Yashoda Hospitals > News > ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రమాదవశాత్తూ పారాక్వాట్ పాయిజన్ (విషపూరితమైన కలుపు మందు) తాగిన అతి చిన్న వయసు వ్యక్తికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన యశోద హాస్పిటల్స్
ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రమాదవశాత్తూ పారాక్వాట్ పాయిజన్ (విషపూరితమైన కలుపు మందు) తాగిన అతి చిన్న వయసు వ్యక్తికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన యశోద హాస్పిటల్స్

తీవ్ర ప్రాణాపాయంలో ఉన్న 12 ఏళ్ల బాలుడు అనురాగ్ సందీప్ కు “బైలాటరల్ లోబార్ లాంగ్ ట్రాన్స్ ప్లాంట్”తో సరికొత్త జీవితాన్ని అందించి, ప్రపంచంలోనే అరుదైన ‘డబుల్ లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్’తో చరిత్ర సృష్టించిన యశోద హాస్పిటల్స్
హైదరాబాద్, నవంబర్ 18, 2025: ప్రపంచ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ వైద్య చరిత్రలో యశోద హాస్పిటల్స్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అవయవమార్పిడి ఆపరేషన్ల(ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్స్)తో దేశంలోనే ముందున్న యశోద హాస్పిటల్స్ ఇప్పుడు ప్రమాదవశాత్తూ పారాక్వాట్ పాయిజన్ (విషపూరితమైన కలుపు మందు) తాగిన అతి చిన్న వయసు కలిగిన బాలుడికి ప్రపంచంలోనే మొదటిసారిగా విజయవంతంగా (బైలాటరల్ లోబార్ లాంగ్ ట్రాన్స్ ప్లాంట్) ఊపిరితిత్తుల మార్పిడి చేసి సరికొత్త చరిత్ర నృష్టించింది. పెద్దపల్లి జిల్లా, ఓదెల గ్రామానికి చెందిన రైతు సతీష్ కుమార్, సుమలతల కొడుకు ఆరవ తరగతి చదువుతున్న 12 ఏళ్ల అనురాగ్ సందీప్ ప్రమాదవశాత్తూ పారాక్వాట్ పాయిజన్ తాగి ప్రాణాపాయస్థితిలో ఉన్న అనురాగ్ సందీప్ కు యశోద హాస్పిటల్స్ విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడిని నిర్వహించి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఇది ప్రపంచంలోనే విషం (పురుగు మందు) తాగిన అతి పిన్న వయస్కుడికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చేసిన మెట్టమొదటి కేస్.
ఈ సందర్బంగా యశోద హాస్పిటల్స్, డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి , మాట్లాడుతూ.. “పెద్దపల్లి జిల్లా, ఓదెల గ్రామానికి చెందిన రైతు సతీష్ కుమార్, సుమలతల కొడుకు ఆరవ తరగతి చదువుతున్న 12 ఏళ్ల అనురాగ్ సందీప్ మార్చ్15,2025న ప్రమాదవశాత్తూ పారాక్వాట్ పాయిజన్(విషపూరితమైన కలుపు మందు) తాగి హైదరాబాద్ లోని ఒక స్థానిక హాస్పిటల్ లో చేరాడు. “పారాక్వాట్” అనే ఒక విష రసాయనం సేవించడం వల్ల బాలుడు అనురాగ్ సందీప్ ఊపిరితిత్తులు, కాలేయం మరియు మూత్రపిండాలతో సహా బహుళ అవయవాలు పనిచేయకపోవటంతో మెరుగైన వైద్యం కోసం ఏప్రిల్ 21, 2025న ప్రాణాపాయస్థితిలో యశోద హాస్పిటల్-సోమాజిగూడకు రావడం జరిగింది. పారాక్వాట్ విషకణాలు చురుకుగా ఊపిరితిత్తులను చేరడం ద్వారా ఫలితంగా కోలుకోలేని పల్మనరీ ఫైబ్రోసిస్ ఏర్పడింది. మా అనుభవజ్ఞులైన క్రిటికల్ కేర్ వైద్య బృందం పర్యవేక్షణలో అతను 2 వారాల పాటు ఎక్మో మద్దతు పొందినప్పటికీ అతనిలో ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో ఊపిరితిత్తుల మార్పిడిని మా వైద్య బృందం సూచించారు.
యశోద హాస్పిటల్స్ ఊపిరితిత్తుల వైద్య నిపుణుల బృందం – డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్, డాక్టర్ చేతన్ రావు, డాక్టర్ పంక్తి శేత్, డాక్టర్ రమ్య రెడ్డి మరియు ఊపిరితిత్తుల మార్పిడి సర్జన్లు డాక్టర్. కె.ఆర్. బాలసుబ్రమణియన్, డాక్టర్. మంజునాథ్ బేల్ చేత “బైలాటరల్ లోబార్ లాంగ్ ట్రాన్స్ ప్లాంట్” యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో అతి పిన్న వయస్కుడికి ఊపిరితిత్తుల మార్పిడి ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిదని అన్నారు. తీవ్ర ప్రాణాపాయంలో ఉన్న 12 ఏళ్ల మాస్టర్ అనురాగ్ సందీప్ కు “బైలాటరల్ లోబార్ లాంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్”తో సరికొత్త జీవితాన్ని అందించడంద్వారా ప్రపంచ వైద్యరంగం-ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ రంగంలో చరిత్ర సృష్టించడం మన తెలుగు రాష్టాలకు ఎంతో గర్వకారణం అని”, యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి , తెలిపారు.
సోమాజిగూడ యశోద హాస్పిటల్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్. విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్ , మాట్లాడుతూ.. “ప్రాణాపాయస్థితిలో మా దగ్గరకు వచ్చిన మాస్టర్ అనురాగ్ సందీప్ కు వెంటనే అధిక ప్రవాహ ఆక్సిజన్ చికిత్స, ద్వితీయ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చికిత్సకు తగిన యాంటీబయాటిక్స్ ఇవ్వబడ్డాయి. ఇచ్చిన చికిత్సతో, అతని కాలేయం, మూత్రపిండాలు క్రమంగా సాధారణ స్థాయికి తిరిగి వచ్చాయి. మెకానికల్ వెంటిలేటర్‌పై వైద్యం అందించి, ఆ తర్వాత అదనపు కార్పోరల్ సపోర్ట్ (ECMO)కి మార్చడం జరిగింది. అతను 2 వారాల పాటు ఎక్మో మద్దతు పొందినప్పటికీ అతనిలో ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో ఊపిరితిత్తుల మార్పిడి కోసం పరిగణించబడ్డాడు.
కుటుంబ సభ్యులతో వివరణాత్మక, విస్తృతమైన కౌన్సెలింగ్ తర్వాత, రోగిని అత్యవసరంగా ఊపిరితిత్తుల మార్పిడి కోసం జాబితా చేయబడింది. తెలంగాణ స్టేట్ “జీవన్ దాన్” సంస్థ అవయవ దానం చొరవలో భాగంగా బ్రెయిన్ డెడ్ అయిన రోగి (దాత) నుండి సేకరించిన ఊపిరితిత్తులను విజయవంతంగా ట్రాన్స్ ప్లాంట్ చేయడం జరిగింది. పిల్లలలో ద్వైపాక్షిక లోబార్ మార్పిడి చేయడం అనేది అసాధారణంగా సంక్లిష్టమైన మరియు అరుదైన ప్రక్రియ, దీనికి ఖచ్చితమైన, నైపుణ్యం అవసరం. దాత నుండి సేకరించిన ఊపిరితిత్తులను 12 ఏళ్ల రోగికి సరిపోయే విధంగా అదనపు భాగాన్ని ఎంతో ఖచ్చితత్వంతో తొలగించి ట్రాన్స్ ప్లాంట్ చేయవలసి ఉంటుంది అందుకోసం యశోద హాస్పిటల్స్ యొక్క బహుళ విభాగ సమర్థులైన మార్పిడి వైద్య బృందం చేతుల్లో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది.
స్థిరమైన పరిస్థితిలో మాస్టర్ అనురాగ్ సందీప్ ను ఐ.సి.యు.కు తరలించి, శస్త్రచికిత్స పూర్తయ్యే సరికే ఊపిరితిత్తులు పనిచేయటం ప్రారంభించినప్పటికీ మరో 24 గంటల పాటు వెంటిలేటర్ సాయం అందించి, తరువాత కోలుకుంటున్న స్థితిలో రెండు వారాల పాటు ఐ.సి.యు లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఆపైన ఆస్పత్రిలోని గదికి మార్చాం. యశోద హాస్పిటల్స్ లో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు మరియు నిపుణులైన వైద్య బృందం 24 గంటల పర్యవేక్షణతో చాలా తక్కువ సమయంలో అద్భుతమైన రికవరీ సాధించి మాస్టర్ అనురాగ్ సందీప్ ను హాస్పిటల్ నుండి విజయవంతంగా డిశ్చార్జ్ చేయగలిగామని” యశోద హాస్పిటల్స్- సోమాజిగూడ, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్. విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్ తెలియజేసారు.
For further information, please contact Mr. Sampath on 78930 53355 / 88971 96669
PR News Coverage Source:
Video Insights:
Appointment
WhatsApp
Call
More