డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీప్ వీన్ థ్రాంబోసిస్)

సిరల్లో రక్తం గడ్డలు (క్లాట్స్) ఏర్పడడం డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీప్ వీన్ థ్రాంబోసిస్) లేదా డివిటి(DVT) అంటారు. వయసు పెరిగిన వాళ్లకు, ఏదైనా సర్జరీ చేయించుకున్న తర్వాత, రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు, క్యాన్సర్ పేషెంట్లలో ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. కొందరిలో చిన్న వయసులో కూడా డివిటి రావొచ్చు. దీనికి కారణం జన్యుపరమైనది. జన్యులోపం వల్ల రక్తంలోని క్లాటింగ్ ఫ్యాక్టర్లు (రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడేవి) ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో గడ్డలు ఏర్పడే సమస్య ఉంటుంది. ఇలాంటివాళ్లలో కూడా డీప్ వీన్ థ్రాంబోసిస్ కనిపిస్తుంది.
లక్షణాలు
ఆరోజు రాత్రి బాగానే ఉంటారు. తెల్లవారి లేచి చూసేసరికి కాలు అంతా వాచిపోయి కనిపిస్తుంది. వాపుతో పాటు నొప్పి ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. సాధారణంగా మోకాలి కింద ఇలాంటి సమస్య వస్తుంది. అయితే కాలు మొత్తం లేదా చేతిలో కూడా ఇలా వాపు రావొచ్చు. ఇలా అకస్మాత్తుగా వాపు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఎందుకంటే కొన్నిసార్లు లోపల ఏర్పడిన గడ్డ (క్లాట్) హఠాత్తుగా చిట్లిపోవచ్చు. అలా బ్రేక్ అయిన గడ్డలు ఊపిరితిత్తులకు చేరి లంగ్ అటాక్ (ఊపిరితిత్తుల దాడి) రావొచ్చు. దీన్నే లంగ్ ఎంబోలిజం (lung embolism) అంటారు. ఇది అత్యవసర పరిస్థితి. కాబట్టి ఈ సమస్యను అశ్రద్ధ చేయొద్దు. ఇలా సడెన్గా కనిపించే సమస్యను acute dvtగా పరిగణిస్తారు. అక్యూట్ డీప్ వీన్ థ్రాంబోసిస్‌ని నిర్లక్ష్యం చేస్తే క్రానిక్ డివిటికి వ్యాధి. దీనివల్ల అల్సర్లు ఏర్పడతాయి. ఈ పుండ్లు మానకుండా ఎక్కువ అవుతాయి. డివిటిని నిర్లక్ష్యం చేసిన వాళ్లలో కాలు వాపు, నొప్పితో పాటు ఇలా మానని పుండ్లు ఏర్పడితే ఆ స్థితిని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు.
నిర్ధారణ
డివిటిని నిర్ధారణ చేయడానికి కలర్ డాప్లర్ స్కాన్(కలర్ డాప్లర్ స్కాన్) చేస్తారు. ఈ స్కాన్‌లో రక్తం గడ్డ ఎక్కువందా, తక్కువుందా, ఏ స్థాయిలో ఉందనేది తెలుస్తుంది. క్లాట్ ఎక్కువగా ఉంటే థ్రాంబోలైసిస్(థ్రాంబోలైసిస్) చేస్తారు. తీవ్రత తక్కువగా ఉంటే, కోయాగ్యులెంట్ (రక్తాన్ని పలుచబరిచే మందులు) ఇంజెక్షన్లు, టాబ్లెట్లు ఇస్తారు. చికిత్స కొంచెం కష్టమైనప్పటికీ సమస్యను ఎంత తొందరగా గుర్తించి చికిత్స చేస్తే ఫలితం అంత బాగుంటుంది. మెడికల్ ట్రీట్‌మెంట్ ఇస్తూ, వీనోగ్రామ్ ద్వారా డీప్ వీన్ స్టెంటింగ్ చేస్తారు. అంటే గుండె రక్తనాళంలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు స్టెంట్ వేసి సరిచేసినట్టుగా, కాలి రక్తనాళంలో ఏర్పడిన క్లాట్‌ను తొలగించడానికి కూడా స్టెంట్ వేస్తారు. దీన్నే వీనోగ్రామ్(వెనోగ్రామ్) అంటారు.
గురించి మరింత చదవండి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లక్షణాలు, కారణాలు మరియు చికిత్స
పైన పేర్కొన్న వాటిలో డీప్ వెయిన్ థ్రాంబోసిస్‌ను మీరు కనుగొంటే
దీనితో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి హైదరాబాద్‌లో ఉత్తమ వాస్కులర్ సర్జన్
రచయిత గురించి -
డాక్టర్ భవిన్ ఎల్. రామ్, కన్సల్టెంట్ వాస్కులర్ & ఎండోవాస్కులర్ సర్జరీ, యశోద హాస్పిటల్, హైదరాబాద్.
MS, DNB (వాస్కులర్ సర్జరీ)


















బుక్ చేయండి
WhatsApp
కాల్
మరిన్ని