Select Page

“హై రిస్క్ ప్రెగ్నెన్సీ” పై జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ ను విజయవంతంగా నిర్వహించిన యశోద హాస్పిటల్స్

500 మందికి పైగా గైనకాలజిస్టులు, సర్జన్లతో జాతీయ “గైనకాలజీ”కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ విజయవంతం

హైదరాబాద్, జూన్ 8, 2025: యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం ఆధ్వర్యంలో “హై రిస్క్ గర్భధారణ”పై జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్” నిర్వహించారు. ఈ జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ లో ‘హై రిస్క్ ప్రెగ్నెన్సీ’, గైనకాలజీ వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య విధానాలను దేశంలోనే ప్రసిద్ధ జాతీయ గైనకాలజీ వైద్య నిపుణులతో లైవ్ వర్క్ షాప్ & ఇంటరాక్టివ్ శిక్షణా సెషన్స్ నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ “కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్”లో దేశం నలుమూలల నుండి వచ్చిన 500 మందికి పైగా గైనకాలజిస్ట్‌లు మరియు సర్జన్లు పాల్గొన్నారు.

“ఈ కార్యక్రమంలో విభిన్న వైద్య విభాగాల నుండి అనుభవజ్ఞులైన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని, హై రిస్క్ ప్రెగ్నెన్సీ నిర్వహణలో ఇబ్బందులను అధిగమిస్తూ, నూతన మార్గదర్శకాలు ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా మరింత సులభంగా మరియు ఖచ్చితత్వంతో ఎలా నిర్వహించాలో వారి అనుభవాలను ఈ జాతీయ సదస్సులో పంచుకున్నారు. “ప్రసూతి సవాళ్లను అధిగమించి ప్రాణాలను నిలబెట్టడం” అనే అంశంపై జరిగిన ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్, ప్రసూతి ఫలితాలను ఆప్టిమైజ్ చేయడంలో ఐసియు మద్దతు మరియు పెరిపార్టమ్ అనస్థీషియా యొక్క పాత్ర కీలకం” అని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి తెలియజేసారు.

యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్. కృష్ణవేణి నాయిని, మాట్లాడుతూ “ హై రిస్క్ ప్రెగ్నెన్సీ పై జరిగిన ఈ “అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్” లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ లో క్లిష్టమైన అంశాలపై లోతైన చర్చ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజీ వైద్య నిపుణులు, గర్భధారణ ట్రోఫోబ్లాస్టిక్ వ్యాధి, గర్భధారణలో రుమటలాజికల్ మరియు ఎండోక్రైన్ రుగ్మతలు, ప్రసూతి సమయంలో అత్యవసర పరిస్థితులు, గుండె సమస్యలు మరియు మరిన్నింటితో సహా విస్తృత శ్రేణి క్లిష్టమైన అంశాలపై తల్లీ-బిడ్డలను సురక్షితంగా ఎలా కాపాడాలి అనే అంశాలపై లోతైన సెషన్‌లను నిర్వహించామన్నారు. దీనికి అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలతో సమగ్రమైన సహకారం-సమన్వయం చాలా అవసరమని,పెరుగుతున్న ప్రసూతి మరణాలు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కారణంగా ఏర్పడిన ఇతర అనారోగ్యాలకు, అత్యంత క్లిష్టమైన గర్భధారణ సమయాల్లో తల్లీ-బిడ్డలను క్షేమంగా కాపాడటంలో ఈ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ ఎంతో తోడ్పడుతాయనీ” డాక్టర్. కృష్ణవేణి నాయిని, తెలిపారు.

For further information, please get in touch with Mr. Sampath on 78930 53355 / 88971 96669