Yashoda Hospitals > News > యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ లో అత్యాధునిక రోబోటిక్ సర్జరీలపై “గైనిక్ రోబోకాన్ 2025” జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్
యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ లో అత్యాధునిక రోబోటిక్ సర్జరీలపై “గైనిక్ రోబోకాన్ 2025” జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్

500 మందికి పైగా గైనకాలజిస్టులు, సర్జన్లతో జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ విజయవంతం
హైదరాబాద్, ఆగస్టు 31, 2025: హైదరాబాద్ ప్రసూతి మరియు గైనకాలజికల్ సొసైటీ (OGSH) సహకారంతో యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం, డాక్టర్. అనిత కున్నయ్య నేతృత్వంలో గైనకాలజీ వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక రోబోటిక్ వైద్య విధానాలను జాతీయ గైనకాలజీ వైద్య నిపుణులతో లైవ్ వర్క్ షాప్ & ఇంటరాక్టివ్ శిక్షణా సెషన్స్ ను “గైనిక్ రోబోకాన్ 2025” పేరిట నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్‌షాప్‌లో హైదరాబాద్ ప్రసూతి మరియు గైనకాలజికల్ సొసైటీ (OGSH) గత అధ్యక్షురాలు డాక్టర్. ఎస్. శాంత కుమారి (కోశాధికారి, FIGO) మరియు OGSH అధ్యక్షురాలు డాక్టర్. జయంతి రెడ్డి తో పాటుగా ప్రముఖ అంతర్జాతీయ అధ్యాపకులు డాక్టర్. పీటర్ సి. లిమ్, మెడికల్ డైరెక్టర్, రోబోటిక్ సర్జరీ సెంటర్ ఆఫ్ హోప్, నెవాడా, USA, డాక్టర్. మహేంద్ర భండారి, CEO, వట్టికూటి ఫౌండేషన్ మరియు భారతదేశంలో రోబోటిక్ సర్జరీకి మార్గదర్శకులు, దేశం నలుమూలల నుండి వచ్చిన 500 మందికి పైగా గైనకాలజిస్ట్‌లు మరియు సర్జన్లు పాల్గొన్నారు.
యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్. అనిత కున్నయ్య, మాట్లాడుతూ… ఈ జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్‌షాప్‌లో గైనకాలజీ వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక రోబోటిక్ వైద్య విధానాలు , క్లిష్టమైన అంశాలపై లోతైన చర్చ జరిగిందన్నారు. రోబోటిక్ సర్జరీలు, సర్జన్లను భర్తీ చేయడానికి రుపొందించబడినవి కాదని, వారి సామర్థ్యాలను పెంపొందించడానికి, మరింత మెరుగుపరచడానికి రుపొందించినవి అని అన్నారు. 3D హై-డెఫినిషన్ దృష్టి, శస్త్రచికిత్సా ప్రక్రియల సమయంలో చేతి వణుకు వంటి అనాలోచిత కదలికలను తొలగించడానికి రోబోటిక్ సర్జరీలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన రోబోటిక్-సహాయక శస్త్రచికిత్సలు.. శస్త్రచికిత్స సమయంలో సాటిలేని ఖచ్చితత్వం, స్థిరత్వాన్ని పెంపొందించడానికి, సర్జన్లు సర్జరీ సమయంలో సున్నితమైన పనులను ఎక్కువ నియంత్రణతో నిర్వహించడానికి ఉపయోగపడుతున్నాయన్నారు. గైనకాలజీ వైద్య రంగంలో, పెద్ద గర్భాశయం, మైయోమెక్టమీ, సంతానోత్పత్తిని పెంచే విధానాలు, ఎండోమెట్రియోసిస్ మరియు సంక్లిష్టమైన అడెనోమైయోసిస్ వంటి శస్త్రచికిత్సలను నిర్వహించడంలో రోబోటిక్-సహాయక శస్త్రచికిత్సలు ఎంతో అభివృద్ధి చెంది మెరుగైన జీవన నాణ్యతను మెరుగుపరిచాయని డాక్టర్. అనిత కున్నయ్య తెలియజేసారు.
ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్, డాక్టర్. ఎ. లింగయ్య, మాట్లాడుతూ.. “రోబోటిక్ సర్జరీ” గత దశాబ్ద కాలంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికీ భారతదేశంలోని కొన్ని వైద్య కేంద్రాలలో మాత్రమే రోబోటిక్ సర్జరీల ప్రాక్టీస్ అందుబాటులో ఉన్నాయన్నారు. గైనిక్ సర్జరీలో భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న వైద్య విధానాలపై ఈ “గైనిక్ రోబోకాన్ 2025” జాతీయ రోబోటిక్ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్‌షాప్‌లో చర్చకు వచినట్లు డాక్టర్. ఎ. లింగయ్య తెలిపారు.
మరింత సమాచారం కోసం సంపత్ గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్లు : 78930 53355 / 88971 96669
Appointment
WhatsApp
Call
More