలో ప్రధానంగా నాలుగు ముఖ్య భాగాలు ఉంటాయి. ఇవి ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్. రక్తంలో ఎర్ర రక్తకణాలు 44 శాతం ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను (హేమోగ్లోబిన్ ద్వారా) సరఫరా చేస్తాయి. ఎర్ర రక్త కణాల ఆకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, వీటిని శాస్త్రీయంగా ద్విపుటాకారము (Biconcave Disk) అని అంటారు.దీనిని సరళంగా చెప్పాలంటే, ఇది గుండ్రంగా, డోనట్ ఆకారంలో ఉంటుంది, కానీ మధ్యలో రంధ్రం ఉండదు.పక్క నుండి చూసినప్పుడు, కణం యొక్క అంచులు మందంగా ఉండి, మధ్య భాగం లోపలికి నొక్కినట్లుగా ఉంటుంది.u003c/pu003enu003cpu003eస్పిరోసైటోసిస్ (Spherocytosis) అనేది ఒక రకమైన u003ca href=u0022https://www.yashodahospitals.com/te/blog/the-hemoglobin-levels-are-very-low-in-iron-deficiency-anemia/u0022u003eరక్తహీనతu003c/au003e . ఈ స్థితిలో, సాధారణంగా ద్విపుటాకారంలో ఉండాల్సిన ఎర్ర రక్త కణాలు వాటి ఆకారాన్ని కోల్పోయి, గుండ్రటి బంతిలాంటి ఆకారంలోకి మారిపోతాయి. అందుకే దీనికి స్పిరోసైటోసిస్ (స్పియర్ అంటే గోళం/బంతి) అనే పేరు వచ్చింది.u003c/pu003e
1. దంత క్షయం అంటే?
దంత క్షయం (Tooth Decay / Cavities) అంటే పంటి యొక్క కఠినమైన పై పొర (ఎనామెల్) క్రమంగా దెబ్బతినడం. దీనినే సాధారణ భాషలో ‘పళ్లు పుచ్చడం’ లేదా పిప్పన్ను అంటారు. మనం తినే ఆహారంలోని చక్కెరలు మరియు మన నోటిలో ఉండే బ్యాక్టీరియా కలిసి పంటిపై దాడి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది.
సాధారణంగా మనకి పంటి సమస్యలు ఏమీ లేవని అనుకుంటాం, ఎదో ఒకరోజు మనం మాములుగా చల్లటి నీళ్లు తాగినప్పుడు లేదా కూల్ డ్రింక్ తాగుతున్నప్పుడు ఉన్నట్టుండి పళ్ళు జివ్వ్ అని లాగుతాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి అనుభూతి కలగలేదు కాబట్టి ఈ విషయాన్నీ మనం అక్కడితో వదిలేస్తాం. కొన్ని రోజుల తర్వాత ఈ సమస్య తీవ్రంగా మారవచ్చు. మొదటిసారి పళ్లలో సమస్యలు ఏర్పడినప్పుడు చికిత్స చేయించుకుంటే అది తీవ్రతరం కాకుండా ఆపవచ్చు.
దంత క్షయం లేదా పళ్ళు పుచ్చిపోవడం ఎలా జరుగుతుంది?
దంత క్షయం అనేది ఒక్కసారిగా జరిగే ప్రక్రియ కాదు, దశలవారీగా జరుగుతుంది:
- ప్లేక్ ఏర్పడటం (Plaque Formation): మనం తిన్న ఆహారంలోని చక్కెరలు, పిండి పదార్థాలు పంటిపై పేరుకుపోతాయి. నోటిలోని బ్యాక్టీరియా వీటిని పంటిపైన పొరలాగా మారుస్తుంది. దీనినే ‘ప్లేక్’ అంటారు.
- యాసిడ్ : ఈ బ్యాక్టీరియా ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో ఒక రకమైన ఆమ్లాన్ని (Acid) విడుదల చేస్తుంది.
- ఎనామెల్ దెబ్బతినడం: ఈ ఆమ్లం పంటిపై ఉన్న రక్షణ పొర అయిన ఎనామెల్ (Enamel) లోని ఖనిజాలను కరిగిస్తుంది. దీనివల్ల పంటిపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి.
- రంధ్రం పెద్దది కావడం: చికిత్స చేయకపోతే, ఈ క్యావిటీ ఎనామెల్ దాటి లోపల ఉండే డెంటిన్ మరియు పల్ప్ (నరాలు ఉండే భాగం) వరకు చేరుతుంది. దీనివల్ల విపరీతమైన నొప్పి వస్తుంది.
2. దంత క్షయం కలగడానికి కారణాలు ఏంటి?
దంత క్షయం (Tooth Decay) లేదా పళ్ళు పుచ్చిపోవడం అనేది ఈ రోజుల్లో చాలా సాధారణమైన సమస్య. మనం తీసుకునే ఆహారం, నోటి శుభ్రత మరియు బ్యాక్టీరియా చర్యల వల్ల దంతాల పైన ఉండే గట్టి పొర (ఎనామెల్) దెబ్బతినడాన్నే దంత క్షయం అంటారు.
దంత క్షయం కలగడానికి ప్రధాన కారణాలను కింద వివరంగా చూడవచ్చు:
- బ్యాక్టీరియా మరియు ప్లేక్ (Plaque) ఏర్పడటం : మన నోటిలో వందల రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. మనం ఆహారం తిన్న తర్వాత నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే, ఆ ఆహార కణాలు బ్యాక్టీరియాతో కలిసి దంతాలపై ఒక జిగురు పొరను ఏర్పరుస్తాయి. దీనినే ‘ప్లేక్’ అంటారు. ఈ ప్లేక్‌లోని బ్యాక్టీరియా ఆహారంలోని చక్కెరలను తిని ఆమ్లాలను (Acids) ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆమ్లాలు దంతాల ఎనామెల్‌ను కరిగించేస్తాయి.
- అధికంగా చక్కెర మరియు పిండి పదార్థాలు తీసుకోవడం : దంతాలకు అతి పెద్ద శత్రువు చక్కెర మరియు తీపి పదార్ధాలు. స్వీట్లు & చాక్లెట్లు,పళ్ల మధ్య సులభంగా ఇరుక్కుపోతాయి.సోడా మరియు కూల్ డ్రింక్స్‌లో చక్కెరతో పాటు యాసిడ్స్ కూడా ఉండటం వల్ల పళ్లు త్వరగా దెబ్బతింటాయి.బ్రెడ్, బిస్కెట్లు, చిప్స్ వంటివి తిన్నప్పుడు అవి లాలాజలంతో కలిసి చక్కెరగా మారి పళ్లకు అంటుకుపోతాయి.
- నోటి శుభ్రత లోపించడం : రోజుకు రెండుసార్లు (ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు) బ్రష్ చేయకపోవడం వల్ల పళ్ల మధ్య ఆహార పదార్థాలు కుళ్ళిపోయి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అలాగే ‘ఫ్లోసింగ్’ (పళ్ల మధ్య దారంతో శుభ్రం చేయడం) చేయకపోవడం వల్ల రెండు పళ్ల మధ్య ఉండే ఖాళీలో పుచ్చు మొదలవుతుంది.
- నోరు పొడిబారడం : మన నోటిలో ఊరే లాలాజలం దంతాల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. లాలాజలం ఆహార కణాలను కడిగివేస్తుంది మరియు బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లాలను అదుపులో ఉంచుతుంది. కొన్ని రకాల మందులు వాడటం వల్ల లేదా తక్కువ నీరు తాగడం వల్ల నోరు పొడిబారితే, దంత క్షయం వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
- ఫ్లోరైడ్ తక్కువగా ఉండడం: ఫ్లోరైడ్ అనేది దంతాల ఎనామెల్‌పై అధికంగా ప్రభావం చూపే ఖనిజం. మనం వాడే టూత్ పేస్ట్‌లో తగినంత ఫ్లోరైడ్ లేకపోతే దంతాలు బలహీనపడి త్వరగా పుచ్చిపోతాయి.
- నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం: అయితే మనం తాగే నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువ కావడం వలన కూడా దంతాల ఎనామెల్ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. చాలావరకూ నీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువమందిలో పళ్ళకు గార పట్టడం కనిపిస్తుంది. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నవారిలో మరొక సమస్య ఏంటంటే, తల్లి ఈ నీటిని తాగితే పిల్లలు పుట్టిన తర్వాత వారికి మొదటి నుండే ఎనామెల్ దెబ్బతినే సమస్య ఉంటుంది.
3. దంతక్షయం లక్షణాలు ఎలా ఉంటాయి?
దంతక్షయం (Tooth Decay) అనేది పంటి పైపొర (Enamel) దెబ్బతినడం వల్ల కలిగే సమస్య. దంతక్షయం ప్రారంభంలో ఏ లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ అది ముదిరే కొద్దీ వివిధ రకాల ఇబ్బందులు మొదలవుతాయి.
దంతక్షయం యొక్క ప్రధాన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి:
- రంగు మారడం: పంటి ఉపరితలంపై కొన్ని రంగు మచ్చలు కనిపిస్తాయి. ప్రారంభంలో ఈ మచ్చలు తెల్లగా ఉంటాయి, క్రమంగా ఇవి గోధుమ మరియు నలుపు రంగులోకి మారుతాయి.
- పళ్ళు జివ్వుమనడం : పంటి లోపలి పొరలు బయటపడటం వల్ల సెన్సిటివిటీ పెరుగుతుంది. అతిగా చల్లని (ఐస్‌క్రీమ్, కూల్ డ్రింక్స్) లేదా అతిగా వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు పళ్ళు జివ్వుమంటాయి. తీపి పదార్థాలు (చాక్లెట్లు, స్వీట్లు) తిన్నప్పుడు కూడా పంటిలో చురుక్కుమని నొప్పి అనిపిస్తుంది.
- పంటిపై రంధ్రాలు లేదా గుంతలు: దంతక్షయం పెరిగే కొద్దీ, పంటి పైభాగంలో స్పష్టంగా కనిపించే చిన్న చిన్న రంధ్రాలు లేదా లోతైన గుంతలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఈ రంధ్రాల్లో ఆహారం ఇరుక్కుపోవడం వల్ల నొప్పి ఇంకా పెరుగుతుంది.
- నోటి దుర్వాసన మరియు చెడు రుచి : పంటి రంధ్రాలలో ఆహారం పేరుకుపోయి బ్యాక్టీరియా వల్ల కుళ్ళిపోతుంది. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన (Bad Breath) వస్తుంది. నోటిలో ఎప్పుడూ ఒక రకమైన చేదు లేదా చెడు రుచి (Unpleasant Taste) ఉంటుంది.
- వాపు మరియు చీము: దంతక్షయం పంటి వేరు (Root) వరకు చేరినప్పుడు ఇన్ఫెక్షన్ అవుతుంది. పంటి చిగుళ్ల దగ్గర వాపు ఏర్పడవచ్చు, ఇన్ఫెక్షన్ తీవ్రమైతే పంటి వేరు దగ్గర చీము గడ్డలు (Abscess) ఏర్పడి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.
ఎప్పుడు డాక్టరును సంప్రదించాలి?
మీకు పంటిలో ఎప్పుడైనా చిన్నపాటి నొప్పి లేదా నలుపు మచ్చలు కనిపిస్తే వెంటనే డెంటిస్ట్‌ను సంప్రదించడం మంచిది. దంతక్షయం ప్రారంభ దశలో ఉంటే చిన్న ఫిల్లింగ్ (Filling) తో సరిచేయవచ్చు, లేదంటే రూట్ కెనాల్ (Root Canal) లేదా పన్ను తీసేయాల్సిన పరిస్థితి రావచ్చు.
వేడి లేదా చల్లటి పదార్ధాలు తీసుకుంటే పళ్ళు జివ్వ్ అంటున్నాయా?
4. పళ్ళు పుచ్చిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దంత క్షయం లేదా పళ్ళు పుచ్చిపోకుండా మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన నివారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి:
1. సరైన బ్రషింగ్ విధానం : రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ప్రాథమిక సూత్రం, కానీ అది ఎలా చేస్తున్నామన్నది ముఖ్యం:
- ఫ్లోరైడ్ టూత్ పేస్ట్: ఎనామెల్‌ను బలోపేతం చేయడానికి ఫ్లోరైడ్ ఉన్న పేస్ట్‌ను మాత్రమే వాడండి.
- బొగ్గు/పండ్ల పొడులు వద్దు: ఇవి పంటి పైపొరను అరిగించే అవకాశం ఉంది.
- బ్రష్ మార్చడం: ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి లేదా బ్రష్ పోగులు వంగిపోయినప్పుడు కొత్త బ్రష్ వాడాలి.
- నాలుక శుభ్రత: బ్యాక్టీరియా నిల్వ ఉండకుండా నాలుకను కూడా ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. కెఫీన్ ఉన్న పదార్ధాలను తీసుకున్న ప్రతీసారి నీటితో నోరు పుక్కిలించడం అలవాటు చేసుకోవాలి.
2. ఫ్లోసింగ్ (Flossing) తప్పనిసరి : బ్రష్ కేవలం పంటి పైభాగం మరియు ముందు భాగాన్ని మాత్రమే శుభ్రం చేయగలదు. రెండు పళ్ల మధ్య ఉండే ఖాళీలోకి బ్రష్ వెళ్ళలేదు.
- ఎందుకు?: పళ్ల సందుల్లో ఇరుక్కున్న ఆహారం కుళ్ళిపోయి అక్కడే పుచ్చు మొదలవుతుంది.
- విధానం: రోజుకు కనీసం ఒక్కసారైనా డెంటల్ ఫ్లోస్ (ప్రత్యేకమైన దారం) ఉపయోగించి పళ్ల మధ్యలో ఖాళీలను శుభ్రం చేయాలి.
3. ఆహారపు అలవాట్లలో మార్పులు
మనం తినే ఆహారం దంతాల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది:
- చక్కెర తగ్గించండి: చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు పళ్లకు అంటుకుపోయి బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి.
- సోడాలు మరియు జ్యూస్: వీటిలో ఉండే యాసిడ్లు ఎనామెల్‌ను కరిగిస్తాయి. వీటికి బదులుగా నీరు లేదా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.
- నమలాల్సిన పండ్లు: ఆపిల్, క్యారెట్ వంటి పీచు పదార్థం ఉన్న ఆహారం తినడం వల్ల పళ్లు సహజంగా శుభ్రపడతాయి.
- నీరు తాగడం: ఏదైనా తిన్న వెంటనే మంచి నీటితో నోటిని బాగా పుక్కిలించి ఊయడం వల్ల ఆహార కణాలు పళ్లకు అంటుకోకుండా ఉంటాయి.
4. డెంటల్ సీలెంట్స్ (Dental Sealants)
పిల్లల్లో మరియు కొందరిలో పంటి పైభాగం (నమిలే చోట) లోతైన గీతలు ఉండడం వలన అక్కడ ఆహారం త్వరగా ఇరుక్కుపోతుంది. డెంటిస్టులు ఈ గీతలను ఒక పలచని ప్లాస్టిక్ పొరతో (Sealant) పూడ్చేస్తారు. ఇది ఆహారం లోపలికి వెళ్లకుండా అడ్డుకుని పుచ్చు రాకుండా కాపాడుతుంది.
5. రెగ్యులర్ డెంటల్ చెకప్స్
పన్ను నొప్పి వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరకు వెళ్లాలనే అపోహ వద్దు.
- ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించి ‘ప్రొఫెషనల్ క్లీనింగ్’ (Scaling) చేయించుకోవాలి.
- దీనివల్ల పళ్లపై పేరుకుపోయిన గట్టి ప్లేక్ (Tartar) తొలగిపోతుంది, ఇది బ్రష్ చేసినా పోదు.
5. దంత క్షయం సమస్యకు ఎలాంటి చికిత్స చేస్తారు?
దంత క్షయం (Tooth Decay) చికిత్స అనేది ఆ పుచ్చు పంటిలో ఎంత లోతుగా వెళ్ళింది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీనిని డెంటిస్టులు వివిధ దశల్లో చికిత్స చేస్తారు.
దంత క్షయం చికిత్స విధానాలు ఇక్కడ వివరంగా ఉన్నాయి:
- ఫ్లోరైడ్ చికిత్స (Fluoride Treatments) – ప్రారంభ దశ : దంత క్షయం ఇప్పుడే మొదలై, కేవలం ఎనామెల్ (పంటి పైపొర) మీద తెల్లటి మచ్చలా కనిపిస్తుంటే ఈ చికిత్స చేస్తారు.డెంటిస్ట్ పంటిపై ఫ్లోరైడ్ జెల్, వార్నిష్ లేదా లిక్విడ్‌ను పూస్తారు. ఇది పంటి ఎనామెల్‌ను తిరిగి బలోపేతం చేసి, పుచ్చు పెరగకుండా అడ్డుకుంటుంది.
- ఫిల్లింగ్స్ (Dental Fillings) – చిన్న రంధ్రాలు ఏర్పడినప్పుడు : పంటిపై చిన్నపాటి రంధ్రాలు (Cavities) ఏర్పడినప్పుడు ఇది అత్యంత సాధారణ చికిత్స. మొదట డెంటిస్ట్ పంటిలో పుచ్చిపోయిన భాగాన్ని చిన్న డ్రిల్లింగ్ మెషిన్ ద్వారా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఆ ఖాళీని కాంపోజిట్ రెసిన్ (పంటి రంగులో ఉండేది), సిల్వర్ లేదా సిరామిక్ పదార్థంతో నింపుతారు. దీనివలన పంటి దృఢత్వం కాపాడగలం.
- క్రౌన్స్ (Crowns / Dental Caps) – పన్ను బాగా బలహీనపడినప్పుడు : పన్ను చాలా వరకు పుచ్చిపోయి, పిల్లింగ్ పట్టేంత బలం లేనప్పుడు క్రౌన్స్ వాడతారు.పుచ్చిపోయిన భాగాన్ని తొలగించి, మిగిలిన పంటిని ఒక ఆకృతికి తెస్తారు. దానిపై పంటి రంగులో ఉండే బలమైన క్యాప్ (Crown) ను అమర్చుతారు. ఇది పంటికి రక్షణను, బలాన్ని ఇస్తుంది.అయితే క్రౌన్ అమర్చే ముందు పంటిలోపల పుచ్చు ఎంతవరకు ఉందని నిశితంగా పరిశీలిస్తారు. ఒకవేళ ఈ పుచ్చు పంటి యొక్క పల్ప్ భాగానికి అతి దగ్గరగా ఉంటే ముందుగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే క్రౌన్ అమర్చుతారు. ఒకవేళ ఈ పుచ్చు అనేది పంటి పైభాగంలో ఉండి పల్ప్ దగ్గరకు వ్యాపించే సూచన లేకపోతే పుచ్చును డ్రిల్ చేసి క్రౌన్ అమరుస్తారు.
- రూట్ కెనాల్ చికిత్స (Root Canal Treatment – RCT) : పుచ్చు పంటి లోపల ఉండే నరాలు మరియు రక్తనాళాల (Pulp) వరకు చేరినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. అప్పుడు RCT అవసరం. పంటి లోపల ఇన్ఫెక్షన్ అయిన సున్నితమైన భాగాన్ని (Pulp) పూర్తిగా తొలగించి, లోపల శుభ్రం చేస్తారు. ఆ ఖాళీని ఒక ప్రత్యేక పదార్థంతో నింపి సీల్ చేస్తారు. ఆ తర్వాత ఆ పంటిపై తప్పనిసరిగా క్రౌన్ (క్యాప్) వేయాల్సి ఉంటుంది.
- పంటిని తొలగించడం (Tooth Extraction) – చివరి దశ : పన్ను చికిత్సకు అందనంతగా పూర్తిగా దెబ్బతిన్నప్పుడు లేదా ఇన్ఫెక్షన్ చిగుళ్ల ఎముక వరకు వెళ్ళినప్పుడు ఆ పంటిని తీసివేయాల్సి వస్తుంది.
a) తర్వాత ఏం చేస్తారు?: పన్ను తీసేసిన చోట పక్కన పళ్ళు ఖాళీ ఉన్న భాగంలోకి జరగవచ్చు. పైభాగంలో లేదా కింద భాగంలో ఉండే పళ్ళు ఆ ఖాళీ వలన ఆహారాన్ని పూర్తిగా నమలలేకపోవచ్చు. దీని కారణంగా జీర్ణక్రియ నెమ్మదించవచ్చు. కాబట్టి అక్కడ డెంటల్ ఇంప్లాంట్ (Implant) లేదా బ్రిడ్జ్ (Bridge) ద్వారా కొత్త పంటిని అమర్చుకోవచ్చు.
చికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- బ్రషింగ్: రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ టూత్ పేస్ట్‌తో తప్పనిసరిగా బ్రష్ చేయాలి. ఒకవేళ పంటిని తీసివేస్తే మాత్రం డాక్టర్ సూచించిన సమయం వరకూ బ్రష్ చేయకూడదు.
- ఫ్లోసింగ్: పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని తీయడానికి ఫ్లోస్ వాడాలి. ఆహారం తీసుకున్న ప్రతీసారి ఫ్లోసింగ్ చేయడం వలన ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
- ఆహారం: చికిత్స తర్వాత కొన్ని గంటల వరకు గట్టి పదార్థాలు తినకూడదు.
- రెగ్యులర్ చెకప్: ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించాలి.
దంత క్షయం నివారణ అనేది కేవలం బ్రష్ చేయడమే కాదు, అది ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే రూట్ కెనాల్ వంటి చికిత్స అవసరం లేకుండా మీ సహజమైన పళ్లను కాపాడుకోవచ్చు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.











Appointment
WhatsApp
Call
More