Select Page

గర్భంలో శిశువు ఆరోగ్యం కోసం అవసరమైన పరీక్షలు మరియు ఆహారం

గర్భంలో శిశువు ఆరోగ్యం కోసం అవసరమైన పరీక్షలు మరియు ఆహారం

తల్లితండ్రులు కావడం అనేది మాటల్లో వర్ణించలేని ఒక గొప్ప అనుభూతి. మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే తల్లితండ్రులు అవ్వకముందు, తల్లితండ్రులు అయ్యాక అని రెండు భాగాలుగా చెప్పుకుంటాం. మొదటిసారి తల్లితండ్రులు కాబోతున్న జంటకు ఐతే ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన క్షణం నుండి ఆనందానికి అవధులు ఉండవు. శిశివు గర్భంలో ఉన్నప్పటి నుండే వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. శిశువు గర్భంలో ఉన్నప్పుడు వివిధ రకాల పరీక్షలు అవసరం అవుతాయి, ప్రతీనెలా శిశువు ఆరోగ్యం మరియు ఎదుగుదల గమనిస్తూ ఉండడం అవసరం. ఈ సమయంలో ఎలాంటి పరీక్షలు చేపించుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చాలామందికి ప్రశ్నర్ధకంగా ఉంటుంది. ఈ విషయాలను వివరంగా తెలుసుకుందాం. అయితే ముందుగా గర్భంలో శిశువు ఎదుగుదల క్రమం గురించి తెలుసుకుంటే ఈ పరీక్షల వివరాలు మరింత సులభంగా ఉంటాయి.

గర్భంలో శిశివు ఎదుగుదల క్రమం

మహిళల్లో అండం విడుదల కావడం దగ్గర నుండి శిశువు జన్మించే వరకూ మొత్తం పూర్తిగా 9 నుండి 10 నెలల సమయం పడుతుంది. ఈ సమయంలో గర్భంలో శిశువు ఎదుగుదల ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.

  • మొదటి నెల (1 నుండి 4 వారాలు)
    మొదటి నెలలో మహిళల్లో అండం విడుదల కావడం జరుగుతుంది, పురుషుడి నుండి వచ్చిన శుక్రకణం అండంతో కలవడం ద్వారా గర్భధారణ ప్రక్రియ మొదలవుతుంది.
  • రెండవ నెల (5 నుండి 8 వారాలు)
    ప్రెగ్నెన్సీ నిర్ధారణ చాలామందికి ఐదవ వారంలో తెలుస్తుంది. సాధారణంగా నెలసరి రాకపోవడంతో ప్రెగ్నెన్సీ నిర్ధారణ టెస్ట్ ఈ సమయంలో చేసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అవుతుంది. ఆరు నుండి ఏడు వారాల సమయంలో శిశువుకు కాళ్లు, చేతులు ఏర్పడడం మొదలవుతుంది. ఎనిమిదవ వారానికి బొడ్డుతాడు ఏర్పడతుంది.
  • మూడవ నెల (9 నుండి 12 వారాలు)
    ప్రెగ్నెన్సీ ఏర్పడిన తొమ్మిదవ వారానికి గర్భంలో ఉన్న శిశవుకు దంతాలు ఏర్పడడం మొదలవుతుంది, ఈ సమయంలో శిశువు యొక్క గుండె చప్పుడు అల్ట్రాసౌండ్ ద్వారా వినవచ్చు. పదవ వారంలో కాళ్లు మరియు చేతులకు వేళ్ళు ఏర్పడడం మొదలవుతుంది. పదకొండవ వారానికి ఎముకలు బలపడుతూ ఉంటాయి. పన్నెండవ వారానికి జీర్ణ వ్యవస్థ మరియు మూత్రవ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుంది.
  • నాలుగవ నెల (13 నుండి 16 వారాలు)
    పదమూడవ వారానికి శిశివు తల శరీరానికి తగ్గట్టు పెరగడం ప్రారంభమవుతుంది. పద్నాల్గవ వారంలో జననేంద్రియాలు ఏర్పడడం ప్రారంభమవుతుంది. పదిహేనవ వారంలో ఊపిరితిత్తులు అభివృద్ధి చెందుతాయి, పదహారవ వారంలో గర్భంలో ఉన్న శిశువు చెవులు పూర్తిగా ఏర్పడి మన మాటలను వినగలిగే స్థాయికి వస్తుంది.
  • ఐదవ నెల (17 నుండి 20 వారాలు)
    పంతొమ్మిదవ వారంలో శిశువు బలపడడం ప్రారంభమవుతుంది, గర్భంలో నుండి శిశువు కదలికలు తల్లికి తెలియవచ్చు. ఇరవైవ వారంలో గోర్లు పెరగడం మరియు మెదడు ఎదుగుదల ప్రారంభమవుతుంది.
  • ఆరవ నెల (21 నుండి 24 వారాలు)
    ఇరవై ఒకటవ వారంలో రక్తకణాలు ఏర్పడడం ప్రారంభమవుతుంది, ఇరవై నాల్గవ వారానికి శిశువు 12 అంగుళాల పొడవు ఉండవచ్చు మరియు ఇంచుమించు రెండు పౌండ్ల వరకు బరువు ఉండవచ్చు. ఈ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితిలో శిశువు జన్మిస్తే ఇంక్యుబేటర్ లో ఉంచాల్సి వస్తుంది.
  • ఏడవ నెల (25 నుండి 28 వారాలు)
    ఇరవై ఏడవ వారంలో శిశువు కనురెప్పలను మూసి తెరవగలదు, ఇరవై ఎనిమిదవ వారంలో శిశివు తలభాగం క్రిందకు తిరుగుతుంది.
  • ఎనిమిదవ నెల (29 నుండి 32 వారాలు)
    ముప్పైవ వారానికి శిశువు యొక్క మెదడు అభివృద్ధిలో వేగం పెరుగుతుంది. ముప్పై రెండు వారాలకు శిశువు డెలివరీకు సిద్ధం అవుతుంది. ఎనిమిదవ నెలలో శిశువు కాళ్ళు లేదా చేతులు ఎక్కువగా కదులుతూ ఉండడం వలన తల్లికి ఈ స్పర్శ తెలుస్తుంది.
  • తొమ్మిదవ నెల (33 నుండి 36 వారాలు)
    ముప్పై మూడవ వారంలో ఎముకలు గట్టిపడడం ప్రారంభమవుతుంది ముప్పై ఆరవ వారానికి శిశువు తలపై జుట్టు ఏర్పడుతుంది. ఏ సమయంలో అయినా డెలివరీ అయ్యే అవకాశం ఉంది.
  • పదవ నెల (37 నుండి 40 వారాలు)
    ఈ నెలలో శిశువు ఏ క్షణంలో అయినా డెలివరీ అయ్యే అవకాశం ఉంది. నలభైవ వారంలో శిశువు డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ 40వ వారం తర్వాత కూడా డెలివరీ కాకపోతే గర్భంలో శిశువు ఎదుగుదల ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ సందర్భంలో వెంటనే డాక్టర్ ను సంప్రదించి సలహా తీసుకోవాలి.

గర్భంలో శిశువు ఆరోగ్యం కోసం అవసరమైన పరీక్షలు

ప్రెగ్నెన్సీ నిర్ధారణ క్షణం నుండి గర్భంలో ఉన్న శిశువు యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి తరచుగా కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది మరియు ఏ సమయానికి చేయాల్సి ఉంటుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. గర్భంలో శిశువు ఆరోగ్యం కోసం అవసరమైన పరీక్షల జాబితా

  • అల్ట్రాసౌండ్
  • రక్తపరీక్ష
  • మూత్రపరీక్ష
  • హెపటైటిస్ బి
  • హెపటైటిస్ సి
  • NT స్కాన్
  • టీఫా స్కాన్
  • ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్

గర్భంలో శిశువు ఆరోగ్యం కోసం అల్ట్రాసౌండ్ టెస్ట్ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది?

గర్భవతి శరీరంలోని శిశివు ఆరోగ్యం తెలుసుకోవడంలో అత్యంత ముఖ్యమైన పరీక్ష అల్ట్రాసౌండ్. గర్భంలో శిశువు పెరుగుదల, పరిమాణంతో పాటుగా గర్భం దాల్చిన సమయం ఖచ్చితంగా గుర్తించడానికి అల్ట్రాసౌండ్ పరీక్ష ఉపయోగపడుతుంది. గర్భాశయంలో ఏదైనా సమస్య ఉన్నా కూడా వాటిని అల్ట్రాసౌండ్ ద్వారా గుర్తించవచ్చు. ఈ పరీక్ష మూడు నుండి నాలుగు సార్లు నిర్వహించాల్సి ఉంటుంది. గర్భం ఏర్పడిన 11 నుండి 13 వారాల సమయంలో ఒకసారి, 18 నుండి 20 వారాల సమయంలో ఒకసారి, 24 వారాల తర్వాత ఒకసారి నిర్వహించవచ్చు. శిశువు యొక్క ఎదుగుదల గురించి అవసరమైతే మరికొన్ని సందర్భాలలో కూడా ఈ పరీక్ష నిర్వహించవచ్చు.

గర్భంలో శిశువు ఆరోగ్యం కోసం NT స్కాన్ ఎప్పుడు అవసరం అవుతుంది?

NT స్కాన్ (Nuchal Translucency Scan) ను గర్భంలో శిశువు మెడ చుట్టూ ఉన్న ద్రవం యొక్క మందాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఈ పరీక్ష ద్వారా శిశువులో క్రోమోసోమ్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవడానికి NT స్కాన్ ఉపయోగపడుతుంది. గర్భం ఏర్పడిన 12 వారాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ గర్భంలో ఉన్న శిశువు అసాధారణంగా ఉంటే ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.

టీఫా స్కాన్ (TIFFA Scan) : టీఫా స్కాన్ అంటే చాలామంది అల్ట్రాసౌండ్ స్కాన్ అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండు పరీక్షలు చేసే విధానం ఒకేలా ఉండడం వలన అలా అనిపించవచ్చు కానీ టీఫా స్కాన్ మరియు అల్ట్రాసౌండ్ వేర్వేరు పరీక్షలు. ట్రాన్స్డ్యూసర్ అనే ఒక పరికరాన్ని గర్భం మీద ఉంచి శిశువు యొక్క చిత్రాలను మనం స్క్రీన్ మీద చూడవచ్చు. టీఫా స్కాన్ పరీక్ష ద్వారా శిశివు ఎదుగుదలలో ఏదైనా లోపాలు ఉంటే గుర్తించవచ్చు. గర్భం ఏర్పడిన 18 నుండి 22 వారాల సమయంలో టీఫా స్కాన్ పరీక్ష నిర్వహించవచ్చు.

రక్తపరీక్షలు : ప్రెగ్నెన్సీ సమయంలో వివిధ సందర్భాలలో రక్తపరీక్షలు అవసరం అవుతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయులు తెలుసుకోవడానికి మరియు కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC), HIV, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులను గుర్తించడానికి రక్తపరీక్ష అవసరం అవుతుంది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ సమయంలో ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ సమస్యలు శిశువుకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి వైరస్లు తల్లి నుండి శిశువుకు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంది. శిశువుకు హెపటైటిస్ వ్యాధి రాకుండా నివారించడానికి ముందుగా తల్లికి హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ తల్లికి హెపటైటిస్ ఉంటే అది శిశువుకు సోకకుండా చికిత్స అందించడం కానీ లేదా శిశువు జన్మించిన వెంటనే చికిత్స అందించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. ఈ పరీక్షలు ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయినప్పుడే నిర్వహించడం అవసరం. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భవతి హెపటైటిస్ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి, గతంలో హెపటైటిస్ తీసుకున్నప్పటికీ కూడా ఈ సమయంలో హెపటైటిస్ బూస్టర్ ఖచ్చితంగా అవసరం.

మూత్రపరీక్ష : గర్భం నిర్ధారణ అయిన తర్వాత తల్లికి మూత్రశాయ ఇన్ఫెక్షన్లు ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష అవసరం అవుతుంది.

ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్ : గర్భవతి శరీరంలో గ్లూకోజ్ ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుందో తెలుసుకోవడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా డయాబెటీస్ నిర్ధారణ మరియు డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని గ్రహించవచ్చు. డాక్టర్ సూచించిన సమయంలో ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో పరీక్షలు మరియు అత్యుత్తమ సంరక్షణ కోసం

గర్భంలో శిశువు ఆరోగ్యం కోసం తల్లి తీసుకోవాల్సిన ఆహారం

baby's-health-in-pregnancy-telugu-body 1

శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం శిశువు ఎదుగుదలలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో గర్భవతి పౌష్టికఆహారం సమయానికి తీసుకోవడం చాలా అవసరం. గర్భవతిగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

  • పండ్లు మరియు కూరగాయలు : తాజా పండ్లు మరియు ఉడికించిన కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం. తాజా పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది, అలాగే క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ వంటి వాటిలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే కూరగాయలను ఖచ్చితంగా ఉడకపెట్టి తీసుకోవడం మంచిది. పచ్చి కూరగాయలను తీసుకోవడం వలన వాటిలో ఉండే బాక్టీరియా తల్లి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారవచ్చు.
  • డ్రై ఫ్రూట్స్ : గర్భంలో శిశువు ఉన్నప్పుడు బాదాం, ఎండు ఖార్జురం, ఎండు ద్రాక్షతో పాటుగా వివిధ రకాలైన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన తల్లి మరియు శిశువుకు అవసరమైన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ప్రతీరోజూ కొద్ది మోతాదులో తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్యలు ఏర్పడకుండా నివారించవచ్చు.
  • పాలు మరియు పాల పదార్ధాలు : ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి మరియు శిశువు ఇద్దరికి కాల్షియం అవసరం అవుతుంది. పాలల్లో ఉండే కాల్షియం శిశువు ఎదుగుదలకు మరియు ఎముక దృఢత్వానికి ఉపయోగపడుతుంది. పాలు తాగే అలవాటు లేపకపోతే పనీర్ ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. సోయా పాలు కూడా తీసుకోవచ్చు.
  • ఓట్స్ మరియు మిల్లెట్స్ : చిరు ధాన్యాలు మంచి పౌష్టిక ఆహారం. గర్భధారణ సమయంలో చిరుధాన్యాలను మరియు ఓట్స్ ను ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యం బావుంటుంది.
  • గుడ్లు మరియు మాంసం : గుడ్లు మరియు చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారం ద్వారా కూడా ఐరన్ అధికంగా లభిస్తుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వలన శిశివు యొక్క ఎదుగుదల బావుంటుంది.

గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి యశోద హాస్పిటల్స్ లో ప్రత్యేకమైన డైటీషియన్ అందుబాటులో ఉన్నారు.

మీ ఆరోగ్యానికి సరైన ఆహార సూచనలు & వ్యక్తిగత సలహాల కోసం
అనుభవజ్ఞుడైన డైటీషియన్‌ను ఇప్పుడే సంప్రదించండి.

గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు?

baby's-health-in-pregnancy-telugu-body-2

పైన వివరించిన విధంగా గర్భవతిగా ఉన్న సమయంలో తీసుకునే ఆహారం శిశువు ఆరోగ్యం మరియు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని రకాలైన ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఎన్ని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

  • ఫాస్ట్ ఫుడ్స్ : ప్రస్తుతం మనకు అందుబాటులో వివిధ రకాలైన ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. గర్బవతి ఆరోగ్యానికి మరియు శిశువు ఆరోగ్యానికి ఇవి మంచివి కావు. ఇవి పోషకాహారం కాకపోగా అనేక ఆరోగ్య సమస్యలను కూడా కలగజేయవచ్చు.
  • తీపి పదార్ధాలు: ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా క్రేవింగ్స్ ఉండడం వలన తీపి పదార్ధాలు ఎక్కువగా తినాలి అనిపిస్తుంది. అయితే ఈ సమయంలో హార్మోన్ల అసమతుల్యత వలన మధుమేహం వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. కాబట్టి వీలైనంత వరకూ తీపి పదార్ధాలను తక్కువగా తీసుకోవడం మంచిది.
  • రెడ్ మీట్ : మాంసాహారంలో రెడ్ మీట్ గర్భిణీ స్త్రీలకు మంచిది కాదు. ప్రాసెస్ చేసిన లేదా చేయని రెడ్ మీట్ ఏదైనా కూడా గర్భవతులలో ఆరోగ్య సమస్యలను కలగజేయవచ్చు. ఈ కారణంగా గర్భవతులు ఈ రకమైన మీట్ కు దూరంగా ఉండడం అవసరం.
  • కూల్ డ్రింక్స్ మరియు సోడా : ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండే అనేక రకాలైన కూల్ డ్రింక్స్లో కెఫీన్ అధికంగా ఉంటుంది. కెఫీన్ వలన శిశువు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉండడమే కాకుండా శిశువు ఎదుగుదల మందగించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ మరియు సోడాలను తీసుకోకూడదు.
  • కాఫీ మరియు టీ : చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీ మరియు టీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ రెండిటిలో కూడా కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాఫీ మరియు టీ లను తీసుకోకపోవడం మంచిది.

యశోద హాస్పిటల్స్ లో అత్యంత అనుభవజ్ఞులైన ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్టులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. అంతే కాకుండా డెలివరీ సమయంలో గర్భవతి భర్త లేదా తల్లిని లేబర్ రూంలోకి అనుమతిస్తారు. తల్లి కాబోయే ప్రత్యేకమైన క్షణాల్లో మీ జీవిత భాగస్వామి పక్కనే ఉండడం మానసికంగా ధైర్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ క్షణం నుండి శిశువు జన్మించే వరకూ గర్భవతుల కోసం యశోద హాస్పిటల్స్ ప్రత్యేకమైన నవమాసం ప్యాకేజీ అందిస్తుంది. ఇప్పుడే ప్యాకేజీ బుక్ చేసుకోండి, ఉచిత కన్సల్టెన్సీతో పాటుగా స్క్రీనింగ్ టెస్ట్ ల మీద డిస్కౌంట్ కూడా పొందండి.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.

FAQ’s

గర్భవతిగా ఉన్నప్పుడు సాధారణం కంటే రెట్టింపు ఆహారం తీసుకోవాలా?

చాలామంది గర్భవతి స్త్రీలలో ఒక అపోహ ఉంది, శిశువుకు కూడా ఆహారం అందాలి కాబట్టి ఇద్దరు తినే ఆహారం తినాలని అనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. గర్భవతిగా ఉన్నప్పుడు సాధారణం కంటే 200 క్యాలరీలు ఎక్కువ కలిగిన ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది.

బొప్పాయి పండు తింటే గర్భం పోతుందా?

బొప్పాయి పండు తింటే గర్భం పోతుంది అనే దానిలో పూర్తిగా నిజం లేదు. పండిన బొప్పాయి పండు తీసుకోవడం వలన గర్భంలో ఉన్న శిశువుకు ఏమీ కాదు. కానీ పచ్చిగా ఉన్న బొప్పాయి తీసుకుంటే అందులో ఉండే రసాయనాల వలన శిశువు కు ప్రమాదం కలగవచ్చు.

గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కువగా నడవకూడదా?

గర్భవతిగా ఉన్నప్పుడు తేలికపాటి వ్యాయామం మరియు ప్రతీరోజు కొంత సమయం నడవడం వలన డెలివరీ సులభంగా అవుతుంది.