%1$s

వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

monsoon

వాతావరణంతడిగా మారిపోయింది. చినుకుల మాటున చింత కూడా దాగి ఉందని తెలుసుకుంటే మంచిది. 

ఒక వారం రోజుల నుంచీ వాతావరణ పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది, ఇలా ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్‌ఫెక్షన్లు దాడిచేస్తాయి, చల్లగా ఉన్న వాతావరణం వైరస్‌ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్‌లో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాల ప్రభాదం తీవ్రంగా ఉంటుంది. ప్రతి పదిమందిలో ముగ్గురు- నలుగురికి జలుబు, ఇద్దరు-ముగ్గురికి జ్వరంతో కూడిన వైరల్‌ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.

వైరల్‌ ఫీవర్‌ అంటే ఏమిటి ?

వైరల్‌ జ్వరాలు అకస్మాత్తుగా సోకుతాయి. తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 102 డిగ్రీల జ్వరం ఉంటుంది. జ్వరం 102 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండొచ్చు. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పుల మధ్య రోగి నిస్సత్తువగా మారిపోతారు. కొందరిలో ఒంటిమీద దద్దుర్లు, వాంతులు, అరుదుగా విరేచనాలూ కనిపిస్తాయి. కొందరిలో జలుబు వంటి లక్షణాలేవీ లేకుండానే జ్వరాలు వేధిస్తుంటాయి. సాధారణంగా వీటిని ‘విష జ్వరాలు” అంటారు. వాటంతట అవే తగ్గిపోయే సాధారణ వైరల్‌ జ్వరాలూ కూడా కొన్నిఉంటాయి. అలాగే తప్పనిసరిగా చికిత్స తీసుకోవల్సిన మలేరియా, డెంగీ, చికున్‌ గున్యా వంటివీ వైరల్ ఫీవర్ క్రిందికే వస్తాయి.

వైరల్ ఫివర్స్ ఎందుకు వస్తాయి ?

వైరల్‌ ఫీవర్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు శ్వాసనాళాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు కూడా వైరల్‌ ఫీపర్స్‌ విజృంభిస్తాయి. చల్లదనం తీవ్రత పెరగడం వల్ల రక్సనాళాలు కుంచించుకుపోతాయి . దీంతో రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తీ తగ్గిపోతుంది. ఈ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు, పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. జన సముదాయం ఎక్కువగా ఉన్నచోట వైరస్‌ ఎక్కువగా లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జ్వరాలు పిల్లల్లో త్వరగా వ్యాప్తి చెందుతాయి.

వైరల్ ఫీవర్ లక్షణాలు ఏమిటి ?

వైరల్‌ ఫీవర్‌ సోకితే ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరసం,నిస్సత్తువ, స్కీన్‌ రాషెస్‌, వికారం, తలనొప్పి, ఆకలి మందగించడం, గొంతునొప్పి, ముక్కు కారడం,దగ్గు, గొంతు నొప్పి, ఉదరంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాల తీవ్రత తగ్గడానికి వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి మాత్రమే మందులు ఉపకరిస్తాయి.

వైరల్ ఫీవర్ ప్రభావాలు ఏమిటి ?

శరీరంలోని కణాల మీద వైరస్ ఎటాక్ అవుతుంది. చాలా వరకు వైరల్ ఫీవర్ వల్ల శరీరం పైభాగం ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. వైరస్ చాలా పవర్ ఫుల్ గ ఉంటె నరాల మీద ప్రభావితం చేస్తుంది. దానితో వివిధ రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది . పేషెంట్ బలహీనంగా మారిపోతారు. ఆహారం పూర్తిగా తీసుకోలేరు.

వైరల్ ఫీవర్ కి ప్రధమ చికిత్స ఏమిటి

వైరల్ ఫీవర్ కు సంబందించిన లక్షణాలలో ఈ రెండు మూడు కనిపించిన రోగికి ఎక్కువగా నీళ్లు తాగించాలి. దీని వల్లన శరీరం డిహైడ్రాషన్కి గురికాకుండా ఉంటుంది. త్వరవాత రోగికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. తేలికపాటి ఆహారం ఇవ్వాలి. ముఖ్యంగా రోగి ఆందోళనకి గురికాకుండా చూసుకోవాలి. తాజా కొత్తిమీరతో చేసిన టీ, మెంతి వాటర్‌ తాగించాలి. దీనివల్ల వైరస్‌ నాశనం అవుతుంది. పెద్దవాళ్షకైతే గంజి తాగించడం మంచి పద్ధతి. ఇది వైరస్‌ను ఎక్కువ కాలం బతకనివ్వదు.

నిర్దారణ ఎలా?

జ్వరం విపరీతంగా ఉండి, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే అన్ని రకాల రక్త పరీక్షలూ చేస్తారు. డెంగీ అనుమానం ఉంటే ‘ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌’ పరీక్ష చేస్తారు. అలాగే విపరీతమైన చలి, జ్వరం ఉంటే మలేరియాగా అనుమానించి ‘ర్యాపీడ్‌ డయాగ్నొస్టిక్‌ టెస్ట్‌ పరీక్ష చేస్తారు.వీటిద్వారా వైరల్‌ ఫీవరా? ఇతర వ్యాధులా తెలుస్తుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వైరల్‌ ఫీవర్‌ ఇనె క్షన్‌ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఆహారం షేర్ చేసుకోవద్దు. సాధారణ వైరల్‌ ఫీవర్‌ తొమ్మిది రోజులు ప్రభావం చూపిస్తుంది. చల్లదనానికి సూక్ష్మక్రిముల బారినుండి కాపాడే శరీరభాగాలు శక్తీ హీనంగా మారిపోయి సూక్ష్మక్రిములు సులువుగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి చల్లదనం బారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షంలో వెళ్లే గొడుగు, రెయిన్‌ కోట్స్‌ తప్పనిసరిగా వాడాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి. పిల్లల లంచ్‌ బాక్స్‌లో పండ్లు ఎక్కువగా పెట్టాలి. నూనె పదార్థాలు తక్కువగా ఇవ్వాలి. వర్షంలో తడిసీనప్పుడు జలుమీ చేస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, సాధారణంగా ఈ కాలంలో కనిపించే ‘గొంతు నొప్పి’కి 90% వైరస్‌లే కారణం, కాబట్టి దానిని తగ్గించేందుకు గోరు వెచ్చటి నీటిలో ఉప్పు వేసుకొని తరుచుగా పుక్కిట పట్టటం, లేదా మార్కెట్లో లభించే యాంటీసెప్టిక్‌ లోషన్లు నీటిలో వేసుకొని పుక్కిట పట్టటం మంచిది, కొద్దిమందికి స్టైష్టోకాకల్‌ వంటి బ్యాక్టీరియా వల్ల గొంతునొప్పి రావచ్చు. గొంతు నొప్పే తగ్గకున్నా, తెల్లటి చీము పొక్కుల వంటివి కనబడుతున్న వైద్యులని కలవాలి.

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా ?

వ్యాధి నిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడంలో మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లలకు చాయ్‌, బిస్కెట్‌, సమోసా వంటివి అలవాటు చేయొద్దు. స్నాక్స్‌ బదులుగా పండ్లు తినిపిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.నిమ్మ, నారింజ వంటి సిట్రస్‌ జాతి ఫలాలను ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567