పేజీ ఎంచుకోండి

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? రకాలు,, కారణాలు, జాగ్రత్తలు, చికిత్స

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? రకాలు,, కారణాలు, జాగ్రత్తలు, చికిత్స

మన శరీరంలో ఉండే రక్తం అనేక రకాలైన కళ్లను కలిగి ఉండి నిరంతరం శరీరమంతా ప్రవహిస్తూ ఉంటుంది. రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, హీమోగ్లోబిన్, ప్లాస్మా, కొలెస్ట్రాల్ మొదలైనవి ఉంటాయి. మన రక్తంలో ఉండే కొవ్వును కొలెస్ట్రాల్ అంటారు, కాలేయం కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేసి రక్తంలోకి పంపుతుంది, మనం తీసుకునే ఆహారం ద్వారా కొంత కొలెస్ట్రాల్ రక్తంలోకి చేరుతుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. కాలేయం నుండి ఉత్పత్తి అయ్యే కొలెస్ట్రాల్ కాకుండా మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా కొలెస్ట్రాల్ మన రక్తంలోకి వెళ్తుంది. కొలెస్ట్రాల్ ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు అనేది చాలా మందిలో ఉంటే అపోహ. మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ అంతా హానికరం కాదు, మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ మరియు చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అలాగే చెడు కొలెస్ట్రాల్ అనారోగ్యాన్ని కలగజేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరగడం వలన శరీరంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

కొలెస్ట్రాల్ రకాలు

మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ రెండు రకాలుగా విభజించబడింది, అవి హై డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL) , లో డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL). వీటిలో అధిక సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ ను మంచి కొలెస్ట్రాల్ గాను, తక్కువ సాంద్రత కలిగిన కొలెస్ట్రాల్ ను చెడు కొలెస్ట్రాల్ గాను పరిగణిస్తారు. ఉంటే మంచి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కాలేయానికి వెళ్లడంలో తోడ్పడుతుంది, కాలేయంలో ఈ చెడు ఉంటుంది. కొలెస్ట్రాల్ విచ్చినమవుతుంది. ఒకవేళ చెడు కొలెస్ట్రాల్ పరిమాణం ఎక్కువగా ఉంటే ఇది రక్తప్రసరణకు అడ్డంకిగా మారుతుంది దీనివలన గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

అధిక కొలెస్ట్రాల్ వలన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

మన శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే అది కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి.

  • గుండె దడ : మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగితే అవి రక్తప్రసరణను అడ్డుకుంటాయి. దీని కారణంగా మనం కొంచెం వేగంగా నడిచినా, పని చేసినా కూడా గుండె దడ వస్తుంది.
  • ఛాతీ నొప్పి : రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వలన గుండె నుండి శరీరభాగాలకు అందవలసిన రక్తం వాటికి అందడంలో జాప్యం అవుతుంది. దీని వలన గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా గుండె లేదా ఛాతీలో నొప్పి కలుగుతుంది.
  • శరీరంపై గడ్డలు : రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వలన శరీరంలో గడ్డలు ఏర్పడే అవకాశం ఉంది, ఈ గడ్డలు శరీరంలో ఏ భాగంలోనైనా ఏర్పడవచ్చు. ఈ గడ్డలు లేదా బూడిద రంగులో లేదా తెలుగు రంగులో ఉండవచ్చు.
  • శ్వాసక్రియలో ఇబ్బంది : కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వలన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది, కొన్ని సార్లు ఛాతీ మీద ఉన్నట్టు అనిపిస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది.
  • కాళ్ళు తిమ్మిరి : రక్తంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వలన అది శరీరంలో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీనివలన కాళ్ళకు రక్తం అందక తిమ్మిరి ఏర్పడడం, స్పర్శ తెలియకపోవడం జరుగుతాయి.
తరచూ ఆయాసం, ఛాతిలో నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకండి

కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వలన కలిగే ప్రమాదాలు

మన శరీరంలో సరైన మోతాదులో కొలెస్ట్రాల్ ఉండాలి, కానీ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు అనేక అనారోగ్యాలను కలగజేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ వలన కలిగే ప్రమాదాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

గుండె జబ్బులు : మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వలన ముఖ్యంగా గుండెజబ్బులు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వలన రక్తప్రసరణ తీరు దెబ్బతింటుంది. దీనివలన గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది, కొన్ని సందర్భాల్లో గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.

అధిక రక్తపోటు : కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వలన అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. దీనివలన శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉంది.

మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎంత ఉండవచ్చు?

మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ కలిపి కొలెస్ట్రాల్ గా పరిగణిస్తారు. కొలెస్ట్రాల్ స్థాయులు ఎలా ఉండాలని ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.

  • మొత్తం కొలెస్ట్రాల్ 200 mg/DL ఉంటే అది ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటుంది. ఇందులో HDL స్థాయులు 40 mg/DL కంటే తక్కువగా, LDL స్థాయులు 100 mg/DL కంటే తక్కువగా, ట్రైగ్లిజరైడ్స్ స్థాయులు 150 mg/DL తక్కువగా ఉండాలి.
  • మొత్తం కొలెస్ట్రాల్ స్థాయి 200 నుండి 240 mg/DL మధ్యలో ఉంటే ఇది కొంచెం ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంది. ఇందులో HDL స్థాయులు 60 mg/DL కంటే తక్కువగా, LDL స్థాయులు 160 mg/DL కంటే తక్కువగా, ట్రైగ్లిజరైడ్స్ స్థాయులు 200 mg/DL కంటే తక్కువగా ఉండాలి. కొలెస్ట్రాల్ స్థాయులు ఈ విధంగా ఉంటే వైద్యులను సంప్రదించి వారు సూచించిన మేరకు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
  • మొత్తం కొలెస్ట్రాల్ స్థాయులు 240 దాటితే అది ప్రమాదకరమైన స్థాయిలో ఉంది, ఇలాంటి సందర్భంలో ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్యులు సూచించిన మందులు తీసుకోవాల్సి ఉంటుంది.

కొలెస్ట్రాల్ స్థాయులు పెరగడానికి కారణాలు

అధిక కొలెస్ట్రాల్ మన శరీరంపై అనేక రూపాలను చూపుతుంది, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరగడానికి కారణాలు ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.

  • ఆహారం : సాధారణంగా స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారం మన ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వలన మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి.
  • కనీస శారీరక శ్రమ లేకపోవడం: ప్రతీరోజూ మనం శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటాం, ఇలాంటి శారీరక శ్రమ లేకపోతే దాని వలన కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి.
  • ధూమపానం : ధూమపానం చేయడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి.
  • మద్యం : మద్యపానం వలన కూడా మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి.
  • మధుమేహం : మధుమేహం లేదా చక్కెర వ్యాధి వలన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువయ్యే అవకాశం ఉంది.
  • హైపోథైరాయిడిజం : మన శరీరంలో ఉండే థైరాయిడ్ గ్రంధి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయలేని పరిస్థితి హైపోథైరాయిడిజం అంటాం, ఈ సమస్య వలన కూడా మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి.
  • మానసిక ఒత్తిడి: మానసిక ఒత్తిడి అనేది నేరుగా కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి కారణం కాకపోయినా, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు అధికం అవ్వడానికి కారణమయ్యే చర్యలను సిద్ధం చేస్తుంది.

కొలెస్ట్రాల్ కారణాలు

అధిక కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి?

మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు అధికంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయి, ముఖ్యంగా గుండెపోటు లాంటి సమస్యలు తలెత్తుతాయి, కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను ఖచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించాలి.

  • వ్యాయాయం : చాలామందిలో కనీస శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు అధికంగా ఉంటున్నారు. కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంచుకోవడానికి ప్రతీరోజూ కనీస వ్యాయామం చేయాలి.
  • బరువు నియంత్రణ: ఊబకాయం ఉన్నవారిలో మరియు ఎక్కువ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి బరువు దాదాపుగా శారీరక బరువు నియంత్రణ ఉంచుకోవాలి.
  • ధూమపానం మానడం : సిగరెట్ త్రాగడం లేదా నికోటిన్ తీసుకోవడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి, పైగా ధూమపానం అనేక రకాలైన ఇతర అనారోగ్యాలకు కూడా కారణం అవుతుంది. కాబట్టి ధూమపానాన్ని మానాలి.
  • మద్యపానం నియంత్రణ : కొలెస్ట్రాల్ స్థాయులు పెరగడానికి మద్యపానం కూడా కారణం అవుతుంది, కాబట్టి మద్యపానాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి.
  • ఆహారంలో మార్పులు: మనం ప్రతీరోజూ తీసుకునే ఆహారం వలన కూడా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి. జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవాలి.

కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం

మన శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ అందిస్తూ చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడానికి తీసుకోవాల్సిన ఆహారం ఇక్కడ తెలుసుకోండి..

  • ఆలివ్ నూనె
  • బాదం
  • ఓట్స్
  • ఆకుకూరలు
  • నారింజ, నిమ్మ
  • పాలు
  • బార్లీ
  • వంకాయ
  • చేపలు
  • సోయా

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకోకూడని ఆహారం

  • బీఫ్, మటన్
  • పామాయిల్ , కొబ్బరి నూనెతో చేసిన పదార్ధాలు
  • పిజ్జా, బర్గర్
  • ఫాస్ట్ ఫుడ్

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ చికిత్స

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఈ పద్దతుల ద్వారా కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గకపోతే కొన్ని రకాల మందుల ద్వారా కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చు.పేషెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను వైద్యులు ఈ మందులను సూచిస్తారు. అయితే ఈ మందులు తీసుకుంటూ కూడా డాక్టర్ సూచించిన విధంగా వ్యాయామం, జీవనశైలి మార్పులను కచ్చితంగా పాటించాలి.

ముగింపు

ప్రతీ ఒక్కరి శరీరంలోనూ మంచి కొలెస్ట్రాల్ మరియు చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. వీటి స్థాయి సాధారణంగా ఉన్నంతవరకు ఎటువంటి సమస్య ఉండదు, ఐతే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగేకొద్దీ గుండెపోటు తో సహా అనేక రకాలైన అనారోగ్యాలకు కారణం అవుతుంది. కాబట్టి ప్రతీ సంవత్సరం రక్తంలో ఉండే కొలెస్ట్రాల్‌లను పరీక్షించి దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి సందేహాలు ఉన్నాయా? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం! మా అనుభవం ఉన్న నిపుణుల సలహా కొరకు + 918065906165 కి కాల్ చేయగలరు.