Vascular Surgery

డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌(Deep Vein Thrombosis)

సిరల్లో రక్తం గడ్డలు (క్లాట్స్‌) ఏర్పడడాన్నే డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ (Deep Vein Thrombosis) లేదా డివిటి(DVT) అంటారు. వయసు పెరిగిన వాళ్లకు, ఏదైనా సర్జరీ చేయించుకున్న తరువాత, రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు, క్యాన్సర్‌ పేషెంట్లలో ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కొందరిలో చిన్న వయసులో కూడా డివిటి రావొచ్చు. ఇందుకు కారణం జన్యుపరమైనది. జన్యులోపం వల్ల రక్తంలోని క్లాటింగ్‌ ఫ్యాక్టర్లు (రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే కారకాలు) ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో గడ్డలు ఏర్పడే సమస్య ఉంటుంది. ఇలాంటివాళ్లలో కూడా డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ కనిపిస్తుంది. 

లక్షణాలు

ఆరోజు రాత్రి బాగానే ఉంటారు. తెల్లవారి లేచి చూసేసరికి కాలు అంతా వాచిపోయి కనిపిస్తుంది. వాపుతో పాటు నొప్పి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. సాధారణంగా మోకాలి కింద ఇలాంటి సమస్య వస్తుంది. అయితే కాలు మొత్తం లేదా చేతిలో కూడా ఇలా వాపు రావొచ్చు. ఇలా అకస్మాత్తుగా వాపు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఎందుకంటే కొన్నిసార్లు లోపల ఏర్పడిన గడ్డ (క్లాట్‌) హఠాత్తుగా చిట్లిపోవచ్చు. అలా బ్రేక్‌ అయిన గడ్డలు ఊపిరితిత్తులకు చేరి లంగ్‌ అటాక్‌ (lung attack) రావొచ్చు. దీన్నే లంగ్‌ ఎంబోలిజమ్‌(lung embolism) అంటారు. ఇది అత్యవసర పరిస్థితి. కాబట్టి ఈ సమస్యను అశ్రద్ధ చేయొద్దు. ఇలా సడెన్‌గా కనిపించే సమస్యను acute dvtగా పరిగణిస్తారు. అక్యూట్‌ డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌ని నిర్లక్ష్యం చేస్తే chronic dvtకి దారితీస్తుంది. దీనివల్ల అల్సర్లు ఏర్పడుతాయి. ఈ పుండ్లు మానకుండా ఎక్కువ అవుతాయి. డివిటిని నిర్లక్ష్యం చేసిన వాళ్లలో కాలు వాపు, నొప్పితో పాటు ఇలా మానని పుండ్లు ఏర్పడితే ఆ స్థితిని పోస్ట్‌ థ్రాంబోటిక్‌ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు.

నిర్ధారణ

డివిటిని నిర్ధారణ చేయడానికి కలర్‌ డాప్లర్‌ స్కాన్‌(colour doppler scan) చేస్తారు. ఈ స్కాన్‌లో రక్తం గడ్డ ఎక్కువుందా, తక్కువుందా, ఏ స్థాయిలో ఉందనేది తెలుస్తుంది. క్లాట్‌ ఎక్కువగా ఉంటే థ్రాంబోలైసిస్‌(Thrambolaisis) చేస్తారు. తీవ్రత తక్కువగా ఉంటే యాంటి కోయాగ్యులెంట్‌ (రక్తాన్ని పలుచబరిచే మందులు) ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇస్తారు. చికిత్స కొంచెం కష్టమైనప్పటికీ సమస్యను ఎంత తొందరగా గుర్తించి చికిత్స చేస్తే ఫలితం అంత బాగుంటుంది. మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తూ, వీనోగ్రామ్‌ ద్వారా డీప్‌ వీన్‌ స్టెంటింగ్‌ చేస్తారు. అంటే గుండె రక్తనాళంలో బ్లాక్స్‌ ఏర్పడినప్పుడు స్టెంట్‌ వేసి సరిచేసినట్టుగా, కాలి రక్తనాళంలో ఏర్పడిన క్లాట్‌ను తొలగించడానికి కూడా స్టెంట్‌ వేస్తారు. దీన్నే వీనోగ్రామ్‌(venogram) అంటారు.

Read more about Deep Vein Thrombosis symptoms, causes and treatment

If you find any of the above mentioned of Deep Vein Thrombosis then
Book an Appointment with the best vascular surgeon in hyderabad

Consult Our Experts Now

About Author –

Dr. Bhavin L. Ram, Consultant Vascular & Endovascular Surgery, Yashoda Hospital, Hyderabad
MS, DNB (Vascular Surgery)

Dr. Bhavin L. Ram

MS, DNB (Vascular Surgery)
Consultant Vascular & Endovascular Surgeon
Yashoda Hospitals

Recent Posts

కళ్లకలక (కంజెక్టివైటీస్‌): రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

దగ్గు, జలుబు మాదిరి సీజనల్‌గా వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధుల్లో కళ్లకలక ఒకటి. కళ్లకలక సమస్య స్టాఫిలోకాకల్‌ బ్యాక్టీరియాల ద్వారా…

4 days ago

థైరాయిడ్ వ్యాధి: రకాలు, లక్షణాలు, కారణాలు & నియంత్రణ చర్యలు

థైరాయిడ్ గ్రంథి అనేది మెడ మధ్య స్వరపేటిక క్రింద భాగాన, కాలర్ ఎముక పైన సీతాకోక చిలుకను పోలిన ఆకారంలో…

1 week ago

హెపటైటిస్‌: రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

మన శరీరంలో కాలేయం అనేది చాలా ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా (రక్తాన్ని…

3 weeks ago

Demystifying Hysteroscopy: A Guide to this Vital Gynecological Procedure

Hysteroscopy has emerged as a valuable solution to various gynecological issues, offering both diagnostic and…

3 weeks ago

Endometriosis Surgery: Your Complete Guide to Treatment, Recovery, and Pain-Free Future

Endometriosis is a medical condition characterized by the growth of tissue similar to the lining…

4 weeks ago

కొలనోస్కోపీ ఎందుకు & ఎవరికి చేస్తారు? చికిత్స విధానాలు మరియు ప్రయోజనాలు

పెద్ద ప్రేగు అనేది జీర్ణవ్యవస్థలో ఒక ప్రధాన భాగం. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన విధులు నిర్వహిస్తుంది. ఇది ఆహారంలోని…

1 month ago