Yashoda Hospitals > News > యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ ఆధ్వర్యంలో గుండె జబ్బుల చికిత్సలో వచ్చిన అత్యాధునిక చికిత్సా విధానాలపై అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సు& లైవ్ వర్క్ షాప్
యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ ఆధ్వర్యంలో గుండె జబ్బుల చికిత్సలో వచ్చిన అత్యాధునిక చికిత్సా విధానాలపై అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సు& లైవ్ వర్క్ షాప్

2రోజుల యశోద హాస్పిటల్స్ అంతర్జాతీయ గుండె జబ్బుల సదస్సు 500 మందికి పైగా కార్డియాలజీ వైద్యనిపుణులతో విజయవంతం*_
హైదరాబాద్, జూన్ 14, 2025:* అధునాతనమైన వైద్య విధానాలను అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో వుండే యశోద హాస్పిటల్స్, క్లినికల్ కార్డియాలజీలో గుండె జబ్బుల చికిత్సలో వచ్చిన అధునాతన వైద్య విధానాలు, ‘అడ్వాన్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ’ పై రెండు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు & లైవ్ వర్క్ షాప్ ను యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. ఎస్. రావు, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టులతో కలిసి ఈ రోజు యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీలో లాంఛనంగా ప్రారంభించారు. రెండు రోజుల పాటు (జూన్ 14, 15 తేదీల్లో) జరిగే ఈ అంతర్జాతీయ సదస్సు & లైవ్ వర్క్ షాప్ లో ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన సుమారు 500+ మందికి పైగా కార్డియాలజీ వైద్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి.ఎస్. రావు, మాట్లాడుతూ… “మన దేశంలో కార్డియో-వాస్కులర్ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కార్డియోవాస్కులర్ డిసీజ్ (CVD) యొక్క అత్యధిక భారం ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. భారతదేశంలో CVD నుండి వార్షిక మరణాల సంఖ్య 2.26 మిలియన్ల (1990) నుండి 4.77 మిలియన్లకు (2020) పెరిగిందని అంచనా వేయబడింది. భారతదేశంలో కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రాబల్యం రేట్లు గత కొన్ని దశాబ్దాలుగా అంచనా వేయబడ్డాయి మరియు గ్రామీణ జనాభాలో 1.6% నుండి 7.4% వరకు మరియు పట్టణ జనాభాలో 1% నుండి 13.2% వరకు పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి” అని తెలిపారు.
వైద్య నిపుణులచే బోధించబడే అత్యాధునిక ఇన్స్టిట్యూట్స్ లో ఒకటిగా ఉన్న యశోద హాస్పిటల్స్ ప్రపంచస్థాయి వైద్య విధానాలను అందించడంలో మరియు శిక్షణా కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుంది అని, ఈ అంతర్జాతీయ కార్డియాలజీ సమావేశాన్ని ప్రారంభించిన యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. జి.ఎస్. రావు తెలియజేసారు.
యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ కార్డియాలజిస్ట్ & ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్. వి. రాజశేఖర్, మాట్లాడుతూ “యశోద హాస్పిటల్స్ ఈ రెండు రోజుల అంతర్జాతీయ సమావేశం ‘అడ్వాన్స్‌డ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ’ లో భాగంగా ఇక్కడి కార్డియాలజిస్ట్ లకు ఉన్నతస్థాయి శిక్షణ ఇచ్చేందుకు గాను యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ లోని ఇంట్రవెన్షనల్ కార్డియాలజీ విభాగం దీనిని ఏర్పాటుచేసింది. ఈ సదస్సు లో జాతీయ మరియు అంతర్జాతీయ ప్రధాన కార్డియాలజిస్ట్ లు కార్డియాలజీ వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విజ్ఞానం మరియు చికిత్సా విధానాలను వారు వివరించారు. ముఖ్యంగా గుండె అడ్డంకులను తొలగించడానికి ఇంట్రా వాస్కులర్ ఇమేజింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలు లేజర్ సహాయంతో యాంజియోప్లాస్టీ, యాంజియోప్లాస్టీ సమయంలో ప్లేక్ సవరణ కోసం రోటాబ్లేషన్ మరియు ఆర్బిటల్ అథెరెక్టమీ వంటి సాధనాలను ఎలా ఉపయోగించాలో ఈ అంతర్జాతీయ సదస్సు & లైవ్ వర్క్ షాప్ లో నిపుణులు వివరించారు. TAVR విధానం ద్వారా గుండె కవాటాలను శస్త్రచికిత్స లేకుండా మార్చడంలో అందుబాటులోకి వచ్చిన పురోగతి మరియు ప్రత్యేక క్లిప్‌లతో మరమ్మత్తు లేదా మిట్రల్ వాల్వ్ వంటి అధునాతన గుండె చికిత్సా వైద్య విధానాలను నిపుణులైన జాతీయ మరియు అంతర్జాతీయ ప్రధాన కార్దియలజిస్ట్ లు ఇక్కడ వివరించారు” అన్నారు.
For further information, please contact Mr. Sampath on 78930 53355 / 88971 96669
Appointment
WhatsApp
Call
More