Yashoda Hospitals > News > కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధిగ్రస్తులకు మూత్రపిండాల మార్పిడితో సరి ‘కొత్త’ జీవితం
కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధిగ్రస్తులకు మూత్రపిండాల మార్పిడితో సరి ‘కొత్త’ జీవితం

యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీలో 36 నెలల్లోనే విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సతో పునర్జన్మ పొందిన 300+ మంది పేషెంట్ల ఆత్మీయసమ్మేళనం
ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ
హైదరాబాద్, అక్టోబర్ 13, 2025: భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల భారం నానాటికి పెరుగుతోంది, దేశంలో ప్రతి 10 మంది పెద్దవాళ్లలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా వేయబడింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 6 లక్షల మంది కొత్త కిడ్నీ రోగులు డయాలసిస్ దశకు చేరుకుంటున్నారు, వీరిలో కేవలం ఇరవై-ముప్పై వేల మంది రోగులకు మాత్రమే కిడ్నీ మార్పిడి అందించబడుతుంది. మిగిలిన వారు డయాలసిస్ లో ఉండి, కిడ్నీ మార్పిడి కోసం వేచి చూస్తున్నారు. యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ కేవలం 36 నెలల్లో 300 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ ని విజయవంతంగా పూర్తిచేసిన సందర్భంగా ఈ విశేషమైన విజయాన్ని సాధ్యం చేసిన అవయవ దాతలు, అవయవ గ్రహీతలు, నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు మరియు సహాయక సిబ్బందితో కూడిన అత్యంత నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞుల వైద్య బృందన్ని గౌరవించడంకోసం ఏర్పాటు చేసిన “సన్మాన కార్యక్రం” ఈరోజు యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ పాల్గొని అవయవ దాతలను, అవయవ గ్రహీతలను, ఇంతటి మైలురాయిని సాధ్యం చేసిన యశోద హాస్పిటల్స్ వైద్యులను ఆయన అభినందించారు.
ఈ సందర్బంగా యశోద హాస్పిటల్స్ గ్రూప్, మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. యస్. రావు , మాట్లాడుతూ… ఎ లెగసీ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్, కిడ్నీ మార్పిడి కోసం భారతదేశంలోని ప్రముఖ కేంద్రాలలో ఒకటిగా యశోద హాస్పిటల్స్ నిలిచింది. మా అన్ని యూనిట్లలో ఇప్పటివరకు 3,500కి పైగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ ను చేయగా, ఒక్క హైటెక్ సిటీ యూనిట్ లో మాత్రమే కేవలం 36 నెలల్లో 300 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ మైలురాయిని చేరుకోవడం ఇది క్లినికల్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్ మరియు కారుణ్య రోగుల సంరక్షణకు మా హాస్పిటల్స్ నిబద్ధతలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది అని అన్నారు.
ప్రతి అవయవ మార్పిడి అనేది కేవలం వైద్యపరమైన విజయం మాత్రమే కాదు, అది ఒక ప్రాణాన్ని కాపాడటం, దాతకు జీవితకాలం ఇవ్వడం, మరియు కుటుంబాలకు ఆశ కల్పించే మానవీయ ప్రక్రియ. ఇది ఆశ, భయం కలయికతో కూడిన ప్రయాణం, ఇది అవయవ దానం చుట్టూ ఉన్న అపోహలను తొలగించి, నైతికతను ప్రతిబింబిస్తుంది. ఈ మైలురాయి CRRT ఇన్‌కార్పొరేటెడ్ అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా ICU (నిరంతర మూత్రపిండ పునఃస్థాపన చికిత్స)లో RRTలో అత్యుత్తమ సెంటర్‌గా యశోద హాస్పిటల్స్ యొక్క హైటెక్ సిటీని గుర్తించడంతో పాటు, క్రిటికల్ కేర్ నెఫ్రాలజీలో గ్లోబల్ లీడర్‌గా దాని స్థానాన్ని పునరుద్ఘాటించిందని, *డాక్టర్. జి. యస్. రావు* తెలిపారు.
యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ నెఫ్రాలజిస్ట్ & కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్. రాజశేఖర చక్రవర్తి, మాట్లాడుతూ.. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) జనాభాలో 20% కంటే ఎక్కువ మందిలో CKD “క్రానిక్ కిడ్నీ డిసీజ్” ప్రాబల్యం పెరుగుతున్నట్లు నివేదికలు చెప్తున్నయన్నారు. తీవ్రమైన కిడ్నీ గాయం నుండి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి పురోగతిని నివారించడానికి ముందస్తుగా గుర్తించడం, నివారణ వ్యూహాలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్. రాజశేఖర చక్రవర్తి, నొక్కి వక్కాణించారు.
ఈ మొత్తం 300 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ లో 225 మంది పురుషులు, 75 మంది స్త్రీ గ్రహీతలు ఉన్నారు. వీరికి 121 మంది పురుషులు, 179 మంది మహిళా దాతల నుండి సేకరించిన కిడ్నీలను ట్రాన్స్ ప్లాంట్ చేయడం జరిగింది. ఇందులో 68 మంది అంతర్జాతీయ రోగులు మూత్రపిండ మార్పిడిని పొందారు. 57 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్లు (60-83) సంవత్సరాల వయస్సు గల వృద్ధ దాతల నుండి సేకరించిన కిడ్నీలను విజయవంతంగా ట్రాన్స్ ప్లాంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 33 మందికి ABO-అనుకూల మార్పిడి విజయవంతంగా నిర్వహించబడింది (ABO-అనుకూల అనగా, దాత మరియు గ్రహీత రక్త రకాలు వేర్వేరుగా ఉన్నపటికీ అవయవ మార్పిడి విజయవంతంగా నిర్వహించబడుతోంది). ఈ 300 కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ లో 16 మందికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్లు జీవన్ దాన్ సమన్వయంతో వివిధ హాస్పిటల్స్ లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుండి సేకరించిన కిడ్నీలను విజయవంతంగా ట్రాన్స్ ప్లాంట్ చేయడం జరిగింది. ప్రతి రోగికి ప్రపంచ స్థాయి మూత్రపిండ మార్పిడి సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి మరియు అవయవ మార్పిడి రంగంలో హద్దులను కొనసాగించడానికి మా లక్ష్యంలో మేము స్థిరంగా ఉన్నాము, అని డాక్టర్. రాజశేఖర చక్రవర్తి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ నెఫ్రాలజీ వైద్యులు డాక్టర్. పి. విజయ్ వర్మ, డాక్టర్. మహేష్ కోట, డాక్టర్. మురళీనాథ్ వుక్కదల యూరాలజీ వైద్యులు డాక్టర్. గుత్తా శ్రీనివాస్, డాక్టర్. ఎన్. మల్లికార్జున్ రెడ్డి మరియు కిడ్నీ మార్పిడి గ్రహీతలు, కిడ్నీ దాతలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
మరింత సమాచారం కోసం సంపత్ గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్లు : 78930 53355 / 88971 96669
Appointment
WhatsApp
Call
More