%1$s

నాసల్ పాలిప్స్: రకాలు, లక్షణాలు, కారణాలు & చికిత్స పద్దతులు

Nasal Polyps Symptoms, Causes, Treatment_telugu banner

జలుబు చేసినపుడు ముక్కు బిగుసుకొని పోయినట్లు అనిపిస్తుండటం సహజం కానీ, కొన్ని సార్లు జలుబు లేకపోయినా ముక్కులో శ్వాసకు అడ్డు ఉన్నట్లుగా ఉండటం, శ్వాస తీసుకోవడం కష్టంగా మారటం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇందుకు ప్రధాన కారణం ముక్కులో కండ పెరగడం. ఈ విధంగా ముక్కు, సైనస్‌లలో కండ పెరిగి వాపు రావడాన్ని నాసల్ పాలిప్స్ అంటారు. ఇది ముక్కు రెండు రంధ్రాలలోనూ, సైనస్‌లలోనూ ఏర్పడతాయి. నాసల్ పాలిప్స్ అనేది దీర్ఘకాలికంగా వేధించే శ్వాసకోశ సమస్య. 

సాధారణంగా ముక్కు లోపలిభాగం, సైనస్‌లు ఒకవిధమైన మృదువైన శ్లేష్మపు పొరతో కప్పి ఉంటాయి. ఈ పొర ఒకవిధమైన పల్చటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం ముక్కునూ, సైనస్‌లనూ తేమగా ఉంచుతూ ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన దుమ్మూధూళీ ఇతర సూక్ష్మజీవులను చిన్న వెంట్రుకల లాంటి వాటి సాయంతో గొంతులోకి, ముక్కులోకీ చేర్చి తద్వారా బయటకు పంపేస్తుంటుంది. ఈ శ్లేష్మపు పొరకు దీర్ఘకాలికంగా ఫంగల్‌, వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ లాంటివి సోకినప్పుడు ముక్కులోపలి పొర వాపు వస్తుంది. తద్వారా కూడా పాలిప్స్‌ ఏర్పడుతాయి. ఇవి ముక్కు రంధ్రాలకు అడ్డుగా నిలుస్తాయి. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

ఎక్కువ కాలం జలుబుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. నాసల్‌ పాలిప్స్ కళ్ళు, చెంప ఎముకలు మరియు ముక్కు వంటి ప్రాంతాల్లో చూడవచ్చు. అవి ముక్కు లేదా సైనసస్ యొక్క పొరలలో వృద్ధి చెందుతాయి. అవి సాధారణంగా ప్రమాదకరం కావు, కానీ చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి నాసికా ద్వారం నిరోధించి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. నాజల్‌ పాలిప్‌లు రావడానికి నిర్దిష్ట వయస్సు లేదు, కానీ అవి యువకులు మరియు మధ్య వయస్సు గల వారిలో చాలా సాధారణం. అయితే ఈ సమస్య అడవారితో పోల్చుకుంటే మగవారిలో 2-4 శాతం ఎక్కువ.

నాసల్‌ పాలిప్స్‌ రకాలు

నాసల్‌ పాలిప్స్‌ ఏర్పడే స్థానం మరియు వాటి స్థితి ఆదారంగా వీటిని ముఖ్యంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు.  

ఎథ్మోయిడల్ పాలిప్స్‌: వీటినే నేసల్‌ పాలిపోసిస్ అని కూడా అంటారు. ఎథ్మోయిడల్ పాలిప్స్‌ అత్యంత సాధారణ రకం. ఇవి ముక్కులో రెండు వైపుల వస్తాయి. ముక్కు మరియు కళ్ళ మధ్య (కనుగుంట) లో ఉండే సైనస్‌ ను ఎథ్మోయిడల్ సైనస్‌ అంటాం, వీటి నుంచి ఈ పాలిప్స్‌ అనేవి అభివృద్ధి చెందుతాయి. ఈ రకమైన పాలిప్స్ పిల్లలు మరియు యువకులలో సర్వసాధారణం. ఎథ్మోయిడల్ పాలిప్స్‌ యొక్క అత్యంత సాధారణ లక్షణాలు నాసికా అవరోధం మరియు ముక్కు కారటం.

ఆంట్రోకోనాల్ పాలిప్స్: ఆంట్రోకోనాల్ పాలిప్స్ అనేవి చాలా అరుదుగా సంభవిస్తాయి. ఈ రకమైన పాలిప్స్ ఒకే ఒక ముక్కు నుంచి వస్తుంది. ఇవి కంటి క్రింద హనుకోటరము (మాగ్జిలరీ సైనస్‌)నుంచి వస్తుంది. దంతాల పైన మరియు బుగ్గలు మరియు ముక్కు క్రింద ఉన్న మాక్సిల్లరీ సైనస్‌లలో ఇవి అభివృద్ధి చెందుతాయి. ఈ పాలిప్స్ ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తుంది.

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

నాసల్‌ పాలిప్స్‌ యొక్క లక్షణాలు

Nasal Polyps Symptoms telugu

సాధారనంగా నేసల్ పాలిప్స్ (ముక్కులో ద్రాక్షగుత్తులు) యొక్క లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • ముక్కు మూసుకుపోవడం
  • ముక్కు కారటం
  • జలుబు
  • తుమ్ములు
  • తలనొప్పి
  • పాక్షికంగా లేదా పూర్తిగా వాసన కోల్పోవడం
  • సైనస్ ఒత్తిడి
  • గురక
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • ముక్కులో గడ్డలు రావడం
  • ముఖం లేదా నుదురు భాగంలో నొప్పి
  • హైపోనాసల్‌ వాయిస్‌
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

నాసల్‌ పాలిప్స్‌కు  ప్రధాన కారణాలు

నాసల్‌ పాలిప్స్‌ రావడానికి ఖచ్చితమైన కారణం లేనప్పటికి, ఒక వ్యక్తి ఈ క్రింది సమస్యలతో బాధపడుతున్నట్లయితే నేసల్ పాలిప్స్ అభివృద్ధి చెందే ప్రమాదం అధికంగా ఉంటుంది.

  • తరచు ఇన్ఫెక్షన్‌కు గురికావడం
  • దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్లు మరియు సైనసైటిస్‌ బారిన పడడం 
  • సిస్టిక్ ఫైబ్రోసిస్ మరియు ఆస్తమా తో బాధపడుతుండటం
  • అలెర్జిక్ రినిటిస్ (గవత జ్వరం)
  • ఆస్పిరిన్ సేన్సిటివిటి (Aspirin sensitivity)
  • ఎక్కువగా నేసల్‌ అలర్జీలు మరియు ఫంగల్‌ సైనసైటిస్ మూలనా కూడా నేసల్‌ పాలిప్స్ బారిన పడుతుంటారు.
  • జన్యుపరమైన కారకాలు మరియు వంశపారంపర్య (హెరిడిటరీ) గా కూడా నేసల్‌ పాలిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

నాసల్‌ పాలీప్స్ యొక్క నిర్ధారణ పరీక్షలు

క్రింద పేర్కొన్న పరీక్షల ద్వారా నాసల్‌ పాలిప్స్ ను నిర్ధారణ చేయవచ్చు:

నాసికా పాలిప్‌లను నిర్ధారించడంలో శారీరక పరీక్ష చాలా కీలకమైనది, ఎందుకంటే ఇందులో ఎటువంటి పరీక్సలు లేకుండానే పాలిప్‌లను గుర్తించడానికి సహాయపడుతుంది.

  • అలెర్జీ పరీక్షలు: దీర్ఘకాలిక మంటకు మరియు వాపును కలిగించే అలర్జీలను గుర్తించడానికి ఈ  పరీక్షలు ఉపయోగపడతాయి.
  • సిస్టిక్ ఫైబ్రోసిస్ పరీక్ష : తరచుగా ఫైబ్రోసిస్ (CF) ఉన్న వ్యక్తులు ఎక్కువగా నాసికా పాలీప్స్ బారిన పడుతుంటారు. అసలు పదే పదే వీరిలో నాసల్ పాలిప్స్ రావడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేయడం జరుగుతుంది.
  • PNS ఎక్స్-రే & PNS CT : సైనసైటిస్, నాసల్‌ పాలిప్స్ మరియు సైనస్ అనాటమీ యొక్క పూర్తి స్థాయిని వీక్షించడానికి మరియు ఏదైనా ప్రాణాంతకత పరిస్థితులను నిర్ధారించడానికి వైద్యుడు PNS ఎక్స్-రే & PNS CTఈ పరీక్ష చేస్తారు.
  • ఇమేజింగ్ పరీక్షలు: సైనస్‌లలో లోతుగా ఉన్న పాలిప్స్ పరిమాణం, స్థానం మరియు  నాసికా కుహరంలో ఉన్న అడ్డంకులను గుర్తించడానికి వైద్యులకు ఈ ఇమేజింగ్ పరీక్షలు  సహాయపడతాయి.
  • ఎండోస్కోపీ: ఈ పరీక్షలో, తేలికైన మాగ్నిఫైయింగ్ లెన్స్ లేదా మైక్రో కెమెరాతో సన్నని ట్యూబ్‌ని ఉపయోగించి డాక్టర్ ముక్కు మరియు సైనస్‌లను పరిశీలించి పాలిప్‌లు ఏ పరిమాణంలో ఉన్నాయో తెలుసుకుంటారు.
  • విటమిన్ డి స్థాయి పరీక్ష: విటమిన్ డి లోపం వల్ల ఇన్ఫ్లమేషన్ మరియు పాలిప్స్ వచ్చే అవకాశం ఎక్కువ కావున, శరీరంలో విటమిన్ డి స్థాయిలను నిర్ధారించడానికి ఈ పరీక్ష చేయడం జరగుతుంది.
మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఉన్నారా?

నాసల్‌ పాలిప్స్‌ నివారణ చర్యలు

  • ఎలర్జీ ,ఆస్తమాతో బాధపడుతున్నట్లు అయితే తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించి తగు చికిత్స తీసుకోవడం చాలా అవసరం
  • ధుమపానంను మానేయడం మరియు ధుమపానం చేసే వారి నుంచి దూరంగా ఉండడం మంచిది.
  • భవన నిర్మాణ కార్మికులు మరిము వివిధ రకాల ఫ్యాక్టీరిలలో పనిచేసే వారు తప్పకుండా ఎలర్జీ వంటి కారకాలకు గురి కాకుండా స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలి.
  • భోజనం చేసే ముందు లేదా బయటికి వెళ్లి వచ్చిన తరువాత చేతులను శ్రుభంగా కడుక్కోవడం ఉత్తమం.
  • ఇంట్లో హ్యూమిడిఫైయర్ లను వాడడం ( హ్యూమిడిఫైయర్ అనేది ఒక గది లేదా పరివేష్టిత ప్రదేశంలో గాలిలో తేమ స్థాయిని పెంచి ముక్కు అలర్జీకి గురికాకుండా నిరోదిస్తుంది)
  • ట్రాఫిక్‌ లేదా బయట తిరిగి వచ్చినప్పుడు నేసల్‌ వాష్‌ వంటివి వాడాలి. 
  • హైడ్రేటెడ్ గా ఉండడం (తగినంత నీరు తీసుకోవడం వల్ల శ్లేష్మం సన్నగా మరియు నాసికా భాగాలను స్పష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది)
  • యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ (శరీరంలో తాపజనకమైన మార్పులను తగ్గించే ఆహారాలు-పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు మరియు తృణధాన్యాలు వంటివి) ను అధికంగా తీసుకోవడం. ఈ ఆహారాలు సైనస్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి
  • కొన్ని ఆహారాలు లేదా పానీయాలను(ఆల్కహాల్, ముఖ్యంగా బీర్ మరియు వైన్ వంటివి, సున్నితమైన వ్యక్తులలో నాసికా రద్దీకి కారణమవుతాయి) నివారించడం.
  • తాపజనకమైన  లక్షణాలను  తగ్గించడానికి మరియు అదుపులో ఉంచడానికి డాక్టర్ సూచించిన యాంటిహిస్టామైన్‌లు, నాసల్ స్ప్రేలు లేదా ఆస్తమా మందులను తీసుకోవడం
  • ఆవిరి పీల్చడం వల్ల కూడా సైనస్ తేమను అదుపులో ఉంచుకోవడమే కాక పాలిప్ ఏర్పడటానికి దోహదపడే అడ్డంకులను నిరోధించవచ్చు.
  • ఆస్పిరిన్-ఎక్సెర్బేటెడ్ రెస్పిరేటరీ డిసీజ్ (AERD) లేదా సామ్టర్స్ ట్రయాడ్ (ఉబ్బసం, నాసికా పాలిప్స్ మరియు ఆస్పిరిన్ సెన్సిటివిటీ) ఉన్న వ్యక్తులు ఆస్పిరిన్ మరియు NSAIDలకు దూరంగా ఉండడం.

నాసల్‌ పాలిప్స్‌ చికిత్స పద్దతులు

వైద్యులు నాసల్ పాలిప్స్ అని నిర్ధారణ అయిన తరువాత పాలిప్స్ లను తగ్గించడానికి నేసల్ స్టెరాయిడ్స్ (steroids)  లేదా ద్రవాలు (లిక్విడ్లు), అలెర్జీల కోసం-యాంటిహిస్టామైన్లు(Anti-histamines), సూక్ష్మక్రిమివ్యాధులకు (anti-bacterials) మందులను సూచిస్తారు.

అయితే కొన్ని సార్లు మందులు ప్రభావవంతంగా లేనప్పుడు లేదా పాలిప్స్ పెద్దగా ఉన్నప్పుడు, లక్షణాల నుండి ఉపశమనం అందించడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు.  

సాధారణంగా గ్రేడు 2,3 పాలిప్స్‌ వస్తే మందులతో తగ్గించుకోవచ్చు కానీ,  కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వీటికి సర్జరీ అవసరం రావొచ్చు. గ్రేడ్‌-4 పాలిప్స్‌కి మాత్రం సర్జరీ తప్పనిసరి. 

ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ : ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (Endoscopic sinus surgery)/ ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (Functional endoscopic sinus surgery)ను సాధారణంగా నాసల్ పాలిప్స్ చికిత్స కోసం నిర్వహిస్తారు. నాసికా రంధ్రాల ద్వారా ఎండోస్కోప్‌ను (లైట్‌తో కూడిన సన్నని కెమెరా) ఉపయోగించి, చికిత్స పరికరాలను సైనస్‌లలోని  చొప్పించి, పాలిప్స్, కణజాలు లేదా ఎముకలను తొలగించడానికి ఉపయోగిస్తాడు. సర్జన్ సైనస్‌లను విశ్రమింపజేయడానికి బెలూన్‌ను కూడా ఉపయోగించి, సైనస్ యొక్క మార్గాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించవచ్చు.

బెలూన్ సైనుప్లాస్టీ :  బెలూన్ సైనుప్లాస్టీ అనేది నాసల్‌ పాలిప్స్ ను నయం చేయడానికి చేసే సర్జరీ పద్ధతి. ఈ ప్రక్రియలో,  సర్జన్ మీ ముక్కు రంధ్రం ద్వారా  చిన్న బెలూన్‌ను పంపించి, మూసుకుపోయిన నాసికా మార్గాలను తెరిచి నాసికా పాలిప్స్‌ను తొలగిస్తారు. 

పాలీపెక్టమీ: పాలీపెక్టమీ అనేది పాలిప్‌ను తొలగించడానికి చేసే వైద్య ప్రక్రియ. ఇందులో నాసికా రంధ్రాల్లో పెరిగే కణజాల పెరుగుదలను లేదా నాసల్ పాలిప్స్ ను తొలగించడం జరుగుతుంది.

సర్జరీ తరువాత 2-3 శాతం పేషంట్ లలో మాత్రమే పాలిప్స్‌ మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతీ సీజన్లలోనూ అలర్జీలు ఉన్నపుడే పాలిప్స్‌ రావడానికి ఎక్కవగా అవకాశం ఉంటుంది. పాలిప్స్‌ను సైనస్‌ సర్జరీతో చిన్న ముక్కలు చేసి తొలగించవచ్చు. గాలి ఆడేలా కండలను తొలగిస్తారు. ఆ తర్వాత కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉంటుంది. మాస్కులను తప్పనిసరిగా వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ముక్కులో కండ మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం ఉంది. సరైన సమయంలో డాక్టర్ ను సంప్రదించి చికిత్స  తీసుకున్నట్లు అయితే పాలిప్స్ బారిన పడకుండా ఉండవచ్చు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 కి కాల్ చేయగలరు.

Dr. M. A. Amjad Khan

About Author –

Dr. M. A. Amjad Khan

Dr. M. A. Amjad Khan

MS (ENT, Head and Neck)
Consultant ENT and Head & Neck Surgeon

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567