%1$s

అధిక రక్తపోటు గుర్తించటం ఎలా మరియు హైపర్ టెన్షన్ కి కారణాలు

hypertension-symptoms

ఈ మధ్య కాలంలో హైపర్‌టెన్షన్‌ బారినపడే వారి నంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మందికీ ప్రారంభంలో తమకు హైపర్‌టెన్షన్‌ ఉందనే భావన కూడా ఉండడం లేదు. తీవ్ర స్థాయికీ చేరుకుంటే కానీ వైద్యుడి వద్దకు పరుగులు తీయడం లేదు. తలనొప్పి, జ్వరం, దగ్గు శరీరపు నొప్పులతో వచ్చే వారికి పరీక్షలు చేస్తే హైపర్‌ టెన్షన్‌ బయట వడుతుందని, అప్పటి వరకు వారికి తమకు ఫలాన ఇబ్బంది ఉందనే భావన వారికి తెలియడం లేదని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. నూటికి 80 శాతం మందికీ హైవర్‌టెన్షన్ ఉందని తెలియడం లేదంటున్నారు. ముఖ్యంగా మధుమేహం, పక్షవాతం మరియు కిడ్నీ ఫెయిల్యూర్, థైరాయిడ్, ఆర్థో సమస్యలు ఉన్నవారు హైపర్‌టెన్షన్‌తో ఎక్కువగా బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.

హైపర్‌టెన్షన్‌ ఏ వయసులో వస్తుంది ?

కొందరు ఏ కారణం లేకుండానే హైపర్‌టెన్షన్‌ బారిప వడుతున్నారు. దీని బారిన పడిన వారికీ చాల మందికి కారణాలే తెలియడం లేదు. కొందరిలో రెండు పదులు దాటితే… వంశపారం పర్యంగా హైపర్‌టెన్షన్‌ వచ్చే అవకాశముంది. కొందరికి 18 ఏళ్ల వయస్సులోనే హైపర్‌టెన్షన్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. పరీక్షలు వేస్తేగానీ బీపీ ఉందనేది నిర్దారణ కాదు. యువతలో ఈ నమన్య ఎక్కువగా కనిపిస్తోంది. 20నుంచి 30 ఏళ్ల వయస్సు వారిలో 5 శాతం, 30 నుంచి 40ఏళ్ల వారిలో 10 శాతం, 40 నుంచి 50 ఏళ్ల వయస్సు వారిలో 5 శాతం, 50 నుంచి 60 ఏళ్ల వారిలో 15 శాతం మంది హైపెర్టెన్షన్ తో ఇబ్బంది పడుతున్నారు.. ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒక యువతికి ఉండవచ్చని వ్యాధులు పరిగణిస్తున్నారు.

హైపర్ టెన్షన్ కి కారణాలు:

ఉదయం ఇంటి నుంచి బయలుదేరితే ఏ ఆర్థరాత్రికే వస్తున్నారు. దీంతో భోజనం చేయాలనే ఆలోచనే ఉండడం లేదు. ఎక్కడ పడితే ఆక్కడ, ఏదీ పడితే అది తినేస్తున్నారు. ఇందులో ఉప్పు ఉన్న ఆహార పదార్ధాలే ఎక్కువ ఉంటున్నాయి. ప్రానెస్‌ ఫుడ్‌, పీజ్జాలు, బర్గర్‌లు, రెడీమేడ్‌ మాంసం, కూల్‌డ్రింక్‌లు, ప్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిలో 20 శాతం ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఆల్కాహాల్‌ 1.2 ఎంఎల్‌కు మించితే బీపీ పెరిగే అవకాశాలూ ఉన్నాయి. దాదాపు 15 శాతం ట్రాఫిక్‌ టెన్షన్‌తో జనం హైవర్‌టెన్షన్‌కు గురువుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. ట్రాఫిక్‌లో ఎక్కువగా తిరిగే వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌ ఫీల్డ్‌, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్, సేల్స్‌మెన్‌, డైవర్సు ఇలా తదితర వర్గాల్లో హైవర్‌టెన్షన్‌కు గురవుతున్నఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

హైపర్ టెన్షన్ వల్ల ప్రమాదాలు:

హైవడ్‌టెన్షన్‌తో దాదాపు 10 శాతానికి మించి గుండె జబ్బుకు గురువతున్నట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. హైపర్‌టెన్షన్‌తో ఉన్నవారిలో పది శాతం మంది పక్షవాతం బారిన పడగా… మరో అయిదు శాతం కిడ్నీసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ టెన్షన్ వల్ల కొందరికీ బైయిన్‌ స్టోక్‌ కూడా వచ్చే ప్రమాదముంది. ఇటీవల కాలంలో బ్రెయిన్‌ స్టోక్‌ గుండె సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. హైపర్‌టెన్షన్‌ ఉన్నవారికీ కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడుతాయి. దీని వల్ల కిడ్నీ దెబ్బతిని పని వేయకుండా పోయే ప్రమాదముంది. ఆదేవిధంగా రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడడం వల్ల గుండె, బ్రెయిన్‌ స్ట్రోక్‌లు వస్తున్నాయి.

నిద్రపోయే సమయంలో బీపీ ఉంటే ఆది ప్రాణానికి ముప్పుగా మారుతుంది. చాలా మందికీ ఉదయం ఉండేస్థాయిలో పడుకున్న తరువాత బీపీ ఉండదు. రాత్రి పూట బీపీ ఎక్కువ ఉంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదము ఉంటుంది. 24 గంటల్లో బీపీ స్థాయి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆంబులేటరి బీపీ మానిటర్‌ ద్వారా పరీక్షించుకోపచ్చు. దీని వల్ల ఏ సమయంలో బీపీ ఉందొ తెలుస్తుంది.

హైపర్ టెన్షన్ ను గుర్తించటం ఎలా:

బిపి అతి తీవ్ర స్థాయికీ పెరిగినప్పుడు వివరీతమైన తలనొప్పి నిద్రలేమి, చూపు మసకభారతం, విపరీతమైన అలనట, చెవుల్లో రింగుమని శబ్దాలు రావడం, శ్వానతీనుకోవడంలో ఇబ్బంది, గుండె దడ, తికమక పడటం లక్షణాలు కనిపిస్తాయి. గుండెకు రక్తం అందించే ధమనులు కుచించుకుపోతాయి. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి పక్షవాతం రావచ్చు. కళ్లు దెబ్బతింటాయి. మూత్రపిండాలు, గుండె పనితీరు మందగించి ప్రాణాలకు ముప్పు రావచ్చు. హైపర్‌టెన్షన్‌ను సులువుగా అదుపు చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి అలవాట్లతో నిరోధించవచ్చు.  వ్రమాదకరస్థాయికి చేరకుండా నిరోధించేందుకు జాగ్రతగా చికిత్స అందించాలి.

హైపర్ టెన్షన్ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ప్రతిరోజూ తవ్పని నరిగ్గా 30నుంచి 45 నిమిషాలు నడవాలి
  • అస్తమానం కుర్ఫీకే అతుక్కుని కూర్చోకుండా (ప్రతి అరగంటకు ఒకసారి నడవాలి.)
  • ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జూగ్రత్త వహించాలి.
  • ఆరటి బత్తాయి, కమలాలు,ద్రాక్ష వంటి ఫలాలు ఎక్కువగా తీనుకోవాలి.
  • తినే ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి.
  • ఎర్రటీ మాంసం, మీగడ, వెన్న, నూనే వంటి వాటికీ దూరంగా ఉండాలి.
  • ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
  • బయటీ ఆహార పదార్ధాల జోలికి వెళ్లొద్దు.
  • బరువు పెరగకుండా చూనుకోవాలి. నిత్యం వ్యాయామం, యోగా చేయాలి.
  • చిన్న చిన్న విషయాలకు టెన్షన్‌కు గురికావద్దు
  • ఉదయం, సాయంత్రాల్లో మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచింది.
  • టెన్షన్‌కు గురవుతున్న నమయంలో నచ్చిన వారితో మాట్లాడడం మరియు పాటలు వినడం చేయాలి.

హైపర్‌టెన్షన్‌ ఉన్నవారు ఏమి చేయాలి

  • జీవితాంతం మందులు వేనుకుంటూనే ఉండాలి…
  • తరుచు వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి.
  • మందుల వాడకాన్ని ఒకరోజు కూడా నిలిపేయొద్దు.
  • ఆరోగ్య పరిస్థితిని బట్టి మందుల వాడకం మార్చుకోవాలి
  • షుగర్ , గుండె , థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి
  • కొలస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి.
  • మద్యపానం , సిగరెట్టను పూర్తిగా మానేయాలి.
  • మీకు నచ్చని అంశాలపై చర్చ జరుగుతుంటే ఆక్కడి నుంచి తప్పుకోవడం మంచిది.
  • కారం, ఉప్పు వాడకం చాలా వరకు తగ్గించాలి.

Source: https://epaper.andhrajyothy.com/c/39473345

X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567