కీళ్లు పట్టేసినట్టు (జాయింట్ స్టిఫ్‌నెస్) అనిపిస్తుందా? : కారణాలు, చికిత్స మరియు జాగ్రత్తలు తెలుసుకోండి!

u003cpu003eమన రక్తంలో ప్రధానంగా నాలుగు ముఖ్య భాగాలు ఉంటాయి. ఇవి ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్. రక్తంలో ఎర్ర రక్తకణాలు 44 శాతం ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను (హేమోగ్లోబిన్ ద్వారా) సరఫరా చేస్తాయి. ఎర్ర రక్త కణాల ఆకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, వీటిని శాస్త్రీయంగా ద్విపుటాకారము (Biconcave Disk) అని అంటారు.దీనిని సరళంగా చెప్పాలంటే, ఇది గుండ్రంగా, డోనట్ ఆకారంలో ఉంటుంది, కానీ మధ్యలో రంధ్రం ఉండదు.పక్క నుండి చూసినప్పుడు, కణం యొక్క అంచులు మందంగా ఉండి, మధ్య భాగం లోపలికి నొక్కినట్లుగా ఉంటుంది.u003c/pu003enu003cpu003eస్పిరోసైటోసిస్ (Spherocytosis) అనేది ఒక రకమైన u003ca href=u0022https://www.yashodahospitals.com/te/blog/the-hemoglobin-levels-are-very-low-in-iron-deficiency-anemia/u0022u003eరక్తహీనతu003c/au003e . ఈ స్థితిలో, సాధారణంగా ద్విపుటాకారంలో ఉండాల్సిన ఎర్ర రక్త కణాలు వాటి ఆకారాన్ని కోల్పోయి, గుండ్రటి బంతిలాంటి ఆకారంలోకి మారిపోతాయి. అందుకే దీనికి స్పిరోసైటోసిస్ (స్పియర్ అంటే గోళం/బంతి) అనే పేరు వచ్చింది.u003c/pu003e
1. జాయింట్ స్టిఫ్‌నెస్ అంటే?
మన శరీరంలోని రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు కలిసే చోటునే “కీలు” (Joint) అంటారు. మనం నడవాలన్నా, వంగాలన్నా, చేతులు తిప్పాలన్నా మన శరీరం వంగాలి. అలా శరీరం వంగడానికి మరియు కదలడానికి ఈ కీళ్లు సహాయపడతాయి. కీళ్లను కదిలించడంలో ఇబ్బంది కలగడం లేదా కీళ్లు బిగుసుకుపోయినట్లు అనిపించడాన్ని కీళ్ల బిగుతు లేదా జాయింట్ స్టిఫ్ నెస్ (Joint Stiffness) అంటారు. ఇది సాధారణంగా నొప్పిని కలిగిస్తుంది మరియు మన దైనందిన పనులను ఉదాహరణకు నడవడం, కూర్చోవడం, వస్తువులను పట్టుకోవడం కష్టంగా ఉండవచ్చు.
2. జాయింట్ స్టిఫ్‌నెస్ కారణాలు
జాయింట్ స్టిఫ్‌నెస్ (Joint Stiffness) కలగడానికి కేవలం వయస్సు మాత్రమే కారణం కాదు. దీని వెనుక అనేక వైద్యపరమైన మరియు జీవనశైలి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
- ఆస్టియో ఆర్థరైటిస్ (Osteoarthritis): వయస్సు పెరగడం వల్ల ఎముకల చివర ఉండే ‘కార్టిలేజ్’ (మృదులాస్థి) అరిగిపోతుంది. దీనివల్ల ఎముకలు ఒకదానికొకటి రాసుకుని, ఉదయం పూట కీళ్లు బిగుసుకుపోతాయి.
- రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis): ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. మన శరీర రోగనిరోధక వ్యవస్థే కీళ్ల పొరలపై దాడి చేయడం వల్ల వాపు మరియు తీవ్రమైన బిగుతు ఏర్పడుతుంది. ఇది సాధారణంగా చేతి వేళ్లు, మణికట్టులో కనిపిస్తుంది.
- శారీరక శ్రమ లేకపోవడం: ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం లేదా కదలకుండా ఉండటం వల్ల కీళ్లలోని ‘సినోవియల్ ద్రవం’ (కందెన) ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల కీళ్లు బిగుసుకుపోతాయి.
- అధిక బరువు (Obesity): బరువు ఎక్కువగా ఉన్నప్పుడు మోకాళ్లు, తుంటి మరియు వెన్నెముక కీళ్లపై విపరీతమైన ఒత్తిడి పడి అవి త్వరగా దెబ్బతింటాయి.
- నిద్ర భంగిమ: రాత్రి పూట తప్పుడు భంగిమలో పడుకోవడం వల్ల కూడా ఉదయం లేవగానే మెడ లేదా నడుము కీళ్లు పట్టేసినట్లు అనిపిస్తాయి.
- బర్సైటిస్ (Bursitis): కీళ్ల మధ్య ఘర్షణ తగ్గించడానికి ‘బర్సా’ అనే ద్రవ సంచులు ఉంటాయి. ఇవి వాపుకు గురైనప్పుడు కీలు కదిలించడం కష్టమవుతుంది.
- టెండినైటిస్ (Tendinitis): కండరాలను ఎముకలతో కలిపే ‘టెండన్లు’ వాపుకు గురైనప్పుడు కీలు బిగుతుగా మారి నొప్పి వస్తుంది.
- యూరిక్ యాసిడ్ పెరగడం (Gout): రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు, అవి స్పటికాల రూపంలో కీళ్లలో (ముఖ్యంగా కాలి బొటనవేలు) చేరుతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి, బిగుతు వస్తాయి.
- లూపస్ (Lupus): ఇది కూడా ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి, ఇది శరీరంలోని వివిధ భాగాలతో పాటు కీళ్లలో వాపును కలిగిస్తుంది.
- ఫైబ్రోమైయాల్జియా: ఇది కండరాలు మరియు కీళ్లలో దీర్ఘకాలిక నొప్పిని, అలసటను కలిగిస్తుంది.
- వాతావరణ మార్పులు : చలికాలంలో లేదా వాతావరణంలో తేమ పెరిగినప్పుడు కీళ్లలోని ద్రవం కొంత చిక్కబడుతుంది. అలాగే కండరాలు కుంచించుకుపోతాయి, దీనివల్ల కీళ్ల బిగుతు సమస్య ఉన్నవారికి నొప్పి మరింత ఎక్కువగా అనిపిస్తుంది.
“ఒకవేళ కీళ్ల బిగుతు అనేది ఉదయం నిద్రలేవగానే 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండి, రోజూ ఇబ్బంది పెడుతుంటే దానిని సాధారణ సమస్యగా భావించకుండా డాక్టరును సంప్రదించాలి.”
3. జాయింట్ స్టిఫ్‌నెస్ లక్షణాలు
జాయింట్ స్టిఫ్‌నెస్ అనేది కేవలం కీళ్లు బిగుసుకుపోవడమే కాకుండా, శరీరంలో ఇతర మార్పులను కూడా కలిగిస్తుంది. దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండవచ్చు. ఆ లక్షణాలను వివరంగా ఇక్కడ చూద్దాం:
1. కదలికలో ఇబ్బంది (Reduced Range of Motion)
కీళ్ల బిగుతు ఉన్నప్పుడు మీరు గమనించే మొదటి లక్షణం ఇది.
- సాధారణంగా మనం చేయగలిగే పనులు (వంగడం, మోకాళ్లు మడచడం లేదా చేతులు పైకి ఎత్తడం) చేయడం కష్టమవుతుంది.
- కీలు పూర్తిగా సాగదీయలేనట్లు లేదా ఏదో అడ్డుపడుతున్నట్లు అనిపిస్తుంది.
2. మార్నింగ్ స్టిఫ్‌నెస్ (Morning Stiffness)
ఇది చాలా మందిలో కనిపించే ప్రధాన లక్షణం.
- ఉదయం నిద్రలేవగానే కీళ్లు ఇనుప చువ్వల్లా గట్టిగా పట్టేసినట్లు అనిపిస్తాయి.
- కీలక అంశం: ఈ బిగుతు 10-15 నిమిషాల్లో తగ్గిపోతే అది వయస్సు సంబంధిత సమస్య కావచ్చు. కానీ 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడితే అది ‘ఆర్థరైటిస్’ (కీళ్ల వాతము) సంకేతం కావచ్చు.
3. విశ్రాంతి తర్వాత బిగుతు
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చున్నప్పుడు (ఉదాహరణకు సినిమా చూస్తున్నప్పుడు లేదా ఆఫీసులో పని చేస్తున్నప్పుడు) కీళ్లు మొద్దుబారిపోతాయి. మళ్ళీ లేచి నడవడానికి ప్రయత్నించినప్పుడు కీళ్లు వెంటనే సహకరించవు.
4. కీళ్లలో శబ్దాలు రావడం
కీళ్లను కదిలించినప్పుడు లోపల ఏదో రాసుకుంటున్నట్లు ‘కటకట’ లేదా ‘చటచట’ మనే శబ్దాలు వస్తాయి. కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి (Cartilage) అరిగిపోవడం వల్ల ఎముకలు ఒకదానికొకటి తగిలి ఈ శబ్దాలు వస్తుంటాయి.
5. వాపు మరియు ఎరుపు
బిగుతుగా ఉన్న కీళ్ల వద్ద కొన్నిసార్లు వాపు కనిపిస్తుంది. ఆ ప్రాంతాన్ని తాకినప్పుడు వేడిగా అనిపించడం లేదా చర్మం ఎర్రగా మారడం వంటివి కూడా జరగవచ్చు. ఇది లోపల ఇన్‌ఫ్లమేషన్ (వాపు) ఉందని చెప్పడానికి సంకేతం.
6. నొప్పి
కీళ్ల బిగుతు ఉన్న ప్రతిసారీ నొప్పి ఉండకపోవచ్చు, కానీ చాలా సందర్భాల్లో కీలును బలవంతంగా కదిలించడానికి ప్రయత్నించినప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ముఖ్యంగా పని చేస్తున్నప్పుడు నొప్పి పెరిగి, విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది.
7. కండరాల బలహీనత
కీళ్ల బిగుతు వల్ల మనం ఆ కీళ్లను సరిగ్గా వాడము. దీనివల్ల కీళ్ల చుట్టూ ఉండే కండరాలు కాలక్రమేణా బలహీనపడతాయి. దీనివల్ల వస్తువులను పట్టుకోవడంలో పట్టు కోల్పోవడం (Grip strength తగ్గడం) వంటివి జరుగుతాయి.
జాయింట్ స్టిఫ్‌నెస్ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా !
వెంటనే మా ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించండి.
4. జాయింట్ స్టిఫ్‌నెస్ చికిత్స
కీళ్ల బిగుతు లేదా జాయింట్ స్టిఫ్‌నెస్ (Joint Stiffness) చికిత్స అనేది ఆ సమస్య రావడానికి గల కారణం మరియు దాని తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. దీనిని ప్రధానంగా మూడు పద్ధతుల్లో చేస్తారు:
1. జీవనశైలి మార్పులు మరియు ఇంటి చికిత్స
తేలికపాటి కీళ్ల బిగుతు ఉన్నప్పుడు ఇవి బాగా పనిచేస్తాయి:
- హీట్ & కోల్డ్ థెరపీ : వేడి కాపడం, రక్త ప్రసరణను పెంచి, బిగుసుకుపోయిన కండరాలను ఫ్రీ చేస్తుంది. ఉదయం పూట వచ్చే బిగుతుకు ఇది బెస్ట్. చల్లని కాపడం కీళ్లలో వాపు (Inflammation) ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ వాడటం వల్ల నొప్పి తగ్గుతుంది.
- శారీరక శ్రమ: కీళ్లను క్రమం తప్పకుండా కదిలించడం వల్ల ‘సినోవియల్ ద్రవం’ ఉత్పత్తి పెరిగి కీళ్లు ఫ్రీ అవుతాయి
- బరువు తగ్గడం: శరీర బరువు తగ్గితే కీళ్లపై (ముఖ్యంగా మోకాళ్లపై) భారం తగ్గి బిగుతు తగ్గుతుంది.
దీర్ఘకాలిక సమస్యలకు ఫిజియోథెరపీ అత్యంత ప్రభావవంతమైన మార్గం:
- స్ట్రెచింగ్ వ్యాయామాలు: కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను సాగదీయడం ద్వారా కదలికల పరిధిని (Range of Motion) పెంచుతారు.
- కండరాల బలోపేతం: కీళ్లకు సపోర్ట్ ఇచ్చే కండరాలు బలంగా ఉంటే, కీళ్లపై ఒత్తిడి పడదు.
- ఆక్యుపేషనల్ థెరపీ: రోజువారీ పనులను కీళ్లపై ఒత్తిడి పడకుండా ఎలా చేయాలో వీరు నేర్పిస్తారు.
3. మందులు
జాయింట్ స్టిఫ్‌నెస్ వ్యాయామం లేదా ఫిజియోథెరపీ ద్వారా తగ్గకపోతే డాక్టర్లు ఈ క్రింది మందులను సూచించవచ్చు:
- NSAIDs: ఇవి నొప్పిని మరియు వాపును తగ్గించే మందులు (ఉదా: Ibuprofen).
- స్టెరాయిడ్స్: వాపు ఎక్కువగా ఉన్నప్పుడు కీలు లోపలికి ఇంజెక్షన్ రూపంలో లేదా టాబ్లెట్ల రూపంలో వీటిని ఇస్తారు.
- DMARDs: ఒకవేళ జాయింట్ స్టిఫ్‌నెస్ కు కారణం ‘రుమటాయిడ్ ఆర్థరైటిస్’ అయితే, వ్యాధి తీవ్రతను తగ్గించే ప్రత్యేక మందులను ఇస్తారు.
- సప్లిమెంట్స్: కీళ్ల మధ్య ఉండే గుజ్జును రక్షించడానికి గ్లూకోసమైన్ మరియు కొండ్రోయిటిన్ వంటి సప్లిమెంట్లను కొందరు వైద్యులు సూచిస్తారు.
4. శస్త్రచికిత్స
మందులు, వ్యాయామాలు పనిచేయనంతగా కీళ్లు దెబ్బతిన్నప్పుడు చివరి ప్రయత్నంగా సర్జరీ చేస్తారు:
- ఆర్థ్రోస్కోపీ: చిన్న కోత ద్వారా కీలు లోపల పేరుకుపోయిన వ్యర్థాలను లేదా దెబ్బతిన్న మృదులాస్థిని తొలగిస్తారు.
- జాయింట్ రీప్లేస్‌మెంట్: కీలు పూర్తిగా అరిగిపోయినప్పుడు దాని స్థానంలో కృత్రిమ కీలును (Artificial Joint) అమరుస్తారు (ఉదా: మోకాలి మార్పిడి).
5. జాయింట్ స్టిఫ్‌నెస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కీళ్ల బిగుతు లేదా జాయింట్ స్టిఫ్‌నెస్ (Joint Stiffness) రాకుండా ఉండాలంటే కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం మరియు కండరాల దృఢత్వాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో కీళ్ల సమస్యలు రాకుండా ఉండటానికి ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలి:
1. శారీరక శ్రమ
కీళ్లు యంత్రాల లాంటివి, అవి ఎంత కదులుతుంటే అంత ఆరోగ్యంగా ఉంటాయి.
- రెగ్యులర్ వాకింగ్: రోజుకు కనీసం 30 నిమిషాల నడక కీళ్ల మధ్య ఉండే ద్రవం (Synovial Fluid) సజావుగా ప్రవహించేలా చేస్తుంది.
- స్ట్రెచింగ్ వ్యాయామాలు: ఉదయం నిద్రలేవగానే మరియు రాత్రి పడుకునే ముందు 5-10 నిమిషాల పాటు కీళ్లను సాగదీయడం (Stretching) అలవాటు చేసుకోవాలి.
- ఈత (Swimming): ఇది కీళ్లపై ఎటువంటి ఒత్తిడి పడకుండా పూర్తి శరీరానికి వ్యాయామం ఇచ్చే అద్భుతమైన మార్గం.
2. ఆహార నియమాలు
కీళ్ల ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది:
- ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: చేపలు, వాల్‌నట్స్ (అక్రూట్), మరియు ఫ్ల్యాక్స్ సీడ్స్ (అవిసె గింజలు) తీసుకోవడం వల్ల కీళ్ల వాపు తగ్గుతుంది.
- యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్: పసుపు, అల్లం, వెల్లుల్లి మరియు గ్రీన్ టీ కీళ్లలో వచ్చే వాపును నిరోధిస్తాయి.
- కాల్షియం & విటమిన్-D: ఎముకలు బలంగా ఉండటానికి పాలు, పెరుగు, ఆకుకూరలు మరియు తగినంత ఎండ (విటమిన్-డి కోసం) అవసరం.
- నీరు (Hydration): శరీరంలో నీరు తక్కువైతే కీళ్ల మధ్య ఉండే ద్రవం తగ్గిపోయి బిగుతు ఏర్పడుతుంది. కాబట్టి రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి.
3. సరైన భంగిమ
మనం కూర్చునే, నిలబడే విధానం కీళ్లపై ప్రభావం చూపుతుంది:
- డెస్క్ జాబ్స్ : ఆఫీసులో గంటల తరబడి కూర్చునే వారు ‘ఎర్గోనామిక్’ కుర్చీలను వాడాలి. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి 5 నిమిషాలు నడవాలి.
- నిద్ర భంగిమ: వెన్నెముక మరియు కీళ్లపై ఒత్తిడి పడకుండా ఉండేలా సరైన పరుపు మరియు తలగడను ఎంచుకోవాలి.
4. బరువు నియంత్రణ
శరీర బరువు పెరిగే కొద్దీ మోకాళ్లు మరియు తుంటి కీళ్లపై భారం పెరుగుతుంది.
- మీరు కేవలం ఒక కేజీ బరువు తగ్గినా, మీ మోకాళ్లపై దాదాపు 4 కేజీల ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి ఎత్తుకు తగ్గ బరువు (BMI) ఉండేలా చూసుకోవాలి.
5. కీళ్లకు రక్షణ
- బరువులు మోసేటప్పుడు: ఏదైనా బరువైన వస్తువును ఎత్తేటప్పుడు నడుము వంచకుండా, మోకాళ్లు వంచి ఎత్తాలి.
- సరైన పాదరక్షలు: కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే నాణ్యమైన, సౌకర్యవంతమైన చెప్పులు లేదా షూస్ వాడటం చాలా ముఖ్యం. హై హీల్స్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.
6. ధూమపానం మానుకోవడం
సిగరెట్లు తాగడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి, కీళ్లు మరియు కండరాలు దెబ్బతినే ప్రక్రియ వేగవంతం అవుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.
ఈ జాగ్రత్తలు పాటిస్తే జాయింట్ స్టిఫ్‌నెస్‌ను చాలా వరకు నివారించవచ్చు. అయితే, ఒకవేళ మీకు తరచుగా కీళ్లు పట్టేస్తున్నట్లయితే, అది ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి ఆర్థోపెడిక్ డాక్టర్ ను సంప్రదించడం అవసరం. ముందుగా డాక్టర్ ను సంప్రదించడం వలన సమస్య తీవ్రం కాకుండా ఉంటుంది.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాము! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు.




















Appointment
Call
More