Select Page

గోల్ఫర్ ఎల్బో అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు

గోల్ఫర్ ఎల్బో అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు

u003cpu003eమన రక్తంలో ప్రధానంగా నాలుగు ముఖ్య భాగాలు ఉంటాయి. ఇవి ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్. రక్తంలో ఎర్ర రక్తకణాలు 44 శాతం ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను (హేమోగ్లోబిన్ ద్వారా) సరఫరా చేస్తాయి. ఎర్ర రక్త కణాల ఆకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, వీటిని శాస్త్రీయంగా ద్విపుటాకారము (Biconcave Disk) అని అంటారు.దీనిని సరళంగా చెప్పాలంటే, ఇది గుండ్రంగా, డోనట్ ఆకారంలో ఉంటుంది, కానీ మధ్యలో రంధ్రం ఉండదు.పక్క నుండి చూసినప్పుడు, కణం యొక్క అంచులు మందంగా ఉండి, మధ్య భాగం లోపలికి నొక్కినట్లుగా ఉంటుంది.u003c/pu003enu003cpu003eస్పిరోసైటోసిస్ (Spherocytosis) అనేది ఒక రకమైన u003ca href=u0022https://www.yashodahospitals.com/te/blog/the-hemoglobin-levels-are-very-low-in-iron-deficiency-anemia/u0022u003eరక్తహీనతu003c/au003e . ఈ స్థితిలో, సాధారణంగా ద్విపుటాకారంలో ఉండాల్సిన ఎర్ర రక్త కణాలు వాటి ఆకారాన్ని కోల్పోయి, గుండ్రటి బంతిలాంటి ఆకారంలోకి మారిపోతాయి. అందుకే దీనికి స్పిరోసైటోసిస్ (స్పియర్ అంటే గోళం/బంతి) అనే పేరు వచ్చింది.u003c/pu003e

1. గోల్ఫర్ ఎల్బో అంటే?

మన రోజువారీ జీవితంలో పనులు చకచకా సాగిపోవాలంటే మన చేతులు, ముఖ్యంగా కీళ్లు సహకరించడం చాలా అవసరం. అయితే, ఒక్కోసారి మనం వస్తువులను గట్టిగా పట్టుకున్నప్పుడు లేదా మణికట్టును వంచినప్పుడు మోచేయి లోపలి భాగంలో తీవ్రమైన నొప్పి రావడం గమనిస్తుంటాం. చాలా మంది దీనిని సాధారణ అలసట అని పొరబడతారు, కానీ వైద్య పరిభాషలో దీనిని ‘గోల్ఫర్ ఎల్బో’ (Golfer’s Elbow) లేదా ‘మీడియల్ ఎపికొండైలిటిస్’ అంటారు.

పేరులోనే గోల్ఫ్ ఉంది కదా.. ఇది కేవలం క్రీడాకారులకే వస్తుందా? అనే సందేహం మీకు రావచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే, ఈ సమస్య రావడానికి మీరు గోల్ఫ్ స్టిక్ పట్టుకోవాల్సిన అవసరం లేదు! ఆఫీసులో గంటల తరబడి టైపింగ్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నుండి, ఇంట్లో బట్టలు పిండటం లేదా వంట చేసే గృహిణుల వరకు.. చేతులతో పదే పదే ఒకే రకమైన పని చేసే ఎవరికైనా ఈ సమస్య రావచ్చు.

మొదట్లో చిన్నపాటి అసౌకర్యంగా మొదలయ్యే ఈ నొప్పి, సరైన సమయంలో జాగ్రత్త పడకపోతే వస్తువులను పట్టుకోలేనంత బలహీనతకు దారితీస్తుంది. అసలు గోల్ఫర్ ఎల్బో ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? మరియు దీని నుండి విముక్తి పొందేందుకు ఇంట్లోనే పాటించాల్సిన చికిత్సలేంటి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

గోల్ఫర్ ఎల్బో (Golfer’s Elbow) అనేది ఒక రకమైన టెండినిటిస్. వైద్య పరిభాషలో దీనిని ‘మీడియల్ ఎపికొండైలిటిస్’ (Medial Epicondylitis) అని పిలుస్తారు. సరళంగా చెప్పాలంటే, మీ మోచేయి లోపలి భాగంలో ఉన్న టెండన్లు (కండరాలను ఎముకకు కలిపే నరాలు) వాపుకు గురికావడాన్ని గోల్ఫర్ ఎల్బో అంటారు.

2. గోల్ఫర్ ఎల్బో కారణాలు

గోల్ఫర్ ఎల్బో (Golfer’s Elbow) రావడానికి ప్రధాన కారణం మోచేయి నుండి మణికట్టు వరకు ఉండే టెండన్లపై అధిక ఒత్తిడి పడటం. మనం మణికట్టును లోపలికి వంచడానికి లేదా వస్తువులను గట్టిగా పట్టుకోవడానికి ఉపయోగించే కండరాలు (Flexor muscles) ఈ టెండన్లతోనే ఎముకకు అతుక్కొని ఉంటాయి.
గోల్ఫర్ ఎల్బో రావడానికి దారితీసే కారణాలను వివరంగా కింద చూడవచ్చు:

1. కీళ్లను అతిగా వాడటం
ఇది అత్యంత సాధారణ కారణం. ఒకే రకమైన కదలికను పదే పదే చేయడం వల్ల టెండన్లపై సూక్ష్మమైన గాయాలు (Micro-tears) ఏర్పడతాయి. ఉదాహరణకు, రోజంతా టైపింగ్ చేయడం, మౌస్ వాడటం లేదా ఫ్యాక్టరీలో అసెంబ్లీ లైన్ పనులు చేయడం.

2. క్రీడలు
కేవలం గోల్ఫ్ మాత్రమే కాదు, మరికొన్ని ఆటల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు:

  • గోల్ఫ్: క్లబ్‌ను గట్టిగా పట్టుకుని తప్పు భంగిమలో స్వింగ్ చేయడం వలన గోల్ఫర్ ఎల్బో సమస్య కలగవచ్చు.
  • రాకెట్ స్పోర్ట్స్: టెన్నిస్ లేదా బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు సర్వీస్ చేసే విధానం సరిగ్గా లేకపోవడం (ముఖ్యంగా టాప్ స్పిన్ వాడటం).
  • వెయిట్ లిఫ్టింగ్: బైసెప్స్ వ్యాయామాలు చేసేటప్పుడు మణికట్టును ఎక్కువగా వంచడం వల్ల మోచేయి లోపలి భాగంపై భారం పడుతుంది. దీనివలన మోచేయి భాగంలో ఉన్న టెండెన్స్ పై ఒత్తిడి కలిగి గోల్ఫర్ ఎల్బో కలుగుతుంది.
  • త్రోయింగ్ స్పోర్ట్స్: జావలిన్ త్రో లేదా బేస్ బాల్ విసిరే వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఉదాహరణకు బేస్ బాల్ విసిరే సమయంలో మోచేతి పైన చాలా ఎక్కువగా ఒత్తిడి కలుగుంది. ఇదే రకమైన కదలికలను మళ్ళీ మళ్ళీ చేయడం వలన టెండెన్స్ లేదా స్నాయువులు దెబ్బతిని గోల్ఫర్ ఎల్బో సమస్య ఏర్పడవచ్చు.

3. వృత్తిపరమైన పనులు
చేతులతో కష్టపడి పనిచేసే వృత్తుల్లో ఉండేవారికి గోల్ఫర్ ఎల్బో వచ్చే అవకాశం ఎక్కువ:

  • నిర్మాణ రంగం: సుత్తితో మేకులు కొట్టడం, స్క్రూడ్రైవర్లను తిప్పడం.
  • పెయింటింగ్ & ప్లంబింగ్: బ్రష్‌తో పదే పదే పెయింట్ చేయడం లేదా పైపులను బిగించడం.
  • వంట పని: పెద్ద గరిటెలతో ఆహారాన్ని తిప్పడం, పిండి కలపడం లేదా బట్టలు పిండటం వంటి పనులు.

4. తప్పు టెక్నిక్
ఏ పని చేసినా శరీర భంగిమ సరిగ్గా లేకపోతే ఆ భారం కీళ్లపై పడుతుంది.

  • తక్కువ బరువు ఉన్న వస్తువును కూడా తప్పుడు యాంగిల్‌లో పదే పదే ఎత్తడం వల్ల టెండన్లు వాపుకు గురవుతాయి.
  • సరైన సైజు లేని స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్ (ఉదాహరణకు చాలా బరువైన రాకెట్) వాడటం వలన కూడా గోల్ఫర్ ఎల్బో సమస్య ఏర్పడుతుంది.

5. వయస్సు మరియు ఇతర కారణాలు

  • వయస్సు: 40 ఏళ్లు పైబడిన వారిలో టెండన్లు తమ బలాన్ని కోల్పోవడం వల్ల త్వరగా దెబ్బతింటాయి.
  • ధూమపానం: సిగరెట్లు తాగే వారిలో రక్త ప్రసరణ తగ్గి, టెండన్లు త్వరగా కోలుకోలేవు.
  • స్థూలకాయం: అధిక బరువు ఉండటం వల్ల శరీరంలో వాపు (Inflammation) వచ్చే ప్రక్రియ పెరుగుతుంది.
  • డయాబెటీస్ : డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఈ అదనపు చక్కెర రక్తంలోని ప్రోటీన్లతో కలిసి Advanced Glycation End-products (AGEs) అనే పదార్థాలను తయారు చేస్తుంది. ఇవి ఎముకలను కండరాలకు కలిపే టెండన్లలోని (Tendons) కొల్లాజెన్‌ను గట్టిగా మరియు బలహీనంగా మారుస్తాయి. దీనివల్ల మోచేయి కండరాలు సులభంగా దెబ్బతింటాయి.
  • ఆల్కహాల్ : ఆల్కహాల్ శరీరంలో ఇన్ఫ్లమేటరీ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. మోచేయి లోపలి భాగంలోని కండరాలు మరియు టెండన్లు (Tendons) ఇప్పటికే ఒత్తిడికి లోనై ఉంటే, ఆల్కహాల్ వల్ల పెరిగే ఈ వాపు ఆ నొప్పిని మరియు అసౌకర్యాన్ని మరింత ఎక్కువ చేస్తుంది.

ముఖ్య గమనిక : “చాలా మంది నొప్పి మొదలవ్వగానే పెయిన్ కిల్లర్స్ వేసుకుని పని కొనసాగిస్తారు. కానీ, విశ్రాంతి ఇవ్వకుండా పని చేయడం వల్ల ఆ చిన్న గాయాలు కాస్తా ‘టెండనోసిస్’ (టెండన్లు శాశ్వతంగా బలహీనపడటం) గా మారే ప్రమాదం ఉంది.”

3.గోల్ఫర్ ఎల్బో లక్షణాలు

గోల్ఫర్ ఎల్బో (Golfer’s Elbow) లక్షణాలు సాధారణంగా మోచేయి లోపలి భాగంలో మొదలై, క్రమంగా మణికట్టు వరకు వ్యాపిస్తాయి. ఇవి ఒక్కసారిగా రావచ్చు లేదా మీరు చేసే పనిని బట్టి కాలక్రమేణా పెరుగుతూ ఉండవచ్చు.

గోల్ఫర్ ఎల్బో ప్రధాన లక్షణాలు ఇక్కడ వివరంగా ఉన్నాయి:

1. మోచేయి లోపలి భాగంలో నొప్పి
ఇది అత్యంత ముఖ్యమైన లక్షణం. మోచేయి లోపలి వైపు ఉండే ఎముక (Medial Epicondyle) పైన నొప్పి ఎక్కువగా ఉంటుంది.

  • మణికట్టును లోపలికి వంచినప్పుడు లేదా వస్తువులను గట్టిగా పట్టుకున్నప్పుడు ఈ నొప్పి తీవ్రమవుతుంది.
  • కొన్నిసార్లు ఈ నొప్పి మీ ముంజేయి వరకు వ్యాపిస్తుంది.

2. కీలు బిగుసుకుపోవడం
ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే లేదా ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మోచేయి బిగుతుగా అనిపిస్తుంది.

  • చేతిని పూర్తిగా సాగదీయడం (Straighten) లేదా మడవడం కష్టంగా ఉండవచ్చు.
  • ముంజేయి కండరాలు గట్టిపడినట్లు అనిపిస్తాయి.

3. చేతుల బలహీనత

చేతులు మరియు మణికట్టులో బలం తగ్గినట్లు అనిపిస్తుంది. దీనివల్ల రోజువారీ పనులు చేయడం కష్టమవుతుంది.

  • వస్తువులను పట్టుకోవడంలో పట్టు (Grip) ఉండదు.
  • తలుపు గొళ్ళెం తిప్పడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటి పనులప్పుడు చెయ్యి నీరసించినట్లు అవుతుంది.

4. తిమ్మిరి లేదా సూదులతో గుచ్చినట్లు ఉండటం
టెండన్ల వాపు వల్ల దాని పక్కనే ఉండే అల్నార్ నర్వ్ (Ulnar Nerve) పై ఒత్తిడి పడవచ్చు. దీనివల్ల:

  • మీ ఉంగరపు వేలు (Ring finger) మరియు చిటికెన వేలులో (Little finger) తిమ్మిర్లు రావచ్చు.
  • కరెంట్ షాక్ కొట్టినట్లు లేదా సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది.

5. పని చేస్తున్నప్పుడు నొప్పి పెరగడం

  • బరువులు ఎత్తినప్పుడు.
  • స్క్రూడ్రైవర్ తిప్పడం లేదా మేకులు కొట్టడం వంటి పనులు చేసినప్పుడు.
  • గోల్ఫ్ క్లబ్ లేదా టెన్నిస్ రాకెట్ విసిరినప్పుడు నొప్పి ఒక్కసారిగా షూట్ అవుతుంది.

ముఖ్య గమనిక :

“చాలా మంది టెన్నిస్ ఎల్బో అనుకుని పొరబడతారు. కానీ నొప్పి మోచేయి బయటి వైపు ఉంటే అది టెన్నిస్ ఎల్బో, అదే నొప్పి మోచేయి లోపలి వైపు ఉంటే అది గోల్ఫర్ ఎల్బో అని సులభంగా గుర్తించవచ్చు.”

golfers-elbow-telugu-body

 

మోచేయి కదిలించలేనంత నొప్పిగా ఉంటుందా?

వెంటనే మా వైద్య నిపుణులను సంప్రదించండి!

4. గోల్ఫర్ ఎల్బో చికిత్స ఎలా చేస్తారు?

గోల్ఫర్ ఎల్బో (Golfer’s Elbow) చికిత్స ప్రాథమికంగా నొప్పిని తగ్గించడం, వాపును నియంత్రించడం మరియు దెబ్బతిన్న టెండన్ల కణజాలం మళ్లీ కోలుకునేలా చేయడంపై ఆధారపడి ఉంటుంది. దీని చికిత్సా విధానాలను వివిధ దశలుగా విభజించవచ్చు:

1. ప్రాథమిక చికిత్స (R.I.C.E. పద్ధతి)
నొప్పి మొదలైన తొలి రోజుల్లో ఈ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది:

  • Rest (విశ్రాంతి): నొప్పి కలిగించే పనులను (గోల్ఫ్, బరువులు ఎత్తడం, టైపింగ్) తాత్కాలికంగా ఆపేయాలి.
  • Ice (ఐస్ థెరపీ): రోజుకు 3-4 సార్లు, 15 నిమిషాల పాటు మోచేయి లోపలి భాగంలో ఐస్ ప్యాక్ పెట్టాలి. ఇది వాపును తగ్గిస్తుంది.
  • Compression (ఒత్తిడి): మోచేయికి సపోర్ట్ ఇచ్చేలా ఎలాస్టిక్ బ్యాండేజ్ లేదా కౌంటర్‌ఫోర్స్ బ్రేస్ (Counterforce brace) ధరించాలి.
  • Elevation (ఎత్తులో ఉంచడం): నొప్పి ఉన్న చేతిని గుండె స్థాయి కంటే కొంచెం ఎత్తులో ఉంచాలి.

2. మందులు
నొప్పి మరియు వాపు తీవ్రతను బట్టి వైద్యులు ఈ క్రింది మందులను సూచించవచ్చు:

  • నొప్పి నివారణిలు: ఇబుప్రోఫెన్ వంటి మందులు నొప్పిని తగ్గిస్తాయి.
  • కోర్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్లు: నొప్పి చాలా తీవ్రంగా ఉండి, తగ్గనప్పుడు నేరుగా టెండన్ వద్దకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇది వాపును త్వరగా తగ్గిస్తుంది, కానీ దీనిని పదే పదే వాడకూడదు.

3. ఫిజియోథెరపీ
గోల్ఫర్ ఎల్బో నుండి శాశ్వతంగా కోలుకోవడానికి ఇది అత్యంత కీలకమైన మార్గం.

  • స్ట్రెచింగ్ వ్యాయామాలు: మణికట్టును సాగదీసే వ్యాయామాలు టెండన్లపై ఒత్తిడిని తగ్గిస్తాయి.
  • ఎక్సెంట్రిక్ స్ట్రెంథెనింగ్ (Eccentric Strengthening): ముంజేయి (Forearm) కండరాలను బలోపేతం చేసే ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తారు. దీనివల్ల టెండన్ల శక్తి పెరుగుతుంది

4. ఆధునిక చికిత్సలు (Advanced Procedures)
మందులు మరియు వ్యాయామాలతో నెలల తరబడి నొప్పి తగ్గకపోతే వైద్యులు వీటిని సూచిస్తారు:

  • షాక్ వేవ్ థెరపీ (Shock Wave Therapy): సౌండ్ వేవ్స్ ద్వారా దెబ్బతిన్న టెండన్ భాగంలో రక్త ప్రసరణ పెంచి హీలింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తారు.
  • PRP థెరపీ (Platelet-Rich Plasma): రోగి రక్తం నుండి తీసిన ప్లాస్మాను నేరుగా గాయపడిన టెండన్ వద్ద ఇంజెక్ట్ చేస్తారు. ఇది కణజాల పునరుద్ధరణకు సహకరిస్తుంది.
  • డ్రై నీడ్లింగ్ (Dry Needling): ఇది చూడటానికి అక్యుపంక్చర్ లాగే అనిపించినా, దీని ఉద్దేశ్యం మరియు పద్ధతి వేరు.చాలా సన్నని స్టెరిలైజ్డ్ సూదులను కండరాల్లోని ‘ట్రిగ్గర్ పాయింట్స్’ (Trigger Points) లేదా గట్టిగా అయిపోయిన కణజాలం (Scar tissue) లోకి గుచ్చుతారు.కండరాల బిగువును (Muscle tightness) తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

5. శస్త్రచికిత్స (Surgery)
దాదాపు 90% మందికి పైన చెప్పిన చికిత్సలతోనే తగ్గిపోతుంది. కానీ ఒకవేళ 6 నుండి 12 నెలల వరకు ఎటువంటి ఫలితం లేకపోతే, దెబ్బతిన్న టెండన్ భాగాన్ని తొలగించడానికి వైద్యులు సర్జరీని సిఫార్సు చేస్తారు. ఇప్పుడు ‘టెనెక్స్ (Tenex)’ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా అతి తక్కువ కోతతో కూడా దీనిని నిర్వహిస్తున్నారు. ఈ చికిత్సలో భాగంగా, మొదట పేషేంట్ కు లోకల్ అనస్థీషియా ఇస్తారు. అనంతరం ఒక సన్నని సూది వంటి పరికరాన్ని నొప్పి ఉన్న చోటికి పంపిస్తారు. ఇది అల్ట్రాసోనిక్ శక్తిని విడుదల చేయడం ద్వారా, ఆరోగ్యకరమైన కణజాలానికి ఎటువంటి హాని చేయకుండా కేవలం దెబ్బతిన్న లేదా గట్టిపడిన కణజాలాన్ని (Scar Tissue) మాత్రమే గుర్తించి, సమర్థవంతంగా తొలగిస్తుంది.

ముఖ్య గమనిక :
“నొప్పి తగ్గగానే వెంటనే మళ్ళీ పాత పనులను అదే వేగంతో మొదలుపెట్టకండి. మీ డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్ సలహాతో కండరాలను పూర్తిగా బలోపేతం చేసిన తర్వాతే సాధారణ జీవనశైలికి వెళ్లడం వల్ల సమస్య మళ్ళీ రాకుండా ఉంటుంది.”

5. గోల్ఫర్ ఎల్బో రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గోల్ఫర్ ఎల్బో రాకుండా ఉండాలంటే, ప్రధానంగా మీ ముంజేయి కండరాలను బలోపేతం చేయడం మరియు టెండన్లపై అనవసరమైన ఒత్తిడి పడకుండా చూసుకోవడం ముఖ్యం. భవిష్యత్తులో ఈ సమస్య తలెత్తకుండా ఉండటానికి ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి:

1. కండరాలను బలోపేతం చేయండి
మీ ముంజేయి కండరాలు బలంగా ఉంటే, మీరు వస్తువులను పట్టుకున్నప్పుడు లేదా పని చేస్తున్నప్పుడు ఆ ఒత్తిడిని టెండన్లు కాకుండా కండరాలు భరిస్తాయి.

  • చిన్న బరువులు: 1-2 కేజీల డంబెల్స్‌తో రిస్ట్ కర్ల్స్ (Wrist curls) చేయడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి
  • గ్రిప్ స్ట్రెంథనర్స్: స్ప్రింగ్ ఉండే హ్యాండ్ గ్రిప్పర్స్‌ను వాడటం వల్ల పట్టు పెరుగుతుంది.

2. పనికి ముందు వార్మ్-అప్
మీరు క్రీడలు ఆడినా లేదా బరువైన పనులు చేసినా, ముందుగా రక్త ప్రసరణ పెంచడం ముఖ్యం.

  • పనుల ప్రారంభానికి ముందు 5 నిమిషాల పాటు చేతులను సాగదీయడం (Stretching) మరియు మణికట్టును గుండ్రంగా తిప్పడం వల్ల టెండన్లు సిద్ధంగా ఉంటాయి.

3. సరైన టెక్నిక్ ఉపయోగించండి
మీరు ఏ పని చేస్తున్నా, దాని భంగిమ సరిగ్గా ఉండాలి.

  • జిమ్‌లో: బరువులు ఎత్తేటప్పుడు మణికట్టును మరీ ఎక్కువగా వంచకూడదు.
  • గోల్ఫ్ లేదా టెన్నిస్: మీ స్వింగ్ విధానం సరిగ్గా ఉండేలా చూసుకోండి. తప్పుడు పద్ధతిలో రాకెట్ లేదా క్లబ్ వాడటం వల్ల మోచేయిపై నేరుగా ఒత్తిడి పడుతుంది.
  • ఆఫీసులో: టైపింగ్ చేసేటప్పుడు మణికట్టు ఎత్తుగా ఉండేలా చూసుకోకుండా, సమాంతరంగా ఉండేలా ఎర్గోనామిక్ మౌస్ ప్యాడ్స్ వాడండి.

4. బరువులు ఎత్తే విధానం
బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు కేవలం మణికట్టు లేదా మోచేయి బలాన్ని మాత్రమే వాడకండి.

  • వస్తువును ఎత్తేటప్పుడు మీ అరచేతిని మీ వైపు చూస్తున్నట్లు (Palm facing up) ఉంచి ఎత్తండి. దీనివల్ల మోచేయి లోపలి భాగంపై ఒత్తిడి తగ్గుతుంది.

5. సరైన పరికరాల ఎంపిక

  • మీరు వాడే టెన్నిస్ రాకెట్ లేదా గోల్ఫ్ క్లబ్ మీ శరీరానికి సరిపోయేలా ఉండాలి. మరీ బరువైనవి వాడటం వల్ల టెండన్లు త్వరగా అరిగిపోతాయి.
  • అరిగిపోయిన పరికరాలను లేదా గ్రిప్ సరిగ్గా లేని టూల్స్‌ను వాడటం మానుకోండి.

6. విరామం తీసుకోండి

పదే పదే ఒకే పని చేసేవారు మధ్యలో బ్రేక్ తీసుకోవడం తప్పనిసరి.

  • మీరు గంటల తరబడి కంప్యూటర్ ముందు ఉన్నా లేదా తోటపని చేస్తున్నా, ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చేతులకు 5 నిమిషాల విశ్రాంతి ఇవ్వండి.

7. మీ శరీరం చెప్పేది వినండి
నొప్పి అనేది శరీరం ఇచ్చే హెచ్చరిక.

  • ఏదైనా పని చేస్తున్నప్పుడు మోచేయి లోపలి వైపు చిన్నపాటి నొప్పి లేదా అసౌకర్యం కలిగితే, వెంటనే ఆ పనిని ఆపేయండి. నొప్పిని భరిస్తూ పని చేయడం వల్ల అది తీవ్రమైన ‘గోల్ఫర్ ఎల్బో’గా మారుతుంది.

ముఖ్య గమనిక :
“మీ ముంజేయి కండరాలు అలసిపోయినప్పుడు (Fatigue) టెండన్లపై భారం పెరుగుతుంది. కాబట్టి కండరాలు బాగా అలసిపోయాయని అనిపించినప్పుడు పనిని ఆపి విశ్రాంతి తీసుకోవడమే గోల్ఫర్ ఎల్బో రాకుండా ఉండేందుకు సులభమైన మార్గం.”

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.

About Author

Dr. Venuthurla Ram Mohan Reddya | yashoda hospitals

Dr. Venuthurla Ram Mohan Reddy

MBBS, MS, MSc, FRCS (Ed), FRCS (Orth), CCT

Senior Consultant Orthopaedic Surgeon

Book an appointment
in 2 minutes