Select Page

యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ ఆధ్యర్యంలో 500 మందికి పైగా స్పైన్ సర్జన్లతో “యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ స్పైన్ సర్జరీల” పై రెండు రోజుల అంతర్జాతీయ గ్లోబల్ యు. బి. ఇ. కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ విజయవంతం

unilateral-biportal-endoscopy-spine-surgery-telugu
unilateral-biportal-endoscopy-spine-surgery-telugu

ముఖ్య అతిధిగా పాల్గొన్న సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ & భారత బ్యాడ్మింటన్ కోచ్ పద్మశ్రీ పుల్లెల గోపీచంద్  

హైదరాబాద్, డిసెంబర్ 6, 2025: యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ ఆధ్వర్యంలో “యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ” ‌పై (డిసెంబర్ 5 & 6 తేదీల్లో)  2 రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ రెండు రోజుల సదస్సు & లైవ్ వర్క్ షాప్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు& ఇండియన్ కోచ్ పద్మశ్రీ పుల్లెల గోపీచంద్, యశోద హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. యస్. రావు‌ తో కలిసి సదస్సును  ప్రారంభించారు.

ఈ సందర్బంగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు & ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ పద్మశ్రీ పుల్లెల గోపీచంద్, మాట్లాడుతూ… భారతదేశంలో ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజురీస్ (క్రీడల వల్ల ఏర్పడే గాయాలు) చాలా తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. క్రీడా గాయాలు, వెన్నెముక సమస్యలు, ముఖ్యంగా నడుము నొప్పి (LBP), భారతీయ అథ్లెట్లలో చాలా సాధారణం అన్నారు. క్రీడలలో శ్రేష్ఠతను పెంపొందించడానికి ఖచ్చితత్వం, నైపుణ్యం మరియు నిరంతర అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు . ఈ యశోదా హాస్పిటల్ గ్లోబల్ UBE కాన్-2025 ప్రపంచ స్థాయి క్రీడలలో కనిపించే అదే క్రమశిక్షణ మరియు ఆవిష్కరణ స్ఫూర్తిని సూచిస్తుందనీ, సర్జన్లకు స్ఫూర్తినిచ్చే ఇలాంటి కార్యక్రమంలో నేను భాగం కావడం నాకు ఎంతో గౌరవంగా ఉందని, పుల్లెల గోపీచంద్ అన్నారు. 

యశోద గ్రూప్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి. యస్. రావు , మాట్లాడుతూ..  మినిమల్లీ ఇన్వాసివ్ & ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ వైద్య విభాగం ఇప్పుడు ఎంతో అత్యాధునికతను సంతరించుకుంటూ, రోజు రోజుకూ తన పరిధిని విస్తరించుకుంటున్నదన్నారు. వైద్య విజ్ఞాన శాస్త్రంలో చోటుచేసుకుంటున్న సరికొత్త ఆవిష్కరణలపై దృష్టిసారించేoదుకు, ఈ గ్లోబల్ యు.బి.ఇ. కాన్-2025 ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. వివిధ దేశాల వైద్య నిపుణులతో, మన వైద్యులు తమ వైద్య విజ్ఞానాన్ని పంచుకోవడానికి, పెంపొందించుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన వేదికగా నిలిచిందని అన్నారు. గ్లోబల్ యు.బి.ఇ. కాన్-2025ను నిర్వహించడం ద్వారా క్లినికల్ ఎక్సలెన్స్, సర్జికల్ ఇన్నోవేషన్ మరియు గ్లోబల్ మెడికల్ ఎడ్యుకేషన్ ‌ను అభివృద్ధి చేయడంలోనూ, తెలుగు ప్రజలకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలు అందించడంలోనూ యశోద హాస్పిటల్స్ నిబద్ధతను తెలియజేశారు. UBE (యూనిలేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ) మరియు ఇతర అధునాతన మినిమల్లీ ఇన్వాసివ్, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ విధానాలలో తన అసాధారణ నైపుణ్యానికి గుర్తింపు పొందిన డాక్టర్. బాలరాజశేఖర్ చంద్ర, అద్భుతమైన ఫలితాలతో వేలాది సంక్లిష్ట వెన్నెముక శస్త్రచికిత్సలు చేశారనీ, ఆయన మార్గదర్శక కృషి ఆయనను ప్రపంచ వెన్నెముక శస్త్రచికిత్స సమాజంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరిగా నిలిపిందని, డాక్టర్. జి. యస్. రావు  తెలియజేసారు.

 యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, సీనియర్ న్యూరో & ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ డాక్టర్. బాలరాజశేఖర్ చంద్ర మాట్లాడుతూ.. “గ్లోబల్ యు.బి.ఇ. కాన్-2025 అనేది కేవలం ఒక సమావేశం కాదు! ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న  రోగులకు మినిమల్లీ ఇన్వాసివ్ & ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్సను ఖచ్చితమైనదిగా, సురక్షితమైనదిగా అందుబాటులోకి తీసుకురావడానికి ఒక వేదిక అని తెలిపారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యాధునిక ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ విధానంతో రోగులకు అతితక్కువ కోత, అత్యంత తక్కువ హాస్పిటల్ స్టే, అతి తొందరగా & అత్యంత సురక్షితంగా రోగి కోలుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువ అయ్యాయని తెలిపారు.

ఈ రెండు రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ & లైవ్ వర్క్ షాప్ ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ వైద్య నిపుణుల సమక్షంలో ఆచరణాత్మక, పరిశీలన ఆధారిత అభ్యాసం ద్వారా  ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్స నైపుణ్యాలను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ముఖ్యమైనవి లైవ్ ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్సలు,  హ్యాండ్స్-ఆన్ శిక్షణ వర్క్‌షాప్, నమూనా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ శిక్షణా సెషన్‌లు మరియు కేసు ఆధారిత చర్చలు అత్యంత అధునాతన నైపుణ్యాలతో సర్జన్లను శక్తివంతం చేయడం మరియు ఎండోస్కోపిక్ వెన్నెముక శస్త్రచికిత్స యొక్క భవిష్యత్తును రూపొందించడం మా లక్ష్యం” అని డాక్టర్. బాలరాజశేఖర్ చంద్ర అన్నారు.

For further information, please contact Mr. Sampath on 78930 53355 / 88971 96669

Photos