Neuroscience

సెరిబ్రల్ అట్రోఫీ- కారణాలు-లక్షణములు-చికిత్స విధానాలు

సెరిబ్రల్ అట్రోఫీ అనేది మెదడు కణాలను కోల్పోయే పరిస్థితి. మెదడు యొక్క కొంత భాగానికి లేదా మొత్తం మెదడుకు కణాలు కోల్పోవడం జరగవచ్చు. మెదడు ద్రవ్యరాశిలో తగ్గుదల, మరియు నరాల పనితీరు కోల్పోవడం వంటివి సెరిబ్రల్ అట్రోఫీలో స్పష్టంగా కనిపిస్తుంది. సెరిబ్రల్ అట్రోఫీ మూర్ఛలు (seizures), చిత్తవైకల్యం (dementia) మరియు మాట్లాడటం మరియు భాషను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలిగించవచ్చు.

కారణాలు

సెరిబ్రల్ అట్రోఫీకి అనేక  కారణాలు ఉండవచ్చు. అవి, అల్జీమర్స్ వ్యాధి, సెరిబ్రల్ పాల్సీ, హంటింగ్టన్ వ్యాధి మరియు ఇన్ఫెక్షన్స్. సెరిబ్రల్ అట్రోఫీకి కారణమయ్యే ఇతర వ్యాధుల్లో, ల్యూకోడిస్ట్రోఫీస్ (నాడీ కణాల చుట్టూ ఉండే రక్షణ పదార్థాన్ని దెబ్బతీసే వ్యాధులు), మల్టిపుల్ స్క్లెరోసిస్ (మెదడు మరియు వెన్నుపామును ప్రభావితం చేసే ఒక వ్యాధి, ఇది బలహీనత, సమన్వయ లోపం, సమతుల్యత లోపం మరియు ఇతర సమస్యలను కలుగచేస్తుంది), మరియు picks వ్యాధి (ఇది మెదడు యొక్క కొన్ని ప్రాంతాలను మాత్రమే ప్రభావితం చేసే చిత్తవైకల్యం).

లక్షణములు

సెరిబ్రల్ అట్రోఫీ మొత్తం మెదడును ప్రభావితం చేసినప్పుడు, చిత్తవైకల్యం, జ్ఞాపకశక్తి సమస్యలు మరియు వ్యక్తిత్వం మారడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. మెదడు యొక్క ఒక భాగం మాత్రమే ప్రభావితమైనప్పుడు, మూర్ఛలు, మాట్లాడటం మరియు దృష్టి సమస్యలు మరియు కదలిక కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా, సెరిబ్రల్ అట్రోఫీ యొక్క లక్షణాలలో మసకబారడం లేదా దృష్టి రెండుగా ఉండటం, మాట్లాడటం మరియు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, బలహీనమైన సమన్వయం, కొన్ని చోట్ల బలహీనత మరియు స్పర్శ్య కోల్పోవడం వంటివి ఉంటాయి.

ప్రమాద కారణాలు

సెరిబ్రల్ అట్రోఫీ అభివృద్ధి చెందడానికి సహాయపడే ప్రమాద కారణాలు వృద్ధాప్యం, మెదడుకు గాయం, అల్జీమర్స్, హంటింగ్టన్ మరియు ఆటోఇమ్యూన్ రుగ్మతలు. కొన్నిసందర్భాలలో తలగాయాలు సెరిబ్రల్ అట్రోఫీ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. సెరిబ్రల్ అట్రోఫీ యొక్క సంక్లిష్టతల్లో రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోవడం, స్వంతంగా పనులు చేసే శక్తి కోల్పోవడం మరియు నిరాశ వంటివి ఉంటాయి.

పరీక్షలు మరియు రోగనిర్ధారణ

సెరిబ్రల్ అట్రోఫీ నిర్ధారణలో సూచించిన పరీక్షలు చాలా సుదీర్ఘమైనవి మరియు సంక్లిష్టమైనవి. మాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ (MRI), కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT), పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET), మరియు సింగిల్-ఫోటాన్ ఎమిషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ (SPECT) వంటి న్యూరోఇమేజింగ్ టెక్నిక్స్ ఈ పరీక్షలలో ఉన్నాయి.

చికిత్సలు మరియు ఔషధాలు

మెదడు కణాల నష్టం లేదా పాక్షిక నష్టాన్ని పూర్తిగా నయం చేయలేము. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మాత్రమే దీనిని నియంత్రించవచ్చు లేదా తగ్గించవచ్చు. శారీరక చికిత్స ద్వారా రోజువారీ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. వినికిడి సమస్యలు ఉన్నవారు తమ అవసరాలకు బాగా సరిపోయే వినికిడి ఉపకరణం లేదా పరికరాన్ని ఉపయోగించవచ్చు.

సెరిబ్రల్ అట్రోఫీ ఉన్న రోగులకు విభిన్న చికిత్సలు సూచించబడతాయి. కాగ్నిటివ్ లేదా బిహేవియరల్ థెరపీ ద్వారా జీవన నాణ్యత మెరుగుపడితే, శారీరక చికిత్స ద్వారా కండరాల నియంత్రణ కోల్పోవడం తగ్గుతుంది. స్పీచ్ థెరపీ అఫాసియా యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది, ఇది బలహీనమైన మాట మరియు గ్రహణ శక్తి యొక్క పరిస్థితి. సెరిబ్రల్ అట్రోఫీకి దారితీసే అంతర్లీన ఇన్ఫెక్షన్ లేదా గాయాన్ని గుర్తించడం మరియు సరైన చికిత్స కోర్సును అందించడంలో సమర్థవంతమైన చికిత్సా ప్రక్రియ ఉంటుంది.

Yashoda Hospitals

Recent Posts

కళ్లకలక (కంజెక్టివైటీస్‌): రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

దగ్గు, జలుబు మాదిరి సీజనల్‌గా వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధుల్లో కళ్లకలక ఒకటి. కళ్లకలక సమస్య స్టాఫిలోకాకల్‌ బ్యాక్టీరియాల ద్వారా…

2 days ago

థైరాయిడ్ వ్యాధి: రకాలు, లక్షణాలు, కారణాలు & నియంత్రణ చర్యలు

థైరాయిడ్ గ్రంథి అనేది మెడ మధ్య స్వరపేటిక క్రింద భాగాన, కాలర్ ఎముక పైన సీతాకోక చిలుకను పోలిన ఆకారంలో…

7 days ago

హెపటైటిస్‌: రకాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

మన శరీరంలో కాలేయం అనేది చాలా ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి అవసరమైన రసాయనాలను సరఫరా చేసే ప్రయోగశాలగా (రక్తాన్ని…

2 weeks ago

Demystifying Hysteroscopy: A Guide to this Vital Gynecological Procedure

Hysteroscopy has emerged as a valuable solution to various gynecological issues, offering both diagnostic and…

3 weeks ago

Endometriosis Surgery: Your Complete Guide to Treatment, Recovery, and Pain-Free Future

Endometriosis is a medical condition characterized by the growth of tissue similar to the lining…

4 weeks ago

కొలనోస్కోపీ ఎందుకు & ఎవరికి చేస్తారు? చికిత్స విధానాలు మరియు ప్రయోజనాలు

పెద్ద ప్రేగు అనేది జీర్ణవ్యవస్థలో ఒక ప్రధాన భాగం. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన విధులు నిర్వహిస్తుంది. ఇది ఆహారంలోని…

1 month ago